మీ పాతకాలపు చెక్క ఫర్నిచర్ ఎలా శుభ్రం చేయాలి

మీ ఇంట్లో పాతకాలపు చెక్క ఫర్నిచర్ భాగాలు ఉంటే, మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని మేము సూచిస్తున్నాము. ఇక్కడ కొన్ని శుభ్రపరిచే చిట్కాలు ఉన్నాయి.

వ్యాసం నవీకరించబడింది

How to Clean Your Vintage Wooden Furniture
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

పాతవి పసిడితో సమాసం, ఈ ప్రకటన వింటేజ్ చెక్క ఫర్నిచర్ కు సరిగ్గా సరిపోతుంది. పాత ఫర్నిచర్ పునరుద్ధరణకు  కొంచెం శ్రమిస్తే క్రొత్తగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. మీ ఇంట్లో పాతకాలపు చెక్క ఫర్నిచర్ భాగాలు ఉంటే, మీరు దానిని సరిగ్గా చూసుకోవాలని మేము సూచిస్తున్నాము.

ఈ సులభమైన శుభ్రపరిచే చిట్కాలను ప్రయత్నించండి.

దశ 1: దుమ్ము దులపండి 

నైలాన్ డస్టర్ ఉపయోగించి వదులుగా ఉన్న ధూళి మరియు ధూళిని తొలగించండి. మీరు వాక్యూమ్ క్లీనర్ ను కూడా ఉపయోగించవచ్చు. మరింత శుభ్రం చేయడానికి, శుభ్రపరచే ద్రావకాన్ని తయారు చేయండి అందుకోసం 1 కప్పు నీటిలో, 1 చిన్న చెంచా డిష్ వాషింగ్ ద్రావకం మరియు 2 చిన్న చెంచాల తెలుపు వినెగార్ కలపండి. అందులో శుభ్రమైన స్పాంజిని ముంచి మొత్తం ఉపరితలం శుభ్రం చేయండి. అదనపు నీటిని తొలగించడానికి మైక్రోఫైబర్ వస్త్రంతో తుడిచివేయండి.

దశ 2: గీతలు పూడ్చండి

గీతలను పూడ్చడానికి , మీ ఫర్నిచర్ రంగుకు సరిపోయే మైనపు క్రేయాన్ ఉపయోగించండి. గీతలు పూడే  వరకు రుద్దండి.

ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

దశ 3: టెర్మిట్లను చెదలను  వదిలించుకోండి

చెదపురుగులను వదిలించుకోవడానికి, 2 కప్పుల వేప రసం మరియు 1 కప్పు గోరువెచ్చని నీరు కలపండి. ప్రభావిత ప్రాంతంపై పిచికారీ చేసి, 1 గంట వేచి ఉండి, ఆ తరువాత మైక్రోఫైబర్ వస్త్రంతో పొడిగా తుడవండి.

దశ 4: మెరుపును  జోడించండి

మీ పాతకాలపు చెక్క ఫర్నిచర్‌కు మెరుపును జోడించడానికి, మైనంతో  రుద్దండి. ప్రత్యామ్నాయంగా, మీరు ఆలివ్ నూనెలో ముంచిన దూది ఉండను   ఉపయోగించి రుద్దవచ్చు. తరువాత పొడి వస్త్రంతో తుడిచి వేయండి.

ఈ చిట్కాలను అనుసరించండి మరియు మీ పాతకాలపు చెక్క ఫర్నిచర్ రాబోయే సంవత్సరాల్లో అద్భుతంగా కనిపిస్తుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది