మీ వాడ్రోబ్ని క్షుణ్ణంగా ఎలా శుభ్రం చేయాలి మరియు సర్దాలి

మీరు ఇంట్లోనే ఉన్నారా మరియు పని చేయడానికి వెచ్చించే సమయం ఉందా? దీనిని మీ వాడ్రోబ్‌ని సర్దడానికి ఉపయోగించి దానిని ఆకర్షణీయంగా చేయండి.

వ్యాసం నవీకరించబడింది

How to Deep-Clean and Organise Your Wardrobe
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

మీ ఇంటిని శుభ్రంగా మరియు సర్ది ఉంచడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ప్రతి ఒక్కదానిని సరైన చోట ఉంచడం ద్వారా మీరు ఆ పని చేయవచ్చు. మీరు ఎక్కడపడితే అక్కడ పెట్టే వాటిల్లో మీ దుస్తులు మరియు యాక్సెసరీలు ఉంటాయి, మీరు హడావుడిగా ఉన్నప్పుడల్లా వాటిని అస్తవ్యస్తంగా బయటకు లాగుతారు. దీంతో త్వరలోనే మీ వాడ్రోబ్‌ గందరగోళంగా మారుతుంది మరియు దుస్తులు చిందరవందరగా మారతాయి.

మీరు వీటిని సర్దాలని చాలా కాలంగా అనుకుంటూ ఉండొచ్చు, కానీ సమయం దొరకడం లేదని మీరు భావించివుండొచ్చు. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, మీరు మీ వాడ్రోబ్‌ని నీటుగా సర్దుకోవచ్చు.

1) మీ కప్‌బోర్డును బాగా శుభ్రంచేయండి

శుభ్రంచేయడంతో ప్రారంభించండి. మీ వాడ్రోబ్‌ని ఖాళీ చేసి సబ్బు నీటితో ప్రతి ఉపరితలాన్ని తుడవండి. మీరు 3 చిన్న చెంచాల  డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌ని 1 లీటర్‌ నీటిలో కలిపి సబ్బు ద్రావణం తయారుచేయండి. ఈ పని చేయడానికి, మీరు విమ్‌ డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌ని ఉపయోగించవచ్చు. ఇది మార్కెట్‌లో సులభంగా లభిస్తుంది. హ్యాంగర్లు, రాడ్‌లు, హుక్స్‌ మరియు డ్రావర్స్‌ని కూడా తుడవాలని గుర్తుంచుకోండి. ఆ తరువాత, సాదా, తడి వస్త్రంతో సబ్బును తుడిపేయండి.

వాడ్రోబ్‌ పొడిగా మారగానే, తరువాత శుభ్రం చేయడం సులభంగా చేసేందుకు అరలపై  పాత దినపత్రికలు పెట్టండి. కీటకాలను నిరోధించేందుకు లోపల మీరు కొద్దిగా కలరా ఉండలు కూడా పెట్టవచ్చు. 

ప్రకటన

Domex Disinfectant Floor Cleaner

2) మీ దుస్తులు శుభ్రంచేయండి

మీ వాడ్రోబ్‌ మాత్రమే కాదు, మీరు దాని లోపల పెట్టిన దుస్తులు కూడా తప్పకుండా పరిశుభ్రంగా ఉండాలి. క్రిములు మరియు ఇన్ఫెక్షన్‌ వ్యాపించడాన్ని నిరోధించేందుకు, ఉపయోగించిన ప్రతిసారి మీ దుస్తులు ఉతకడం మంచి ఆలోచన. మీరు బయట ధరించే దుస్తుల విషయంలో ఇది ప్రత్యేకించి నిజం, కలుషితమైన వస్తువును మీరు  తాకి ఉంటే లేదా ఎవరికైనా ఒంట్లో బాగా లేనివారిని కలిస్తే, ఇవి క్రిములను ఆకర్షించే అవకాశం ఉంది. దుస్తులను ఉతకకుండా వాటిని  మళ్ళీ ధరించకపోవడం ఉత్తమం. 

