
వాషింగ్ మెషీన్ సాధారణంగా ఖరీదైన కొనుగోలు కాబట్టి, కొనేటప్పుడు కొన్ని అంశాలను దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. అన్నిటికీ మించి, ఇది మీ ఇంట్లో అత్యధికంగా ఉపయోగించే విద్యుత్తు ఉపకరణా ల్లో ఒకటి! దేనిని కొనాలి, ఇది మీ బడ్జెట్‌కు సరితూగుతుందా అనే విషయం నిర్ణయించుకునే ముందు మీరు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవలసిన కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.
మీ పెట్టుబడిపై ఉత్తమ రాబడి పొందడానికి సహాయపడేందుకు, మీరు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాల జాబితా ఇక్కడ ఇస్తున్నాము.
లోడ్ రకం
టాప్-లోడింగ్ మెషీన్స్‌తో పోల్చుకుంటే ఫ్రంట్-లోడింగ్ మెషీన్స్ ఖరీదైనవి, అయితే గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే ఫ్రంట్-లోడింగ్ మెషీన్స్ తక్కువ నీటిని ఉపయోగిస్తాయి. మీరు ముందుకు వెళ్ళే ముందు ఖర్చు లేదా నీటి వినియోగంలో మీకు ఏది ముఖ్యమనే విషయం విశ్లేషించుకోండి.
ఇంధన పొదుపు

ఆక్వా-సేవర్, మోటారు సామర్థ్యం, పర్యావరణానికి స్నేహపూర్వకమైన ఉతుకు లాంటి టెక్నాలజీలను ఉపయోగించే మెషీన్‌ని ఎంచుకోండి. ఇలాంటి మెషీన్‌లు మీ నీటి మరియు కరెంటు బిల్లులు ఆదా చేయడానికి మీకు సహాయపడవచ్చు.
సైజు
మీకు అవసరమైతే తప్ప పెద్ద మెషీన్‌ని తీసుకోకండి. నలుగురు సభ్యులు గల కుటుంబానికి మామాలు లోడ్ 6 కిలోలు.
అదనపు విశిష్టత
ఉష్ణోగ్రత నియంత్రణ లాంటి అదనపు విశిష్టతల కోసం చూడండి.
మీరు పరిపూర్ణమైన మెషీన్ కోసం వెతికడం ప్రారంభించినప్పుడు ఈ జాబితాను సిద్ధంగా ఉంచుకోండి.
ఆనందంగా షాపింగ్ చేయండి!