మీ రిఫ్రిజిరేటర్ ఇంటీరియర్ మురికిగా ఉందా? దీన్ని ఎలా శుభ్రం చేయాలో ఇక్కడ వివరించబడింది

మీ రిఫ్రిజిరేటర్ లోపలి భాగాన్ని శుభ్రంగా ఉంచడానికి, క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. ఈ సులభమైన శుభ్రపరిచే దశలను ప్రయత్నించండి.

వ్యాసం నవీకరించబడింది

Is Your Refrigerator Interior Looking Dirty? Here's How to Clean It!
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

మీ రిఫ్రిజిరేటర్‌ను శుభ్రపరచడం వల్ల మీ రిఫ్రిజిరేటర్ తాజాగా కనిపించడమే కాకుండా, పరిశుభ్రతను కొనసాగించడానికి  తోడ్పడుతుంది. ఇది అసహ్యకరమైన వాసనలు నివారించడానికి కూడా సహాయపడుతుంది. మీ రిఫ్రిజిరేటర్ లోపలి భాగాలను ఎలా శుభ్రం చేయాలో చూద్దాం.

దశ 1: ఫ్రిజ్ ఖాళీ చేయండి

రిఫ్రిజిరేటర్‌లోని అన్ని భాగాలను ఖాళీ చేసి ప్రారంభించండి. ఇంకెంతమాత్రం  తిన కూడని వస్తు సామగ్రిని పారేయండి. అరలను  కూడా తొలగించండి.

దశ 2: శుభ్రపరిచే ద్రావకాన్ని సిద్ధం చేయండి

ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్లు తీసుకొని, అందులో 1 కప్పు డిష్ వాషింగ్ ద్రవాన్ని కలపండి.

ప్రకటన

Domex Disinfectant Floor Cleaner

దశ 3: స్విచ్ ఆఫ్ చేయండి

మీరు శుభ్రపరచడం ప్రారంభించడానికి 1 గంట ముందు, స్విచ్ ఆఫ్ చేయండి. ఉపరితలాలు గది ఉష్ణోగ్రతకు రావనివ్వండి.

దశ 4: క్లీనింగ్ సొల్యూషన్ ఉపయోగించండి

శుభ్రపరిచే ద్రావణాన్ని ఉపరితలంపై పిచికారీ చేసి 5 నిమిషాలు వేచి ఉండండి.

దశ 5: ఉపరితలాలను స్క్రబ్ చేయండి

ఉపరితలాలను పూర్తిగా స్క్రబ్ చేయడానికి స్పాంజ్ ప్యాడ్ ను ఉపయోగించండి. బాహ్యా భాగాలను  స్క్రబ్ చేయడానికి మీరు ఇదే ద్రావణాన్ని కూడా ఉపయోగించవచ్చు.

దశ 6: పాట్ డ్రై

ఉపయోగించే ముందు సబ్బు అవశేషాలను తుడిచిపెట్టడానికి శుభ్రమైన వస్త్రాన్ని ఉపయోగించండి.

దశ 7: అంశాలను తిరిగి ఉంచండి

శుభ్రపరిచిన తరువాత, మీ రిఫ్రిజరేటర్‌లో వస్తువులన్నీ మరలా పేర్చండి

ఇలా చేస్తే చాలు! ఇప్పుడు మీ రిఫ్రిజిరేటర్ ను సమస్య లేకుండా శుభ్రపరచవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది