నిపుణుడిలా మీ వాల్‌పేపర్‌ను కాపాడుకోవాడానికి అద్భుతమైన చిట్కాలు

హోమ్‌డెకోర్‌కు వాల్‌పేపర్లు అద్భుతమైన మరియు ఖర్చు తక్కువ అయిన పరిష్కారం. తక్కువ ఖర్చుతో ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఈ వాల్‌పేపర్లును ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి అంటే కొన్ని కేరింగ్ టిప్స్ మరియు ట్రిక్స్‌ పాటించాల్సిన అవసరం ఉంది.

వ్యాసం నవీకరించబడింది

Amazing Tips to Care for Your Wallpaper Like an Expert
ప్రకటన
Domex Disinfectant Floor Cleaner

మీ ఇంటిని అలంకరించడానికి సులభమైన మార్గాలలో వాల్‌పేపర్ ఒకటి. కాని, అవి పాడవడానికి మరియు చిరగడానికి వశమవుతాయి. అయితే, మీరు వాల్‌పేపర్లపై కొద్దిగా సరైన రీతిలో  శ్రద్ధ తీసుకుంటే, మీరు సులభంగా వాటి ఆయుస్సును పొడిగించవచ్చును

మీకు మీ ఇంట్లో ఆహ్లదాన్ని పంచిన మీ వాల్‌పేపర్‌ను కొత్తగా, బ్రైట్ గా మెయింటెన్ చేయాలంటే మేము సూచించే చిట్కాలను అనుసరించండి. మీ ఇంటికి వచ్చే అతిధులకు కూడా ఆ ఆహ్లదాన్ని పంచండి. 

వాక్యూమ్ లేదా స్వీప్

మీకు ఇష్టమైన వాల్‌పేపర్‌ పై చిన్న చిన్న పాకే పురుగులు గూడు కట్టుకొని ఉన్నాయా, వాటిని తొలగించాలంటే వాక్యూమ్ క్లీనరే సరైనది. ఒకవేళ టెక్సచర్డ్ వాల్ పేపర్ల పై బ్రష్ తో క్లీన్ చేయలనుకుంటే వాటి పై గీతలు పడే అవకాశం ఉంది. నాన్-టెక్సచర్డ్ వాల్‌పేపర్‌ అయితే ఇంట్లో ఉండే చీపురు కట్టకు మృదువైన కాటన్ బట్ట లేదా మైక్రోఫైబర్ వస్త్రాన్ని జోడించాలి. ఇప్పుడు, ఈ మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించి వాల్‌పేపర్‌ నుంచి దుమ్మును సులుపుగా శుభ్రం చేయండి.

వాల్‌పేపర్‌ పిండిని వాడండి

ప్రకటన

Domex Disinfectant Floor Cleaner

వాల్పేపర్ పిండి హార్డ్వేర్ స్టోర్లలో సులభంగా దొరకుతుంది. మీరు చేయాల్సిందల్లా కంటైనర్ నుంచి కొంత పిండిని తీసుకొని ముద్దలాగా  చేసుకొని మీ వాల్‌పేపర్ పై ఉన్న ధూళిని క్లీన్ చేయాలి. డస్ట్ అంతా పిండి ముద్ద పై భాగంకు అంటితే, ఆ పిండి ముద్దను మరోసారి పిసికి ఆ ముద్దతో వాల్ పేపర్ ఇతర భాగాలను క్లీన్ చేయాలి. ఇలా వాల్ పేపర్ పై ఉన్నదుమ్ము, ధూళి, మారుమూల్లలో దాక్కున్న బూజును తీయడానికి సులువుగా ఉంటుంది. 

నీటితో శ్రుభం చేయాలనుకుంటే టెస్టు చేయాలి

అన్ని వాల్‌పేపర్‌లు కడగడానికి అనువుగా ఉండవు. మీ వాల్ పేపర్ నీటితో కడగాడానికి సరిపోతుందా లేదా అని చిన్న భాగం పై టెస్టు చేయాలి. వాల్ పేపర్ లోని  చిన్న భాగం పై డిష్ వాషింగ్ జెల్ పూసి 5 నిమిషాలు వరకు అలాగే పెట్టి తరువాత మంచి నీటితో కడగాలి. వాల్‌పేపర్ రంగు, ఆకృతిలో పెద్ద మార్పులు  లేకపోతే పూర్తి వాల్ పేపర్ ను నమ్మకంతో  శుభ్రం చేసుకోవచ్చు.

వినైల్ వాల్‌పేపర్‌లు అయితే

సాధారణంగా, వినైల్ వాల్పేపర్ షీట్లను వంటగది ప్రాంతంలో ఉపయోగిస్తారు. వీటిని తడి స్పాంజితో సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అవసరమైతే, తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించి కూడా శుభ్రంగా కడుక్కొవచ్చు. స్టీల్, ఇతర రాపిడి స్క్రబ్బర్లను వీటిపై ప్రయోగించరాదు. ఎందుకంటే ఇవి షీట్ల పై గీతలుగా మారి చూడటానికి వికారంగా కనిపించవచ్చు.

ఈ చిట్కాలను అనుసరించండి, మీ వాల్‌పేపర్‌ను క్లీన్ గా, ఆకర్షణీయంగా, కొత్తదాని వలె మెయింటేన్ చేయండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది