మీ వాషింగ్‌ మెషీన్‌ దుర్వాసన రావడంతో విసిగిపోతున్నారా? ఈ అబ్బురపరిచే సూచనలు ప్రయత్నించండి.

వాషింగ్‌ మెషీన్‌లో ఉన్న దుర్గంధం మీ బట్టలు దుర్వాసన వచ్చేలా చేయవచ్చు. చింతించకండి, అవాంఛిత దుర్వాసనను మీ వాషింగ్‌ మెషీన్‌ నుంచి వదలగొట్టేందుకు ఈ మూడు సరళ సూచనలు పాటించండి.

వ్యాసం నవీకరించబడింది

Find a Washing Machine That Fits Your Budget and Your Family!
ప్రకటన
Surf Excel Matic Liquid

వాషింగ్‌ మెషీన్‌ అత్యధిక సమయం తేమగా ఉంటుంది, దీనివల్ల ఇది బూజుకు మరియు ఫంగస్‌కి గురవుతుంటుంది. ఇవి పెరగడం మీ వాషర్‌ దుర్వాసన వచ్చేలా చేయవచ్చు, దీనివల్ల కూడా మీ బట్టలు దుర్వాసన రావచ్చు.

చింతించకండి, ఇలా జరగకుండా చూసేందుకు ఈ కింది సూచనలు ఉపయోగించండి.

వినిగర్‌ అనేది సహజమైన క్లీనింగ్‌ సొల్యూషన్‌ అయినప్పటికీ, దీనిని తుడిచేటప్పుడు మీరు రబ్బరు గ్లౌజులు ఉపయోగించాలి.

1) రెగ్యులర్‌ సంరక్షణ

మీ వాషింగ్‌ మెషీన్‌లో దుర్వాసనను నిరోధించేందుకు మీరు చేయగల అత్యుత్తమ పనుల్లో ఒకటి, దానికి గాలి తగలనివ్వడమే. లోడ్‌ చేసిన తరువాత తడి బట్టలను సాధ్యమైనంత వెంటనే తొలగించండి. గ్లాసును తుడవండి మరియు డోర్‌ గాస్కెట్‌ని పొడిగా ఉంచండి మరియు ఇంటీరియర్స్‌ ఆరిపోయేందుకు వీలుగా వాషర్‌ని తెరిచి ఉంచండి.

ప్రకటన

Surf Excel Matic Liquid

2) సహజ క్లీనర్స్‌కి ప్రాధాన్యం ఇవ్వండి

తెల్ల వినిగర్‌ మరియు బేకింగ్‌ సోడా లాంటి సహజమైన ఇంటి ఘటికాంశాలు అద్భుతాలు చేస్తాయి. 2 కప్పుల వేడి నీళ్ళు, 3 కప్పుల వినిగర్‌ మరియు ¼ కప్పు బేకింగ్‌ సోడా కలపండి.

బ్లీచ్‌ మాదిరిగా వినిగర్‌ క్రిమిసంహారం చేస్తుంది, కానీ ఇది చాలా తేలికపాటిదిగా ఉంటుంది. వాష్‌టబ్‌లోని ఏదైనా సబ్బు అవశేషాన్ని కరిగించడానికి కూడా దీని ఎసిడిటి సహాయపడుతుంది. సబ్బు మలినాన్ని కూడా బేకింగ్‌ సోడా శుభ్రంచేస్తుంది మరియు వాసన పోగొట్టడానికి సహాయపడుతుంది.

3) నీటిని శుభ్రం చేయండి

మీ టాప్‌-లోడింగ్‌ లేదా ఫ్రంట్‌-లోడింగ్‌ మెషీన్‌ యొక్క గ్లాసు మరియు తలుపును వారంవారం శుభ్రం చేయండి. గోరువెచ్చని నీటిని మరియు సౌమ్యమైన క్లీనర్‌ని బౌల్‌లో మిశ్రమం చేయడం ద్వారా క్లీనింగ్‌ ద్రావకాన్ని తయారు చేయండి. మెషీన్‌ని శుభ్రం చేయడానికి ఈ ద్రావకంలో ముంచిన మెత్తని వస్త్రాన్ని ఉపయోగించండి. డిస్పెన్సర్‌లు లేదా డోర్‌ గాస్కెట్‌ నుంచి మలినాన్ని తొలగించేందుకు, టూత్‌బ్రష్‌ని ఉపయోగించండి.

ఎప్పటికప్పుడు ఈ సూచనలు పాటిస్తూ ఉండండి మరియు తేమ-బూజు వాసనల గురించి మీరు ఎప్పుడూ చింతించవలసిన అవసరం లేదు, మీ వాషింగ్‌ మెషీన్‌ ఎంత పాతది లేదా ఉపయోగించబడింది అనే దానితో నిమిత్తం లేకుండా.

వ్యాసం మొదట ప్రచురించబడింది