కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కాలంలో ఇంట్లో ఉన్నప్పుడు మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు

ఇంట్లో నిరంతరం ఉండడం వల్ల మీరు మానసికంగా ఆరోగ్యం దెబ్బతిన్నే ప్రమాదం ఉంది. ఒత్తిడిని ఎదుర్కోవటానికి మరియు మీ ప్రియమైనవారిపై కూడా సానుకూల ప్రభావం చూపడానికి ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి.

వ్యాసం నవీకరించబడింది

Tips to Stay Mentally Healthy While Staying at Home During the Corona virus Pandemic
ప్రకటన
Nature Protect Floor Cleaner - leaderboard

ఒంటరితనం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మనందరికీ తెలుసు. మీ సమయాన్ని ఎలా గడపాలి, మీ ఇంటిని ఎలా శుభ్రపరచాలి మరియు మిమ్మల్ని మీరు చురుకుగా ఉంచుకోవడం గురించి చాలా చిట్కాలు ఉన్నాయి. పరిశుభ్రతను కాపాడుకోవడం మరియు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం, మీరు మీ ఇంటికే పరిమితి అయినప్పుడు మానసిక ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలో కూడా తెలుసుకోవాలి.

ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి.

కొన్ని మానసికావస్థను ఉత్తేజపరచే వాటిని ప్రయత్నించండి

మీలో ఉత్సాహాన్ని నింపే మరియు మీకు సంతోషాన్నిచ్చే పనులు చేయండి. అది సంగీతం వినడం, స్నేహితులకు సందేశం పంపడం లేదా మీ ప్రియమైనవారితో మాట్లాడటం కావచ్చు. పుస్తకాన్ని చదవడానికి, ధ్యానం చేయడానికి లేదా మిమ్మల్ని సానుకూలంగా మరియు మంచి అనుభూతిని కలిగించే ఏదైనా కార్యాచరణను చేపట్టడానికి సమయాన్ని కేటాయించండి.

10 నిమిషాల నియమాన్ని అనుసరించండి

ప్రకటన

Nature Protect Floor Cleaner - mpu

మీ వారంతాపు శుభ్రపరిచే దినచర్యలో ఏదో ఒక భాగాన్ని ప్రారంభించడానికి మీరు కష్టపడుతుంటే, లేదా మీరు దీన్ని చేయలేకపోతున్నారని భావిస్తే మరియు ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంటే, 10 నిమిషాల నియమాన్ని అనుసరించండి. ఇది చాలా సులభం: పనిని 10 నిమిషాలు మాత్రమే చేయండి. ఆ పని    ఒక నివేదికను తయారుచేయడం  లేదా ఒక పెద్ద శుభ్రపరిచే ప్రాజెక్టును పూర్తి చేయడం కావచ్చును. మీరు 10 నిమిషాల గుర్తు వద్ద నిష్క్రమించవచ్చని మీకు  మీరే చెప్పుకోండి. చాలా మటుకు, మీరు 10 నిమిషాల తర్వాత కూడా పనిని కొనసాగించాలని ఎంచుకుంటారు. ప్రారంభించడం సాధారణంగా కష్టతరమైన భాగం; మీరు ప్రారంభించిన తర్వాత, కొనసాగించడం చాలా సులభం. మీరు ప్రారంభించలేకపోతే, తక్కువ ఒత్తిడితో కూడిన పనిని చేపట్టండి మరియు ప్రస్తుతమున్న దానిని తరువాత చేయడానికి వాయిదావేయండి.

వార్తలను తెలుసుకోవడానికి సమయాన్నిఏర్పరచుకోండి

మీ చుట్టూ జరుగుతున్న అన్ని విషయాల గురించి తెలుసుకోవడానికి  వార్తలు ముఖ్యం, అయితే మీ టీవీ ముందు మీ సమయాన్ని గడపడం అద్భుతాలు చేస్తుంది. న్యూస్ మరియు సోషల్ మీడియాను సర్ఫ్ చేయడానికి సమయాన్ని కేటాయించండి. ఏమి జరుగుతుందో, ముఖ్యంగా కలవరపెట్టే వార్తలను ఏకధాటిగా  మీపై గుప్పించడంతో   మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినవచ్చును.

మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరియు ఒత్తిడిని దూరం పెట్టడానికి  స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలివడిగా ఉండడం చాలా అవసరం. మానసికంగా బలంగా ఉండటానికి పై ఉపయోగకరమైన చిట్కాలను ప్రయత్నించండి. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి.

సోర్స్:

https://www.cdc.gov/coronavirus/2019-ncov/daily-life-coping/managing-stress-anxiety.html

వ్యాసం మొదట ప్రచురించబడింది