మీ వాషింగ్ మెషీన్ వైర్‌లను ఎలుకలు కొరికేస్తున్నాయా? ఇలా చేస్తే ఎలుకల నుంచి మీ వాషింగ్ మెషీన్‌ను రక్షించుకోవచ్చు!

మీ వాషింగ్ మెషీన్‌ లోపలి భాగాలలోకి ఎలుకలు తేలికగా మార్గం చేసుకుని చొచ్చుకుపోయి, వైర్‌ల యొక్క ఇన్సులేషన్‌ను కొరికేసి, సెకన్ల సమయంలో మీ మెషీన్‌ను పాడు చేయగలవు.

వ్యాసం నవీకరించబడింది

Are rats chewing up your Washing Machine wires? Here's how you can easily protect your Washing Machine from rats!
ప్రకటన
Surf Excel Matic Liquid

వేడి మరియు తేమ గల వాతావరణాలు ఎలుకలను ఆకర్షిస్తాయి. అవి మెషీన్‌ సమీపంలో లేదా లోపల చనిపోవచ్చు కూడా. ఈ కారణంగా దుర్గంధం వ్యాపించడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం, మరియు ఇతర సమస్యలు ఏర్పడవచ్చు. మీ వాషింగ్ మెషీన్ వైర్‌ల నుంచి ఎలుకలను దూరంగా ఉంచేందుకు ఈ చిట్కాలను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి, పాటించండి.

రంధ్రాలను వైట్ సిమెంట్‌తో పూడ్చివేయండి. అన్నిటి కంటే ఇదే అత్యుత్తమ మార్గం, ఎందుకంటే ఇది సుదీర్ఘ కాలం పాటు నిలిచి ఉంటుంది.

1) శబ్దాలను గమనించండి

ఎలుకలు సహజంగా కిటికీల నుంచి దూరతాయి మరియు చాలా తరచుగా మాత్రమే తెరచిన తలుపుల గుండా లోపలకు వస్తాయి. చిట్టెలుకలు, ఎలుకలు మరియు చుంచులపై ఓ కన్నేసి ఉంచండి.

2) లోపలకు వచ్చే మార్గాలను మూసివేయండి

½ అంగుళం ఖాళీ ఉన్నా సరే, అందులో నుంచి కూడా ఎలుకలు లోపలకు దూరగలవు. అలాంటి ప్రదేశాలను గుర్తించండి. రబ్బర్ ఫోమ్‌తో లేదా స్టీల్‌ ఊల్‌తో ఆయా ప్రదేశాలను మూసివేయండి.

ప్రకటన
Surf Excel Matic Liquid

3) వాషింగ్ మెషీన్ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి

వాషింగ్ మెషీన్‌కు చుట్టుపక్కల తినే వస్తువులు ఉంచడం అంటే, ఎలుకలకు ఆహ్వానం పలకడం లాంటిదే అని చెప్పవచ్చు. తిండి పదార్ధాలకు చెందిన మెతుకులను వాషింగ్ మెషీన్‌కు దూరంగా ఊడ్చేయండి మరియు ఆ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త వహించండి.

4) వైర్‌లు, కేబుల్స్ ను కనిపించనివ్వకండి

వైర్‌లను గోడలకు వేలాడదీసేందుకు కార్డ్ క్లిప్‌లను ఉపయోగించండి. మరుగున ఉంచబడిన సర్జ్ ప్రొటెక్టర్ ద్వారా కూడా వాటిని భద్రపరచవచ్చు.

5) ఇంటి చిట్కాలు పనికొస్తాయి సుమా

మిరియాల ద్రావకం చాలా బాగా పని చేస్తుంది. కొన్ని దూది ఉండలను మిరియాల ద్రావకంలో నానబెట్టండి. మీ గృహోపకరణాలకు సమీపంలో, మీకు తరచుగా ఎలుకలు కనిపించే ప్రదేశాలలో వాటిని వ్యూహాత్మకంగా ఉంచండి. అవి వాసనను కోల్పోయినప్పుడు వాటిని మార్చండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది