
స్పోర్ట్స్ ట్రోఫీ మీ పిల్లల విజయం, నైపుణ్యం లేదా తెలివితేటలకు సాక్ష్యంగా నిలుస్తాయి. వారు దానిని ఆత్మగౌరవంతో ఇంటికి తీసుకువస్తారు మరియు వాటిని ప్రదర్శిస్తూ ఎప్పటికి ఆదరిస్తూన్నే ఉంటారు. కానీ కాలంతో పాటు, ఈ ట్రోఫీలు దాని మెరుపును కోల్పోతాయి. ఇది వెలిసిపోయినట్లుగా లేదా కళంకమైనట్లుగా కనిపిస్తుంది. కొన్ని అత్యంత ఉపయోగకరమైన శుభ్రపరిచే చిట్కాలు మరియు ఉపాయాలతో, మీరు ఈ ట్రోఫీలను మెరిసే విధంగా మరియు మచ్చలేనిదిగా చేయవచ్చు.
ఈ వ్యాసంలో, వెండి, బంగారం, కాంస్య, ఇత్తడి మ రియు గాజుతో చేసిన ట్రోఫీలను ఎలా శుభ్రం చేయాలో మేము మీకు చెప్తాము. పదండి వెళ్లాదాం!
వెండి మరియు బంగారు ట్రాఫీలు
మీ వెండి మరియు బంగారు పూతతో కూడిన ట్రోఫీలను శుభ్రం చేయడానికి, ½ బకెట్ గోరువెచ్చని నీటితో నింపండి. దానికి 2 చిన్న చెంచాల డిష్ వాషింగ్ ద్రవం జోడించి బాగా కలపాలి. ఈ ద్రావణంలో ఒక శుభ్రమైన బట్టను ముంచి లేదా మృదువైన స్పాంజితో ట్రోఫి పై ఉన్న మురికిని తొలగించడానికి శుభ్రపరచడం ప్రారంభించండి. దీన్ని బాగా కడిగి మైక్రోఫైబర్ వస్త్రంతో పొడిగా తుడుచుకోవాలి. శుభ్రపరిచే ద్రావణాన్ని పారబోయండి. ఇప్పుడు వెచ్చని నీటితో బకెట్ నింపండి మరియు 2 చిన్న చెంచాల బేకింగ్ సోడాను జోడించండి. మీ ట్రోఫీలను అందులో ఉంచండి మరియు 15-20 నిమిషాలు వేచి ఉండండి. ఇది మచ్చ మరియు మిగిలిన ధూళిని తీసివేస్తుంది. మాములు నీటితో కడిగి మైక్రోఫైబర్ వస్త్రంతో పొడిగా తుడుచుకోండి.
కాంస్య మరియు ఇత్తడి ట్రోఫీలు
ఒక గిన్నెలో, ఒక నిమ్మకాయను పిండి, 2 చిన్న చెంచాల బేకింగ్ సోడాను జోడించండి. దీనిని చెంచాతో బాగా కలపండి. మీరు ద్రావకం నురగలు గమనించవచ్చు. ఇది రెండు నిమిషాల్లో స్థిరపడిన తర్వాత, ద్రావణాన్ని పేస్టుగా మార్చే వరకు కలపాలి. మీ కాంస్య లేదా ఇత్తడి ట్రోఫీలపై పేస్టును వర్తింపచేయడానికి మృదువైన కుచ్చులున్న బ్రష్‌ను ఉపయోగించండి. మెల్లగా రుద్దండి. 15 నిమిషాలు వేచి ఉండి మాములు నీటితో శుభ్రం చేసుకోండి. మైక్రోఫైబర్ వస్త్రంతో పొడిగా తుడవండి. మిగిలిన ధూళిని తొలగించడానికి ప్రక్రియను పునరావృతం చేయండి. చివరగా, మీ ట్రోఫీ యొక్క ఉపరితలంపై కొన్ని చుక్కల ఆలివ్ నూనెను మీ వేళ్ళతో రుద్దండి.

గాజు ట్రోఫీలు
మొదట మీ గాజు ట్రోఫీల పై వదులుగా ఉన్న ధూళిని ఒక మృదువైన బట్టతో తొలగించాలి. దానిని క్లియర్ చేయడానికి మీరు కూల్ సెట్టింగ్‌లో బ్లో డ్రైయర్‌ను కూడా ఉపయోగించవచ్చు. మూలల్లో చిక్కుకున్న ధూళిని తొలగించడానికి మృదువైన కుచ్చులున్న బ్రష్ ఉపయోగించండి. ఇప్పుడు శుభ్రపరచే ద్రావకం సిద్దం చేసుకోవడానికి ఒక గిన్నెలో 1 చిన్న చెంచా డిష్ వాషింగ్ ద్రవం మరియు 2 చిన్న చెంచాల వినెగార్ కలపాలి. ఈ ద్రావణంలో మృదువైన వస్త్రాన్ని ముంచి మొత్తం ఉపరితలాన్ని మృదువుగా తుడవండి. మాములు నీటితో శుభ్రం చేసి మైక్రోఫైబర్ వస్త్రంతో పొడిగా తుడుచుకోండి.
మీ పిల్లల ట్రోఫీని క్రొత్తగా ఉంచండి మరియు మరెన్నో గెలవడానికి వారిని ప్రేరేపించ ండి!