డిటర్జెంట్‌తో దుస్తులు బాగా ఉతకడం క్రిములను తొలగించడానికి మంచి ఆలోచన. తువాళ్ళు, దుస్తులు తదితర వాటికి రిన్‌ అలా లాంటి బ్లీచ్‌ ఆధారిత (సోడియం హైపోక్లోరైట్‌) ఉత్పాదనను కూడా మీరు ఉపయోగించవచ్చు. రిన్‌ అలా అనేది సోడియం హైపోక్లోరైట్‌ బ్లీచ్‌ మరియు తెల్లని దుస్తులపై మాత్రమే ఉపయోగించవలసిందిగా సిఫారసు చేయబడుతోంది. దీనిని రంగు దుస్తులపై ఉపయోగించకండి.

మీ వద్ద వాషింగ్‌ మెషీన్‌ ఉంటే, దుస్తులను లాండ్రీ లేదా దుస్తుల లేబుళ్ళపై ఉన్న  ఆదేశాల ప్రకారం, తగిన నీటి ఉష్ణోగ్రత సెట్టింగ్‌లో దుస్తులు ఉతకండి. దుస్తులను మడవడానికి ముందు వాటిని ఎండలో తప్పకుండా ఆరబెట్టాలి, ఎందుకంటే అవశేష తేమ ఫంగస్‌ పెరగడానికి దారితీయొచ్చు.

3) దుస్తులను వేరుచేయుట

మీ దుస్తులు మరియు యాక్సెసరీలను కేటగిరిలుగా వేరుచేయండి, అంటే ప్యాంట్‌లు, టాప్‌లు, స్కర్ట్‌లు, డ్రెస్సులు, కుర్తాలు, బెల్టులు, స్కార్వ్స్‌గా. ప్రతి కేటగిరి లోపల, ఐటమ్స్‌ని మూడు కుప్పలుగా వేరుచేయండి: కీప్‌, డొనేట్‌ లేదా టాస్‌. ఒకసారి సర్దితే, వేటిని ఎక్కడ పెట్టాలనే విషయం గురించి మీకు మెరుగైన అవగాహన ఉండాలి.

4) మీ దుస్తులను సర్దండి

టాప్‌లు, కుర్తాలు, డ్రెస్‌లు, స్కర్ట్‌లు తదితర వాటిని పొడవును బట్టి అవరోహణ క్రమంలో హేంగర్‌లపై (ప్రాధాన్యంగా చెక్కవాటిపై, వాటి ఆకారాన్ని నిలబెట్టుకోవడానికి) వేలాడదీయాలి. హేంగర్‌కి రెండు టాప్‌లను కూడా మీరు వేలాడదీయవచ్చును.  కురచ దుస్తుల కింద, మీరు స్టోరేజ్‌ బాక్సులు లేదా దుస్తుల కుప్పలు పెట్టవచ్చు, ఈ విధంగా మీరు హేంగర్‌ల కింద గల స్థలాన్ని వినియోగించుకోవచ్చు.

అప్పుడప్పుడు ధరించే అనార్కలిస్ మరియు ఘాఘ్రా చోళి సెట్స్‌ లాంటి వాటిని మీరు వాడ్రోబ్‌లో పై అరలో పెట్టవచ్చు, ఎందుకంటే వీటి అవసరం రోజూ ఉండదు కాబట్టి. 

మీ లోదుస్తులను డ్రావర్‌లు లేదా స్టోరేజ్‌ బాక్సుల్లో పెట్టండి. లేకపోతే, చిన్న వస్తువులుగా , ఇవి పెద్ద దుస్తుల మధ్య దాక్కోవచ్చును మరియు కనుగొనడం కష్టంగా ఉండొచ్చు. బెల్టులకు, చిన్న బ్యాగులకు మరియు స్కార్వ్స్‌ను వేలాడదీయడానికి  హుక్స్‌ని తగిలించడం ద్వారా డోర్‌ని పూర్తిగా ఉపయోగించుకోండి.

మీ వాడ్రోబ్‌ని నేడే ఈ సులభ చిట్కాలతో సర్దండి. సంతోషంగా నీటుగా సర్దండి!

ఆధారం: https://www.nhs.uk/common-health-questions/infections/can-clothes-and-towels-spread-germs/

వ్యాసం మొదట ప్రచురించబడింది