
మీ శిశువుకు ప్రతిదీ ఉత్తమమైనది ఇవ్వడానికి మీరు గట్టిగా కృషి చేస్తారు మరియు శిశువు దుస్తులు ఉతకడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు! మీ చిన్నారి చర్మం సున్నితంగా ఉంటుంది మరియు బ్యాక్టీరియాను తక్కువగా నిరోధిస్తుంది, కాబట్టి శిశువు దుస్తులు ఉతికేందుకు సౌమ్యమైన డిటర్జెంట్‌ని ఉపయోగించవలసిందిగా ఎల్లప్పుడూ సిఫారసు చేయడమైనది.
మీరు అన్నీ సహజమైనవి వాడాలనుకుంటే, ఇంట్లో తయారుచేసిన డిటర్జెంట్‌ని మీరు వాడవచ్చు. మీ శిశువు యొక్క దుస్తులను ఉతకడానికి ప్రత్యేకంగా రూపొంద ించిన సరళమైన 5- స్టెప్‌ల రెసిపీని ఇక్కడ ఇస్తున్నాము.
స్టెప్ 1:
మైక్రోవేవ్ - సురక్షితమైన బౌల్ తీసుకొని, దానిలో 6 కప్పుల బేకింగ్ సోడా కలిపి మీ మైక్రోవేవ్‌లో 5-6 నిమిషాల సేపు వేడిచేయండి.
స్టెప్ 2:
పౌడరు ఫ్లాట్‌గా మరియు గింజలుగా ఉందా అనే విషయం పరీక్షించేందుకు దానిని ఒవెన్ నుంచి బయటకు తీసి చల్లార్చండి.

స్టెప్ 3:
3 బార్‌ల బేబీ సోప్ తీసుకొని దానిని చిన్న ముక్కలుగా కోయండి. అనంతరం వాటిని సమంగా తరగండి.
స్టెప్ 4:
బ ేకింగ్ సోడా మరియు తరిగిన సబ్బు బార్‌లను బ్లెండర్‌కి కలపండి. వాటిని తప్పకుండా సమంగా మిశ్రమం చేయండి.
స్టెప్ 5:
మిశ్రమం ఇప్పుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది మరియు దీనిని పరిశుభ్రమైన డబ్బాలో నిల్వ చేయవచ్చు.
మీ డిఐవై డిటర్జెంట్‌ని చిన్న బ్యాచ్‌లుగా చేయండి, దీనివల్ల ఘటికాంశాలు వాటి శక్తిని కోల్పోకుండా ఉంటాయి.
అవును! మీ జీవితంలోకి నవ జాత శిశువు వచ్చినప్పుడు లాండ్రీ మీ దినచర్యలో భాగమవుతుంది. మీ చిన్నారికి రోజులో అనేక సార్లు దుస్తులు మార్చవలసి ఉంటుంది. మీ లాండ్రీ బాస్కెట్‌లో కుప్పలు గంట గంటకూ పెరుగుతుంటాయి.
కానీ ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వకండి. ఈ డిఐవై రెసిపీ సులభతరమైనది మరియు మీ శిశువు దుస్తులను ప్రభావవంతంగా శుభ్రం చేస్తుంది, అంతే కాదు సున్నితమైన శిశువు చర్మంపై సౌమ్యంగా ఉంట ుంది.