కరోనావైరస్ లాక్డౌన్ సమయంలో కిరాణా సామాగ్రి అయిపోతుందా? మీ వంట గదిలోని వస్తువులను స్మార్ట్ పద్ధతిలో ఎలా ఉపయోగించాలో ఇక్కడ సూచించపడినది

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆహార భద్రత ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత. లాక్ డౌన్ లో పచారీ వస్తువులు త్వరగా అయిపోతాయని మీరు భయపడుతున్నారా, ఇక్కడ కొన్ని కిరాణా షాపింగ్ చిట్కాలు ఉన్నాయి మరియు మీ వంట గదిలో లభించే వస్తువులను వాడుకొనే సలహాలు ఉన్నాయి.

వ్యాసం నవీకరించబడింది

ప్రకటన
Buy Domex
Running Out of Groceries During the Coronavirus Lockdown? Here’s How to Make Smart Use of Items in Your Pantry

కరోనావైరస్ మహమ్మారి మరియు దాని కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో, మీకు అవసరమైన కిరాణా సామాగ్రి మరియు సామాగ్రిని పొందలేకపోయే పరిస్థితిని ఎదుర్కోవటానికి మీరు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి.

కిరాణా సామాగ్రిని కొనడానికి మీరు మీ ఇంటి నుండి బయటకి వెళ్లలేకపోతే, మీకు అందుబాటులో ఉన్న వనరులను ఎక్కువగా ఉపయోగించుకోవడంలో మీకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాక, మీరు ఆన్‌లైన్‌లో కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తుంటే, మీ ఆహార డెలివరీ ప్యాకేజీలను మీరు స్వీకరించిన వెంటనే వాటిని శానిటైజ్ చేయడం ద్వారా సూక్ష్మక్రిములకు దూరంగా ఉంటారు మరియు మీ కుటుంబాన్ని అంటువ్యాధుల నుండి సురక్షితంగా ఉంచడానికి వీలు పడుతుంది. 

మీరు చేయగలిగినదాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకోండి

మీ ప్యాకేజీ ఆహారం యొక్క లేబుళ్ళలోని సూచనలను తనిఖీ చేయండి. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయాలని సూచించినట్లయితే, అలా చేయండి. మీరు సులభంగా పచ్చళ్లు, కురగాయలు, సాస్, కూరగాయలు మరియు పాలను నిల్వ చేయవచ్చు. ఏదైనా నిల్వ చేయలేకపోతే మరియు మీరు దాన్ని ఉపయోగించకూడదనుకుంటే, దాన్ని దానం చేయండి.

పచ్చి మరియు వండిన ఆహారాన్ని విడిగా నిల్వ చేయండి

పచ్చి  ఆహారం మరియు వండిన ఆహారాన్ని విడిగా నిల్వ చేయడం మంచిది. పచ్చి ఆహారం నుండి వచ్చే బాక్టీరియా వండిన, చల్లని ఆహారాన్ని కలుషితం చేస్తుంది మరియు నిల్వచేసినప్పుడు మూడింతలవవచ్చును. మీరు పచ్చి మరియు వండిన ఆహారాన్ని పూర్తిగా కప్పి, మీ రిఫ్రిజిరేటర్‌లో ప్రత్యేక కంపార్ట్‌ మెంట్లలో నిల్వ చేయవచ్చు.

ప్రకటన

ప్రతి వస్తువుపై తేది వేసి లేబులు పెట్టాలి 

కొనుగోలు చేసిన తేదీని తినగలవాటికి లేబులు కట్టాలి. ఇలా చేస్తే ముందుగా  తినవలసిన వాటిని గుర్తించడం మీకు సులభతరం చేస్తుంది.

కూరగాయలను ఒలవడం 

కూరగాయలను శీతలీకరించడానికి ముందు వాటిని ఒలవడం  మంచిది. ఈ కూరగాయలను సూప్‌లకు లేదా అవసరమైనప్పుడు బాగా కలుపుతూ -వేయించడానికి సులభం అవుతుంది. వాటిని చిన్న ముక్కలుగా కోసి గోరు వెచ్చని ఉప్పు నీటిలో ముంచండి. ఒక(1) నిమిషం వేచి ఉండి, వెంటనే వాటిని ఐస్-వాటర్ కంటైనర్లోకి బదిలీ చేయండి. ఇది కూరగాయలను మరింత ఉడకకుండ ఆపివేస్తుంది మరియు వాటిని గట్టిగా ఉంచుతుంది. వాటిని లేబుల్ చేసి తదనుగుణంగా వాడండి.

కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేసే ముందు మీ భోజనాన్ని ప్లాన్ చేసుకోండి

వారానికొకసారి తినాలనుకుంటున్న భోజనాల గురించి  ప్లాన్ చేయండి. అప్పుడు అవసరమైన కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయండి, ముఖ్యంగా పప్పు, పిండి, బియ్యం, బీన్స్ మొదలైనవి చాలా కాలం పాటు ఉంటాయి, మొదట, మీ కుటుంబం తినడానికి ఉపయోగించే భోజనం ఆధారంగా ఆర్డర్‌ చేయండి. సాధారణ భోజనానికి ప్రాధాన్యత లేని ఫాన్సీ వస్తువులను ఆర్డరింగ్ చేయడాన్ని తరువాత సమయానికి వాయిదా వేసుకోవచ్చును .అంతేకాకుండా, మీ కుటుంబానికి అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే వండుకోవాలి. అదనపు ఆహారాన్ని వండటం మానుకోండి, అది వృధా అవుతుంది. అదనపు ఆహారాన్ని దానం చేయడం లేదా వీధి జంతువులకు ఆహారంగా  ఇవ్వండి. 

విషపూరితంకాని  ఫుడ్ కంటైనర్లను ఎంచుకోండి

మీ ఆహారాన్ని శుభ్రమైన మరియు విషరహిత నిల్వ కంటైనర్లలో నిల్వ చేయాలని మేము సూచిస్తున్నాము. ఆహారాన్ని నిల్వ చేయడానికి మాత్రమే వాటిని ఉపయోగించండి. కలుషితమయ్యే అవకాశాన్ని తగ్గించడానికి కంటైనర్లలో బిగుతైన మూతలు ఉన్నాయని నిర్ధారించుకోండి.

 ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్’ రూల్ ఉపయోగించండి

మీరు మొదట పాత తినదగిన వాటిని ఉపయోగించారని నిర్ధారించుకోండి. ప్యాక్‌లలో గడువు తేదీలను తనిఖీ చేసి, తదనుగుణంగా ఉపయోగించండి. క్రొత్త వంట సరుకులను తరువాత ఉపయోగించండి.

మిగిలిపోయిన ఆహారాన్ని తిరిగి ఉపయోగించుకోండి

సాధ్యమైనంతవరకు, దేనినీ వృథా చేయనివ్వవద్దు. ఉదాహరణకు, మరుసటి రోజు ఉదయం మిగిలిపోయిన పప్పుతో పిండి పిసికి పరాటాలు చేసుకోవచ్చు. శాండ్‌విచ్‌లు తయారు చేయడానికి మిగిలిపోయిన పొడి కూరగాయల వంటకు వాడండి; మీకు ఇష్టమైన ఇతర కూరగాయలు మరియు మసాలాలు  మిగిలిపోతే వాటిని అన్నంలో కలపి ఫ్రైడ్ రైస్ చేసుకోండి.

దుంప కూరగాయలను విడిగా నిల్వ చేయండి

బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మొదలైన కూరగాయలను చల్లని, పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాలి. వీటిని మీ రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయనవసరం లేదు.

సబ్బు మరియు నీటితో మీ చేతులను క్రమం తప్పకుండా కడగడం గుర్తుంచుకోండి, లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్  వంట చేసే ముందు మరియు వంట చేసిన తర్వాత మరియు కిరాణా డెలివరీ ప్యాకేజీలను ముట్టుకున్న తర్వాత కూడా వాడండి. మీ ఆహార క్యాబినెట్‌ను శుభ్రపరచడం కూడా చాలా ముఖ్యం. దీని కోసం మీరు సిఫ్ స్ప్రే వంటి ఉత్పత్తిని ఉపయోగించడానికి ప్రయత్నించవచ్చు. సూచనల కోసం ప్యాక్ చదవండి మరియు ముందుగా ఒక చిన్న ప్రాంతంలో పరీక్షించండి.

ముందస్తుగా ప్లాన్ చేయండి, ఏమీ వృథా చేయకండి మరియు మీరు మీ వంట గదిలో ఇప్పటికే ఉన్న కిరాణా సామాగ్రిని చాలా కాలం పాటు ఉపయోగించగలుగుతారు.

సోర్స్:

https://www.who.int/news-room/q-a-detail/q-a-coronaviruses

వ్యాసం మొదట ప్రచురించబడింది