
మీ పసిపిల్లలకు ఇష్టమైన మెత్తటి బొమ్మలు చొంగ, చీము, మురికి బొమ్మలపై పేరుకుపోతాయి మరియు బ్యాక్టీయాకు సంతానోత్పత్తి ప్రదేశంగా మారుతుంది. కొంత కాలానికి, మీ పిల్లల మెత్తటి బొమ్మలు వెలిసిపోతాయి, పేలగా పేలవంగా కనిపిస్తాయి. వాటిని శుభ్రంగా ఉంచడం అవసరం, అవి అందంగా కనిపించడం కోసం మాత్రమే కాదు, క్రిములు లేకుండా ఉంచడం ముఖ్యం. మీ ముద్దు మెత్తటి బొమ్మలను శుభ్రంగా ఉంచుకునేందుకు కొన్ని సలహాలు ఎక్కడ దొరుకుతాయని మీరు అనుకుంటున్నారా? చింతించకండి, మీరు సరైన చోటే ఉన్నారు.
ప ్రో వంటి మెత్తటి బొమ్మలను శుభ్రం చేయడానికి ఈ సాధారణ చిట్కాలను ఉపయోగించండి.
మెత్తటి బొమ్మలను అన్నింటి నీ మీ వాషింగ్ మెషీన్‌లో వేయకూడదు. ఎల్లపుడూ కేర్ లేబుల్‌ని గమనించి ఎలా వాష్ చేయాలో సూచనలని అనుసరించండి. అలాగే, మీ బొమ్మల్లో బటన్స్ వంటి గట్టి వస్తువులు ఉంటే, వాటిని చేత్తోనే కడగండి. ఉతకమని మా సలహా
1) మిషనులో శుభ్రం చేయడం
ఒక చెంచాతో మీ బొమ్మల పై ఉన్న కఠినమైన మురికిని తొలగించడం మొదలుపెట్టండి. తర్వాత, మీ ‘ొమ్మలని బొమ్మలని వాషింగ్ మెషీన్ లో పాడైపోకుండా కాపాడటానికి మెష్‌బ్యాయగ్ లేదా పిల్లో కేస్‌లో ఉంచండి. మీ మెషీన్‌ని జెంటిల్‌లో ఉంచి, చల్లని నీటి సైకిల్‌లో సెట్ చేయాలి. తర్వాత 1/2 కప్పు తేలికపాటి డిటర్జెంట్‌ని మరియు 1/2 కప్పు తెల్ల వెనిగర్‌ని వేయాలి మరియు వాష్ సైకిల్‌ని నడిపించాలి. ఒకసారి పూర్తయిన తర్ వాత, చదునైన చోట బొమ్మలని పెట్టి ఆరనివ్వాలి.

2) చేతితో శుభ్రం చేయడం
బొమ్మలు చిరగకుండా ఉండాలంటే, చేత్తో ఉతకడేమే మంచిది. ఒక చెంచాతో మీ ‘బొమ్మలపై ఉన్న కఠినమైన మురికిని తొలగించడం మొదలుపెట్టండి. 1/2 బకెట్ గోరు వెచ్చని నీటిలో 1/2 కప్పు డిష్ వాషింగ్ లిక్విడ్‌ని వేసి 30 నిమిషాల పాటు నాననివ్వండి. దీనితోనే మొత్తం మురికి పోతుంది. బొమ్మలని తీసి బకెట్‌ని ఖాళీ చేయండి. తర్వాత, 1/2 కప్పు తేలికపాటి డిటర్జెంట్‌ని, వైట్ వెనిగర్‌ని 1/2 బకెట్ గోరు వెచ్చని నీటిలో వేసి మరొక మిశ్రమంలా తయారుచేసి బాగా కలపండి. బొమ్మలను ఈ మిశ్రమంల ో నిదానంగా ఉతికి క్షుణ్ణంగా నీటిని పిండాలి. చదునైన ప్రదేశంలోఉంచి ఆరనివ్వాలి.
ఇప్పుడు చూడండి. ఈ సులువైన చిట్కాలతో మీ పిల్లల మెత్తటి బొమ్మలపై మురికిని, క్రిములని నాశనం చేయచ్చు.