మీ క్యాండిల్ హోల్డర్ ను శుభ్రం చేయడానికి సులభమైన చిట్కాలు

మీ ఇంటికి మూడ్ లైటింగ్, సువాసనను వెదజల్లడానికి క్యాండిల్స్ ప్రత్యేకమైన ఆకర్షణ. ఇక్కడ తెలిపే క్లినింగ్ టిప్స్ పాటించండి, మీ క్యాండిల్ హోల్డర్ మెరిసేలాగా చేసుకొని డిన్నర్ కు సిద్ధంకండి.

వ్యాసం నవీకరించబడింది

How to Clean Your Candle-Holder Using Easy Tricks
ప్రకటన
Surf Excel Matic Liquid

క్యాండిల్ హోల్డర్ పై ఖర్చు పెట్టిన ప్రతి పైసా విలువైనదే. ఒక క్యాండిల్ వెలిగించినప్పుడు జీవం వచ్చినట్టు అనిసిస్తుంది. సమయం గడిచిన కొద్ది అది కరిగిపోతుంటే మీ క్యాండిల్ హోల్డర్ అంతా మైనం తో నిండిపోతుంది. ఇతర సందర్భాల్లో అది ఉపయోగించడానికి వికారంగా కనిపించవచ్చు. అప్పుడు మీరు ఏమి చేస్తారు? మీ క్యాండిల్ హోల్టర్ నుంచి మైనం తీసి తిరిగి మెరిసే విధంగా చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఫ్రీజ్ ద హోల్డర్

గడ్డకట్టిన క్యాండిల్ హోల్డర్ ను ఫ్రీజ్ చేస్తే కరిగిన మైనాన్ని తేలికగా  తీసివేయవచ్చు. ఈ క్యాండిల్ హోల్డర్‌ను మీ ఫ్రీజర్‌లో గంటసేపు పెట్టండి. ఇలా చేస్తే ఫ్రీజర్ లో చల్లని ఉష్ణోగ్రతకు క్యాండిల్ మైనం కుంచుకుపోతుంది. ఫ్రీజర్ నుంచి క్యాండిల్ హోల్డర్ ను బయటికి తీసి మైనాన్ని గీకివేయాలి  లేదా బటర్ నైఫ్ తో మైనాన్ని  పూర్తిగా తొలగించాలి. కాస్త సబ్బు, నీరు ఉపయోగించి హోల్డర్ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

వేడినీళ్లు వాడాలి

బటర్ నైఫ్ తో వీలైనంత మైనాన్ని  గీరివేయాలి. ఒక 1/2 బకెట్ వేడి నీళ్లు తీసుకొని అందులో క్యాండిల్-హోల్డర్‌ను ముంచాలి. హోల్డర్ నుంచి గట్టిపడిన వ్యాక్స్ మొత్తం ఊడివచ్చేంత వరకు అలాగే పెట్టాలి. స్పాంజిపై కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ ను తీసుకొని స్క్రబ్ చేసి మంచి నీటితో కడుక్కోవాలి.

ప్రకటన

Surf Excel Matic Liquid

ఓవెన్ వాడండి

ఓవెన్ లో క్యాండిల్ హోల్డర్ పెట్టే ముందు బేకింగ్ ప్యాన్ తీసుకొని దానిపై టిన్ ఫాయిల్ లేదా 5-6 పొరల పార్చ్మెంట్ పేపర్ పరచుకోవాలి. ఓవెన్‌ను 180  డిగ్రీల వరకూ ముందుగా వేడిచేసుకోవాలి.  క్యాండిల్ హోల్డర్ ను దాని పై తలక్రిందులుగా ఓవెన్‌లో పెట్టాలి. ఓవెన్‌ను 15 నిమిషాల వరకు వేడి చేయాలి. క్యాండిల్ హోల్డర్ కు ఉన్న మైనం  కరిగి ప్యాన్ పై పడుతుంది. ఓవెన్ స్విచ్ ఆఫ్ చేసి టవల్ లేదా ఓవెన్-సేఫ్ మిట్టెన్లను ఉపయోగించి క్యాండిల్-హోల్డర్‌ను బయటకు తీయాలి. చల్లారిన తరువాత, హోల్డర్‌ను డిష్ వాషింగ్ జెల్‌తో కడగాలి. చెక్కతో చేసిన క్యాండిల్ హోల్డర్‌ను శుభ్రం చేసేటప్పుడు ఈ చిట్కాను ఉపయోగించరాదు.

మీ క్యాండిల్-హోల్డర్ మరో విందుకు సిద్ధంగా  ఉంటుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది