రోజువారీ శుభ్రపరచడం కోసం, మీరు మీ క్రిస్టల్ కళాఖండాలను లింట్-ఫ్రీ తువాలుతో తుడిచి వేయవచ్చు. వీటి పై వేలిముద్రలు, దుమ్ము పడకుండా ఉండటానికి మార్కెట్లో ప్రత్యేకమైన క్రిస్టల్-పాలిషింగ్ పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, మీ కళాఖండాల పై మట్టిలాంటి పదార్ధాలు పేరుకుపోయి ఉంటే వాటిని సులువుగా తొలగించడానికి ఈ చిట్కాలను అనుసరించండి. > మీ క్రిస్టల్ కళాఖండాలను శుభ్రం చేయడానికి వేడినీళ్లు లేదా బ్లీచ్ ఉపయోగించవద్దు. డిష్ వాషింగ్ లిక్విడ్ వాడండి ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో కొన్ని చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్ ను కలపండి. ఈ సబ్బు ద్రావణంలో మెత్తటి తువ్వాలు నానబెట్టి, దానితో మీ క్రిస్టల్ ఖండాలను తుడవండి. మరకలను వదిలించుకోవడానికి, తడిసిన ప్రాంతాన్ని మృదువైన గుడ్డతో మెత్తగా రుద్దాలి. మరో మృదువైన, పొడి కాటన్ వస్త్రంతో శుభ్రపరిచే ద్రావణాన్ని తుడిచివేయాలి. తరువాత, క్రిస్టల్ పాలిషింగ్ ను వస్త్రంతో రుద్దాలి. వెనిగర్, ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించండి మీ క్రిస్టల్ వస్తువులు మసకబారితే వాటిలో ఉండే ఖనిజాలు జమ అవడం వల్ల కావచ్చు. ఇలాంటి జమల రంగును వదిలించుకోవడానికి, ముందుగా ఒక చిన్న చెంచా ఉప్పు( 1 స్పూన్) తీసుకొని అందులో 5 పెద్ద చెంచాల వెనిగర్ కలుపుకొని ఒక ద్రావణం సిద్ధం చేసుకోవాలి. ఈ ద్రావణంను క్రిస్టల్ వస్తువుల పై మొత్తంగా పూయాలి మరియు 10 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు, ఆ భాగాన్ని పంపు నీటి కిందా కడిగి, లింట్ ఫ్రీ తువ్వాలతో తుడుచుకోవాలి. టూత్‌పేస్ట్ ఉపయోగించండి మృదువైన స్పాంజిపై లేదా మీ చేతివేళ్ల మీద చిన్న మొత్తంలో టూత్‌పేస్టును తీసుకోవాలి. వెంటనే, ఈ టూత్ పేస్టును మీ క్రిస్టల్ వస్తువుల పై పూసి మృదువుగా రుద్దాలి. ఖనిజ జమలన్నీ కరిగిపోయే వరకు రుద్దాలి. ఇప్పుడు, మెత్తటి తువ్వాలను శుభ్రమైన నీటిలో నానబెట్టి, టూత్‌పేస్టును క్రిస్టల్ నుంచి తుడిచివేయాలి. అప్పుడు కొత్తవాటిలాగా ప్రకాశిస్తాయి. ఇలా చేస్తే, మీ మెరిసే క్రిస్టల్ సేకరణలను చూసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు అసూయ పడుతారు.