
ఆహార ముక్కలు జిప్పర్లలో చిక్కుకోవడం లేదా మీ పిల్లల పాఠశాల లంచ్ బ్యాగ్ యొక్క లైనింగ్ పై ఉండడం ఇలా చాలాసార్లు చూస్తూంటాం. కాబట్టి, నెలకు కనీసం రెండుసార్లు లంచ్ బ్యాగ్ ను శుభ్రంగా కడగడం చాలా అవసరం. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు లంచ్ బ్యాగ్ యొక్క ప్రతి మూలకు మరియు సందుకు చేరేలా చూసుకోండి.
దశ 1: లేబుల్ చదవండి
లేబుల్‌పై తయారీదారు సంరక్షణ సూచనలను చదవండి. చాలా మంచి నాణ్యమైన లంచ్ బ్యాగ్స్ మెషిన్-వాష్ చేయవచ్చు. అయితే, రెండుసార్లు తనిఖీ చేయడం ఎల్లప్పుడూ మం చిది.
దశ 2: ముందు మరకల పై దృష్టిసారించాలి
ఒక (1) చిన్న చెంచా బేకింగ్ సోడా తీసుకొని కొన్ని చుక్కల నీటిని కలిపి మందపాటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు, ఈ పేస్ట్ ను మరకల మీద పూసి చేసి 5 నిమిషాలు వదిలేయెండి. అప్పుడు, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

దశ 3: బ్యాగ్ కడగాలి
మీరు మీ లంచ్ బ్యాగ్‌ను మెషిన్-వాష్ చేయవచ్చని లేబుల్ చెబితే, దాన్ని జిప్ చేసి వాషింగ్ మెషీన్‌లో వేసుకోండి. చల్లటి నీటితో తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించండి మరియు జెంటిల్ సైకిల్‌లో మిషనును నడిపించండి. వీటి పై డ్రైయర్ ఉపయోగించవద్దు.
అయితే, మీరు లంచ్ బ్యాగ్‌ను చేతితో కడుక్కోవాలని నిర్ణయించుకుంటే, ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో 1 చిన్న చెంచా తేలికపాటి డిటర్జెంట్ ను కలపాలి. ఇప్పుడు, ఈ ద్రావణంలో మృదువైన స్పాంజిని నానబెట్టి, లంచ్ బ్యాగ్ పై ఉన్న మరకల పై మృదువుగా రుద్దండి. జిప్పర్ల నుండి ఆహార కణాలను తొలగించడానికి పాత టూత్ బ్రష్ ఉపయోగించండి. మాములు నీటితో ఝాడించి మరియు పొడిగా ఆరబెట్టడానికి దానిని వేలాడదీయండి.
దశ 4: బాగ్‌ను డియోడరైజ్ చేయండి
మీ పిల్లల లంచ్ బ్యాగ్ నుండి ఇంకా దుర్వాసన వస్తున్నట్లు అయితే, బ్యాగ్ లోపల నేరుగా ఒక కప్పు బేకింగ్ సోడా పోసి రాత్రిపూట వదిలివేయండి. మరుసటి రోజు ఉదయం, పొడి కాటన్ వస్త్రంతో శుభ్రంగా తుడవండి.
మీ పిల్లల లంచ్ బ్యాగ్‌ని శుభ్రం చేయడానికి మా దశల వారీ సూచనలను అనుసరించండి. ఇప్పుడు ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనాన్ని ప్యాక్ చేయడానికి సమయం ఆసన్నమైంది!