మీ ఫేస్ మాస్క్ యొక్క సరైన ఉపయోగం మరియు పారవేయడం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనిని చదవండి!
కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తికి వ్యతిరేకంగా నివారణ చర్యగా ఫేస్ మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. మీ మాస్క్‌ను ఉపయోగించటానికి మరియు పారవేసేందుకు సరైన మార్గాన్ని తెలుసుకోవడానికి క్రింద ఇచ్చిన చిట్కాలను అనుసరించండి.
వ్యాసం నవీకరించబడింది


ఫేస్ మాస్క్‌లు శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తిని పరిమితం చేయడానికి ఒక ముఖ్యమైన సాధనం, ముఖ్యంగా కోవిడ్ -19ని. ఫేస్ మాస్క్‌ను ఎలా ఉపయోగించాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే మరియు మీ ఫేస్ మాస్క్‌లను సరిగ్గా తొలగించి ఎలా పారేయాలో తెలుసుకోవాలనుకుంటే, మా దగ్గర మీ కోసం ఉపయోగకరమైన సమాచారం ఉంది. మీ మాస్క్‌ను వాడడానికి సరైన మార్గాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటానికి మేము చిట్కాల జాబితాను చేసాము.
చేతులు పూర్తిగా శుభ్రపరచుకోండి
ఫేస్ మాస్క్‌ను సరిగ్గా ఉపయోగించడం ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ఫేస్ మాస్క్ వేసుకునే ముందు మరియు తరువాత సబ్బు లేదా ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్‌తో మీ చేతులను శుభ్రం చేయండి. అలాగే, మీ ముక్కు మరియు నోటిని కప్పడానికి మాస్క్ ఉపయోగించిన తర్వాత దాన్ని తాకకుండా ఉండమని మేము సూచిస్తున్నాము. మీరు అలా చేస్తే, మీ చేతులను ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో శుభ్రపరచాలని గుర్తుంచుకోండి. మీరు మీ నోరు మరియు ముక్కును మాస్క్‌తో కప్పినప్పుడు, మీ ముఖం మరియు మాస్క్ మధ్య ఖాళీలు లేవని నిర్ధారించుకోండి.
మీ మాస్క్ ముందు భాగంలో తాకవద్దు
మీరు మాస్క్‌ను తొలగించాలనుకున్నప్పుడు, దానిని వెనుక నుండి తీసివేసి, తాళ్ళతో పట్టుకోండి. మాస్క్ ముందు భాగాన్ని తాకడం మానుకోండి. మీరు దాన్ని తీసిన తర్వాత, దానిని చిన్న చెత్త సంచిలో వేసి ముడి కట్టండి. అప్పుడు, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో మీ చేతులను శుభ్రపరచండి లేదా సబ్బుతో మీ చేతులను బాగా కడగాలి. ఫేస్ మాస్క్‌లను ఎలా పారవేయాలో మీరు ఆలోచిస్తున్నట్లయితే, ఇది చాలా సులభం: మీ స్థానిక వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలో మాస్క్‌ను పారవేయండి.
ప్రకటన

ఒకసారికి వాడే మాస్క్‌ను తిరిగి ఉపయోగించవద్దు
మీరు ఒకసారికి వాడే మాస్క్‌ను ఉపయోగిస్తుంటే, వాటిలో ఒకటి రెండు దగ్గర పెట్టుకోమని మేము సూచిస్తున్నాము. మాస్క్ తడిగా లేదా బాగా వాడినట్టు అనిపిస్తే, క్రొత్తదానిని ధరించడాన్ని పరిగణించండి. ఒకసారికి వాడే మాస్క్‌ను తిరిగి ఉపయోగించడం మానుకోండి. మీరు ఉపయోగించిన మాస్క్‌ను చిన్న చెత్త సంచిలో వేసి, ఒక ముడి కట్టి, మీ స్థానిక వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థలో పారవేయండి. బహిరంగ ప్రదేశంలో విసిరివేయవద్దు.
ఉపయోగం తరువాత క్లాత్ మాస్క్ ఉతకాలి
పై చిట్కాలో పేర్కొన్న అదే వాడకాన్ని అనుసరించండి. అయితే, ప్రతి ఉపయోగం తర్వాత మీ గుడ్డ మాస్క్‌ను బాగా ఉతకాలి. దాని కోసం మీరు వెచ్చని నీటిలో 1-2 స్పూన్లు వినెగార్ కలిపిన ద్రావణంలో 20 నిమిషాలు నానబెట్టండి. తరువాత ఎప్పటిలాగే వాటిని డిటర్జెంట్ తో ఉతికి, గాలికి ఆరబెట్టండి.
ఈ చిట్కాలను అనుసరించండి. గుర్తుంచుకోండి, మాస్క్‌లను ధరించినప్పుడు మరియు సరిగ్గా పారవేసినప్పుడు మరియు తరచుగా మరియు పూర్తిగా చేతులు కడుక్కోవడం కూడా దానితో పాటు చేసినప్పుడు మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తాయి.
సోర్స్ :
వ్యాసం మొదట ప్రచురించబడింది