మీ పిల్లల యొక్క స్కూల్ బ్యాగులకు తాజా సువాసన జోడించేందుకు సులభ చిట్కాలు
మీ పిల్లలు తరచుగా దుర్వాసన వచ్చే మేజేళ్ళు లేదా స్కూలు బ్యాగులలో ఆహార పదార్థాలు పడేసుకొని ఇంటికి వస్తుంటారు. ఒక్క క్షణంలో వాళ్ళ బ్యాగ్‌లు తాజా సువాసన వచ్చేలా మీరు ఎలా చేయాలో ఇక్కడ ఇస్తున్నాము.
వ్యాసం నవీకరించబడింది


మీ పిల్లలు ప్రతి ఒక్కటీ స్కూలు బ్యాగులలో కుక్కుతున్నారా? వాళ్ళ బ్యాగుల లోపల అనేక వస్తువులు ఉంటాయి కాబట్టి, వాటి నుంచి దుర్వాసన రావడాన్ని మీరు గమనించే వుంటారు. కాబట్టి ఆ బ్యాగులు సువాసన వచ్చేలా ఏదైనా చేయవలసిన అవసరం ఉందని భావిస్తారు.
మీ పిల్లల బ్యాగుల్లో చేతులు పెట్టడమంటేనే మీకు భయం కలగవచ్చు— లోపల ఏవి పొంచివుంటాయో ఎవరికి తెలుస్తుంది — కానీ రిలాక్స్ అవ్వండి. మీ కోసం మా వద్ద సరళ, ప్రభావవంతమైన పద్ధతి ఉంది.
మీ పిల్లల స్కూలు బ్యాగులకు సరైన పద్ధతిలో పరిశుభ్రత మరియు తాజా సువాసన ఎలా కల్పించవచ్చో ఇక్కడ ఇస్తున్నాము.
స్టెప్ 1: బ్యాగ్‌ని ఖాళీ చేయండి
స్కూలు బ్యాగ్‌ని ఖాళీ చేయడం మీరు చేయవలసిన మొదటి చర్య. జేబులన్నిటినీ కూడా ఖాళీ చేయాలని గుర్తుంచుకోండి.
ప్రకటన

స్టెప్ 2: బ్యాగ్‌ని శుభ్రం చేయండి
శుభ్రం చేయడానికి, 1 కప్పు గోరువెచ్చని నీరు గల ద్రావణం మరియు 1 చిన్న చెంచా డిష్‌వాషింగ్ లిక్విడ్ కలపండి. బ్రష్ తీసుకొని ఈ ద్రావణంతో స్కూలు బ్యాగ్‌ని సౌమ్యంగా రుద్దండి. కొద్ది నిమిషాల సేపు రుద్దండి, తరువాత నీటిలో ముంచిన వస్త్రంతో దీనిని తుడిచి శుభ్రం చేయండి.
స్టెప్ 3: బ్యాగ్‌ని ఉతకండి
కేర్ లేబుల్ కనుక మెషీన్లో ఉతకాలని సూచిస్తే, ఒక చెంచా మీకు ఇష్టమైన డిటర్జెంట్‌ని కలిపి చల్లని సైకిల్లో బ్యాగ్‌ని ఉతకండి (మెషీన్‌తో వచ్చే కొలతను ఉపయోగించండి). కేర్ లేబుల్ కనుక హ్యాండ్ వాషింగ్ని సూచిస్తే, 1 బక్కెట్ గోరువెచ్చని నీరు మరియు మీకు ఇష్టమైన 2 పెద్ద చెంచాల డిటర్జెంట్ లేదా డిష్‌వాషింగ్ లిక్విడ్‌తో ద్రావణం తయారు చేయండి. బ్యాగ్‌ని రుద్దడానికి మరియు దానిని ఉతకడానికి ఈ ద్రావణం మరియు బ్రష్ ఉపయోగించండి. బ్యాగ్ యొక్క కొన్ని భాగాలు సున్నితంగా ఉంటే మీరు స్పాంజిని కూడా ఉపయోగించవచ్చు, మీ సింకులో బ్యాగ్‌ని చేతితో ఉతకవచ్చు.
స్టెప్ 4: బ్యాగ్‌ని ఆరబెట్టండి
రోజంతా తిరగేసిన తరువాత సహజమైన ఎండలో బ్యాగ్‌ని వేలాడ దీసి ఆరబెట్టండి. బ్యాక్టీరియాను చంపడానికి ఎండ సహాయపడుతుంది మరియు బ్యాగ్‌ని చెమటవాసన లేకుండా కూడా చేస్తుంది. ఉపయోగించేందుకు మీ బిడ్డకు తిరిగివ్వడానికి ముందు స్కూలు బ్యాగ్‌ని పూర్తిగా ఆరబెట్టండి.
స్టెప్ 5: తాజా సువాసన కలపండి
స్కూలు బ్యాగ్‌కి తాజా సువాసన కలిపేందుకు, ఒక బౌల్లో చిన్న చెంచా నీళ్ళు తీసుకొని మీకు ఇష్టమైన 3-4 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపండి. దానిని బాగా కలియబెట్టండి. చిన్న చాక్ ముక్క తీసుకొని దానిని ఈ ద్రావణంలో వేయండి. దీనిని ద్రావణం మొత్తాన్ని పీల్చుకోనివ్వండి. చాక్ని వస్త్రంలో చుట్టి మీ పిల్లల స్కూలు బ్యాగ్ మూలలో పెట్టండి. ఇది బ్యాగులకు తాజా సువాసన చేర్చుతుంది. మీరు ప్రతి వారం చాక్ని మార్చవచ్చు.
మీరు మీ పిల్లల స్కూలు బ్యాగులు సువాసన వచ్చేలా చేయాలనుకున్న ప్రతి సారి మీరు ఈ సులభ మరియు ప్రభావవంతమైన గైడ్ చదవండి.
కీలక చర్య:
కప్పు బేకింగ్ సోడా తీసుకొని బ్యాగ్ పొడిగా ఉన్నప్పుడు దాని అడుగున పోయాలి. దీనిని రాత్రంతా అలా వదిలేసి, తరువాత పారేయండి. దుర్వాసను పోగొట్టడానికి ఇది సహాయపడుతుంది మరియు బ్యాగులు సువాసన వచ్చేలా చేసేందుకు పై చర్యలు పాటించే ముందు మీకు తగినంత సమయం ఉంటుంది
వ్యాసం మొదట ప్రచురించబడింది