
పరిశుభ్రమైన ఇల్లు అత్యావశ్యం, ప్రత్యేకించి ఇన్ఫెక్షన్‌లను మరియు క్రిములను నిరోధించడానికి, కానీ మీ ఇంటిని నీటుగా మరియు సర్ది ఉంచడానికి కొంత శ్రమ అవసరం. మీరు ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తుంటే, ఇంటిని సర్దడం మరియు మీ కార్యాలయ పనిని పూర్తిచేయడంతో మీ ఇంటి పనులను (సహాయం లేకుండా) సమతుల్యం చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండొచ్చు.ఇంటిని శుభ్రంచేసే పనిని సులభం చేయడంలోని ప్రధాన అంశం చెక్ లిస్టు మరియు షెడ్యూలు ఉపయోగించి దీనిని సర్దడమే. దీని కొరకు కొన్ని సలహాలు ఇక్కడ సూచించబడ్డాయి.
మీ క్లీనింగ్ షెడ్యూలు ప్రింటు తీసుకోండి లేదా చార్టు తయారు చేయండి మరియు మీరు పనిని మిస్‌కాకుండా లేదా మరచిపోకుండా ఉండేందుకు మీ ఫ్రిజ్ లాంటి కనిపించే చోట ప్రదర్శించండి.
శుభ్రంచేసే షెడ్యూలు తయారుచేయుట
ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలను (ఉదా: టేబుల్స్, క్యాబినెట్ హ్యాండిల్స్, తదితరమైనవి), గదులు లేదా ఇంట్లోని ప్రాంతాలు (ఉదా: బాత్రూమ్, బెడ్రూమ్, తదితరమైనవి) మరియు ఫర్నిచర్ (ఉదా: కప్ బోర్డులు, క్యాబినెట్లు, అటకలు, తదితరమైనవి) క్రమంతప్పకుండా శుభ్రం చేయడం మరియు క్రిమిసంహారం చేయడం ఇంటిని శుభ్రం చేయడంలో ఉంటుంది. ఇవన్నీ రోజూ లేదా అప్పుడప్పుడు శుభ్రం చేయడం సాధ్యపడదు, ఎందుకంటే అడ్డుపడే కొన్ని ముఖ్యమైన పనులు ఎల్లప్పుడూ ఉంటాయి మరియు ప్లాన్లు జాప్యమవుతుంటాయి లేదా మారిపోతుంటాయి. మీరు పనిచేసే మహిళ అయితే ఇంకా ఎక్కువ ఉంట ుంది.
కాబట్టి, మీ పనులు చేయించుకోవడానికి షెడ్యూలు తయారుచేసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు పనులను రోజూ, వారంవారీ, నెలవారీ కేటగిరిలుగా విభజించవచ్చు. మీకు రూమ్‌మేట్‌లు, లేదా ఇంట్లో కుటుంబం ఉంటే, మీరు వాళ్ళకు భిన్న పరిశుభ్రత బాధ్యతలు కేటాయించవచ్చు.

రోజువారీ మరియు వారంవారీ పనులను ప్రణాళిక చేసుకోండి
వాడ్రోబ్‌ని మరియు డ్రావర్‌ల లోపల శుభ్రంచేయడం లాంటి కొద్ది పరిశుభ్రమైన పనులను, అప్పుడప్పుడు చేయవలసి ఉంటుంది. ఫ్రిజ్‌ని క్రిమిసంహారం చేయడం, టాయిలెట్న ి శుభ్రం చేయడం లాంటి ఇతర పనులను వారంవారం చేయవచ్చు. చిమ్మడం, దుమ్ము దులపడం, తడిబట్టతో తుడవడం, సర్దడం లాంటివి మీరు రోజూ చేయవలసిన జాబితాలో ఉండవచ్చును.
భిన్న గదులను శుభ్రంచేయండి
మీ ఇంటి సైజును బట్టి, ఒకదాని తరువాత ఒకటిగా భిన్న గదులను పరిశుభ్రం చేయడాన్ని పరిగణించండి. కాబట్టి ఒక రోజు లివింగ్ రూమ్‌ని, మరొక రోజు బెడ్ రూమ్‌ని, మూడవ రోజున బాత్‌రూమ్‌ని శుభ్రం చేయండి. ఈ విధంగా ప్రతి ఏరియాను క్రమంతప్పకుండా శుభ్రం చేయడం వల్ల మీకు ఉల్లాసంగా లేదా అలసటగా ఉండదు. మీకు పని మనిషి దగ్గరలో ఉన్నప్పటికీ, ఈ విధంగా మధ్యలో గ్యాప్ ఇచ్చి శుభ్రం చేయడం మంచి ఆలోచన. ఇంకా, భిన్న గదులను శుభ్రం చేయడంతో పాటు, మెరుగైన పరిశుభ్రత కోసం మీరు వాటిని క్రిమిసంహారం చేయవచ్చు.
గదుల్లో విభిన్నమైన ఎక్కువగా తాకుతుండే ఉపరితలాలను క్రిమిసంహారం చేసేందుకు, మీరు డోమెక్స్ మల్టీపర్పస్ డిజ్ఇన్ఫెక్టంట్ స్ప్రేని ఉపయోగించవచ్చు. ఇంట్లోని వస్తువులను క్రిమిసంహారం చేసేందుకు ప్రముఖ ఆరోగ్య సంస్థలు సిఫారసు చేసినట్లుగా దీనిలో సోడియం హైడ్రోక్లోరైట్ ఉంది. ఈ స్ప్రేని టాయిలెట్ ప్రాంతంలో, చెత్తబుట్ట, కిచెన్ సింకు, స్విచ్లు, డోర్ నాబ్లు, బాత్రూమ్ ఫిక్సర్లు, కౌంటర్లు తదితర లాంటి వాటిల్లో ఉపయోగించవచ్చు. దాంతో ప్రతిదీ శుభ్రంగా మరియు తాజాగా ఉంచుకోవచ్చును. గదుల్లో తరచుగా తాకుతుండే ఉపరితలాలపై క్రిములను ఇది సురక్షితంగా చంపుతుంది మరియు ఆహ్లాదకరమైన వాసన ఇస్తుంది. ప్యాక్పై గల వాడకపు సూచనలు పాటించండి మరియు మొదటగా అనుకూలతను పరీక్షించేందుకు ఎల్లప్పుడూ కొద్ది గుప్త ప్రదేశంపై పరీక్ష చేయండి మరియు కడగండి.
ఉపరితలాలను తాకిన తరువాత మీ చేతులు బాగా శుభ్రం చేసుకోవాలనే విషయం మరచిపోకండి. మీరు సబ్బు లేదా లైఫ్‌బాయ్ నుంచి లభించే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌ని ఉపయోగించవచ్చు.
వ్యవస్థీకృత రూపంలో హౌస్ క్లీనింగ్‌ని పాటిస్తే మీరు కార్యాలయ పనిని మరియు ఇంటి పనిని చేయడానికి సాయపడుతుంది.
ఇంటిని ఎలా శుభ్రంచేయాలో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి, మీ ఇంటిని లోతుగా శుభ్రంచేయడంపై ప్రభావవంతమైన సూచనల కోసం మీరు ఈ వ్యాసం చదవగలరు.