
మీరు మా సాధారణ సూచనలను పాటిస్తే మీ పిల్లల సాక్స్‌పై ఉన్న కఠినమైన సిరా మరకలతో పోరాడటం కష్టమేమీ కాదు. మీ పిల్లల పాఠశాల సాక్స్ నుంచి సిరా మరకలను త్వరగా ఎలా తొలగించవచ్చో ఇక్కడ ఉంది. ఈ దశలు పత్తి మరియు సింథటిక్ సాక్స్ రెండింటికీ పని చేస్తాయి.
స్టెప్ 1 : శుభ్రపరచే ద్రావకం సిద్ధం చేసుకోవాలి
ఒక కప్పు నీటిలో 2 చిన్న చెంచాల లిక్విడ్ డిటర్జెంట్ కలిపి బాగా మిక్స్ చేయాలి.
స్టెప్ 2 : మరకల పై పూయాలి
ఒక చదునైన ఉపరితలంపై సాక్స్లను పర ిచి శుభ్రపరిచే ద్రావణాన్ని నేరుగా సిరా మరకలు ఉన్న భాగం పై పూయాలి. ద్రావకం ఫాబ్రిక్లోకి చొచ్చుకుపోయే వరకు ఉంచాలి మరియు 5 నిమిషాల వరకు అలాగే ఉండనివ్వాలి.

స్టెప్ 3 :రుద్దాలి
మరకలు ఉన్న భాగాన్ని బాగా రుద్దాలి, సాధ్యమైనంత వరకు సిరా మరకలను తొలిగించాలి.
స్టెప్ 4 :నానబెట్టాలి
ఒక ఆర బకెట్ (½ ) నీళ్లు నింపి అందులో ½ (అర) కప్పు బ్లీచ్, 1 చిన్న చెంచా లిక్విడ్ డిటర్జెంట్ కలపాలి. దానిలో సాక్స్ లను 30 నిమిషాల వరకు నానా బెట్టాలి. గుర్తించుకోండి బ్లీచ్ వాడేటప్పుడు చేతికి రబ్బరు తొడుగులు ధ రించాలి.
స్టెప్ 5 : చేతి ఉతుకు
తరువాత, సాక్స్ లను చేతితో ఉతికి మామూలు నీళ్లలో తీసి వేయాలి.
స్టెప్ 6 :వినెగార్ రుద్దండి
మరకలు అలాగే ఉంటే, కొన్ని చుక్కల వెనిగర్ ను మరకపై రుద్దాలి. సాక్స్ లను మీ వాషింగ్ మెషీన్‌లో వేసి రెగ్యులర్ వాష్ సైకిల్ లో ఉతకాలి.
స్టెప్ 7 : ఆరబెట్టాలి
సాక్స్ లను ఎండాకు ఆరబెట్టాలి.
ఇంతే! ఇలాంటి సులభమైన శుభ్రపరచే చిట్కాలు అనుసరిస్తే, మీరు సిరాలాంటి మొండి మరకలపై యుద్ధం గెలిచినట్టే.