
పసిపిల్లలకు వారి మొదటి మంచి స్నేహితులు వారి బొమ్మలే, కానీ వాళ్ళు ప్రతీదీ నోట్లో పెట్టుకుంటారు. దీనివల్ల మీ పిల్లలకు సూక్ష్మక్రిముల వల్ల కలిగే హానికరమైన వ్యాధులు సోకవచ్చు. ముఖ్యమైన సంరక్షకులు లేదా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే మీ పిల్లల బొమ్మలు డిసిన్ఫెక్ట్ చేయడం చాలా ముఖ్యం. ఇతర సమయాల్లో, మీ పిల్లల బొమ్మలని వారానికి ఒకసారి శుభ్రం చేయాలి.
మీ పిల్లల బొమ్మలను సమర్ధవంతంగా డిసిన్ఫెక్ట్ చేయడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అయితే, మేము మొదలుపెట్టే ముందు, మీరు బొమ్మలపై తయారుచేసిన వారి సూచనలని లేదా కేర్ లేబుల్‌ని జాగ్రత్తగా చదవండి.
1) ప్లాస్టిక్ బొమ్మలని డిసిన్ఫెక్టింగ్ చేయడం
మీ చిన్నారుల ప్లాస్టిక్ బొమ్మలని తేలికపాటి డిసిన్ఫెక్ట్ లక్షణాలు కల డిటర్జెంట్‌ని మరియు గోరు వెచ్చని నీటిని ఉపయోగించి తొలగించవచ్చు. బకెట్ గోరు వెచ్చని నీటిలో, 1 చెంచా తేలికపాటి డిటర్జెంట్‌ని వేసి అన్ని బొమ్మలని అందులో వేయండి. 20 నిమిషాల పాటు ఉంచి, చేత్తో మృధువుగా కడగాలి. బొమ్మలని శుభ్రమైన తువ్వాలిని ఉపయోగించి ఆరబెట్టాలి.
బ్యాటరీతో పని చేసే ప్లాస్టిక్ బొమ్మలని, సబ్బు నీటిలో గుడ్డని ముంచి తుడిచి ఆరనివ్వాలి. తర్వాత పొడి బట్టతో తుడవాలి. వాష్ చేసే ముందు బ్యాటరీలని తొలగించినట్లుగా నిర్ధారించుకోండి.

2) చెక్క బొమ్మలను డిసిన్ఫెక్టింగ్ చేయడం
1 కప్పు వైట్ వెనిగర్ మరియు 1కప్పు నీరు మరియు 3-4చుక్కల డిటర్జెంట్‌ని వేసి మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో స్పాంజ్‌ని నానబెట్టి చెక్కబొమ్మలని దానితో తుడవండి. ఇప్పుడు, ఒక శుభ్రమైన పొడి తువ్వాలితో సబ్బు మిశ్రమాన్ని తొలగించండి. బొమ్మలని గాలికి ఆరనివ్వండి.
3) బట్టతో తయారుచేసిన బొమ్మలను డిస్ఇన్ఫెక్ట్ చేయడం
మీ పిల్లల జంతువుల బొమ్మలని మీరు బేబీ వైప్స్ తో శుభ్రం చేయవచ్చు. లేదా మీ వాషింగ్ మెషీన్‌లో వాటిని తేలికపాటి డిటర్జెంట్‌తో వేసి జెంటిల్ సైకిల్‌లో వేయచ్చు. డ్రైయర్‌ని వాడద్దు. వాటిని ఎండలో ఆరనివ ్వాలి. మీ బ్యాటరీతో నడిచే బొమ్మలను వాషింగ్ మిషనులో వాష్ చేయకూడదు.
4 తడపగల బొమ్మలను డిస్ఇన్ఫెక్ట్ చేయడం
1/2 బకెట్ వేడి నీటిలో 1కప్పు వైట్ వెనిగర్‌ని సమాన భాగాలుగా వేసి మిశ్రమం చేసుకోవాలి. బొమ్మలని ఈ మిశ్రమంలో 20 నిమిషాల పాటు నాననివ్వాలి. శుభ్రమైన నీటితో వాటిని కడగాలి.
5) లోహంతో తయారుచేసిన బొమ్మలను డిస్ఇన్ఫెక్ట్ చేయడం
1 చెంచా డైల్యూటెడ్ బ్లీచ్‌ని బకెట్ నీటిలో కలపాలి. లోహంతో తయారుచేసిన బొమ్మలను 10 నిమిషాల పాటు మిశ్రమంలో నానబెట్టాలి. తర్వాత, వాటిని మామూలు నీటిలో కడిగి బొమ్మలని గాలికి ఆరనివ్వాలి. గుర్తుంచుకోండి, బ్లీచ్ బ్లీచ్‌ని వాడేటపుడు రబ్బర్ గ్లోవ్స్ ని వేసుకోవాలి.
6) రబ్బరు బొమ్మలను డిస్ఇన్ఫెక్ట్ చేయడం
వైట్ వెనిగర్‌ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని శుభ్రమైన బట్టని నానబెట్టాలి మరియు నీటిని సమాన నిష్పత్తుల్లో కలపాలి. రబ్బర్ బొమ్మలని శుభ్రమైన బట్టతో తుడవాలి మరియు వాటిని గాలికి ఆరనివ్వాలి.
ఈ సులువైన చిట్కాలని పాటించి మీ చిన్నారులని సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలి!