
సిల్క్ అనేది ఒక సున్నితమైన వస్త్రం. దీనికి అదనపు సంరక్షణ మరియు జాగ్రత్తలు అవసరం. సరిగ్గా శ్రద్ధవహిస్తే, మీరు మీ సిల్క్‌ని దశాబ్దాల వరకు కాపాడుకోవచ్చు మరియు మీ పెట్టుబడికి ఉత్తమ రాబడిని పొందవచ్చు. నిజానికి, ఒక సిల్క్ కుర్తా ఫ్యాషన్ ఎప్పటికీ పాతబడదు. కానీ మీ పాపాయి మీ వద్ద ఉన్నపుడు మీరు జాగ్రత్తగా ఉండాలి
పాలిచ్చే సమయంలో లేదా కేవలం ఆడుకుని ఆనందించే సమయంలో మీ విలువైన సిల్క్ కుర్తాపై పొరపాటుగా పాల మరకలు ఏర్పడతాయి. పాల మరకలు మీ ఖరీదైన బట్టలని పాడు చేస్తాయి. మీ స ిల్క్ని మీరు కొన్న రోజు ఉన్నంత అందంగా కనిపించేలా ఉంచుకోవాలంటే, మరకల పడ్డ వెంటనే వాటిని పోగొట్టాలి. మీ సిల్క్ బట్టలపై పడ్డ పాల మరకలని సులువుగా పోగొట్టుకోవచ్చు. కేవలం ఇక్కడ ఇవ్వబడ్డ సులువైన కొన్ని విధానాలని అనుసరించండి.
మీరు మొండి మరకలని పోగొట్టేటపుడు, మరక ఉన్న చోట మృధువైన బ్రష్‌తో రుద్దాలి. అయితే, గుర్తుంచుకోండి తీవ్రంగా రుద్దడం వల్ల మీ వస్త్రం పాడవ్వచ్చు.
స్టెప్ 1: మీ దుస్తులను నానబెట్టండి
మరక అంటుకున్న సిల్క్ దుస్తులని మరక ఏర్పడిన వెంటనే చల్లని నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టండి. గోరు వెచ్చని నీరు లేదా వేడి నీటిలో నానబెట్టకూడదు, అలా చేయడం వల్ల పాల మరకలు మరింత మొండిగా ఏర్పడి వదలడం కష్టం అవుతుంది.

స్టెప్ 2: శుభ్రపరిచే మిశ్రమాన్ని సిద్ధం చేయడం
2 చెంచాల తేలికపాటి డిటర్జెంట్‌ని చల్లటి నీటి బకెట్‌లో వేయండి. మరక అంటుకున్న సిల్క్ వస్త్రాన్ని మిశ్రమంలో అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత, మరక ఉన్న చోట బట్టని మీ వేళ్ళతో రుద్దాలి. పాల కణాలు వదులు అవుతుండడం మీరు గమనిస్తారు. క్లీనింగ్ సొల్యూషన్‌లో కొద్ది నిమిషాల పాటు వస్త్రాన్ని నానబెట్టాలి.
స్టెప్ 3: మరకలని పరీక్షించండి
పాల మరకలు ఇంకా పోకపోతే, స్టెప్ 2 మళ్ళీ చేయండి
స్టెప్ 4: మీ వస్త్రాన్ని జాడించండి
మీ సిల్క్ వస్త్రాన్ని కుళాయి నీటిలో జాడించండి, దాన్ని గాలికి ఆరనివ్వండి.
సరే, మీ పని పూర్తయింది. పాల మరక పోయింది. ఇక మీ పాపాయితో సమయం వెచ్చించండి.