మీ గోడలపై మీ పిల్లలు రాసిన పిచ్చి రాతలను శుభ్రం చేసేందుకు సూచనలు

బెడ్‌రూమ్‌ గోడలపై క్రేయాన్స్‌తో మీ పిల్లలు తమలో ఉన్న సృజనాత్మకతను చాటుతున్నారా? వాటిని శ్రమలేకుండా మీరు ఎలా శుభ్రం చేయవచ్చో ఇక్కడ ఇస్తున్నాము.

వ్యాసం నవీకరించబడింది

Easy Tips to Clean Your Kids’ Scribbles from Your Walls
ప్రకటన
Nature Protect Floor Cleaner - leaderboard

పిల్లలు గోడలపై పిచ్చిరాతలు రాయడాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రి డీల్‌ చేయవలసి ఉంటుంది. మీ పిల్లల్లో గల సృజనాత్మకతను చూసి మీరు మురిసిపోతుండొచ్చు, కానీ గోడలపై రాసిన పిచ్చిరాతలను వదిలించడం ట్రికీగా ఉంటుంది. చింతించకండి, మీ జీవితాన్ని సుఖమయం చేసేందుకు మరియు శ్రమలేకుండా మీ గోడలను శుభ్రం చేసేందుకు సహాయపడటానికి మేము కొన్ని సూచనలు ఇస్తున్నాము.

వివిధ రకాల ఇంటీరియర్‌ వాల్‌ పెయింట్స్‌ ఉన్నాయి: మ్యాట్‌, శాటిన్‌, సెమీ - గ్లోస్‌ మరియు గ్లోస్‌. ఇవన్నీ మీ శిశువుకు అనువైన వర్క్ స్టేషన్‌ కలుగజేస్తాయి. తమలో ఉన్న సృజనాత్మకతను చాటుకునేలా పిల్లలను ప్రోత్సహించాలి. బెడ్‌రూమ్‌ గోడలపై వాళ్ళు తమ సామర్థ్యాన్ని చాటుకున్నప్పుడు మీ ఇంటి రూపం ఉత్తమంగా ఉండదు కదూ?

మీ గోడలను తిరిగి వాటి అసలు రంగుకు తిరిగి తీసుకొచ్చేందుకు ఈ సూచనలు పాటించండి.

1) క్లీనింగ్‌ ద్రావకం ఉపయోగించండి

ఒక బక్కెట్‌లో గోరువెచ్చని నీటిని నింపి, దానికి కొన్ని చుక్కల డిష్‌వాషింగ్‌ లిక్విడ్‌ కలపండి. పరిశుభ్రమైన వాష్‌క్లాత్‌ తీసుకొని, ద్రావకంలో ముంచండి, అమితంగా ఉన్న నీటిని పిండేయండి మరియు క్రేయాన్‌ రంగులను గోడల నుంచి సులభంగా శుభ్రం చేసేందుకు దీనిని ఉపయోగించండి.

ప్రకటన

Nature Protect Floor Cleaner - mpu

2) గ్లాస్‌ క్లీనర్‌ని ఉపయోగించండి

గోడల్లో మరకలు పడిన ప్రాంతంపై కొద్దిగా గ్లాస్‌ క్లీనర్‌ని పిచికారి చేసి 20 నిమిషాల సేపు వదిలేయాలి.  క్రేయాన్‌ గుర్తులను గ్లాస్‌ క్లీనర్‌ లూజు చేస్తుంది. గోడల నుంచి మరకలను శుభ్రం చేసేందుకు పరిశుభ్రమైన వాష్‌క్లాత్‌ని ఉపయోగించండి.

3) ఇంట్లో తయారుచేసిన పరిశుభ్రమైన పేస్టు ఉపయోగించండి

బేకింగ్‌ సోడా మరియు నీళ్ళు 1 కప్పు చొప్పున తీసుకొని పేస్టు తయారు చేయండి. స్పాంజిని మిశ్రమంలో ముంచండి మరియు క్రేయాన్‌ మరకలను పోగొట్టేందుకు గోడలపై పేస్టు పూయండి. ఈ ప్రక్రియ వల్ల కొద్దిగా అవశేషం ఉండిపోతుంది, సబ్బు నీటితో దీనిని శుభ్రం చేయవచ్చు.

అత్యధిక రకాల గోడ పెయింట్‌పై ఈ సూచనలు పని చేస్తాయి; అయితే, ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని నిర్థారించుకునేందుకు, మొదటగా మీ గోడపై చిన్న ప్యాచ్‌పై, ప్రత్యేకించి దాగివున్న మూలలో వాటిని ప్రయత్నించవలసిందిగా మేము సూచిస్తున్నాము.

పిల్లలు అంటే పిల్లలే, వాళ్ళ చేష్టలు కూడా అలాగే ఉంటాయి. అయితే శ్రమ లేకుండా మీ గోడలను శుభ్రంచేసే పని చేసేందుకు మీరు ఈ సరళ సూచనలు ఉపయోగించవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది