మీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ కు తాజా సువాసనను జోడించడానికి సులభమైన చర్యలు
పిల్లలు స్కూల్ నుంచి రాగానే, మేజోళ్ళలో దుర్వాసనతో లేదా స్కూల్ బ్యాగ్ పై ఆహార మరకలతో ఇంటికి వస్తారు. అలాంటిప్పుడు తాజా సువాసన వచ్చే విధాంగా ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం.
వ్యాసం నవీకరించబడింది


మీ పిల్లలు ప్రతిదాన్ని వారి స్కూల్ బ్యాగ్ లో వేసుకుంటారా? వారి స్కూల్ బ్యాగ్ లో ఎన్నో రకాలైన నిల్వ ఉంచిన ఆహార వస్తువులు దాగి ఉంటాయి. వాటి నుంచి వెలువడే దుర్వాసనను మీరు గమనించి ఉండవచ్చు. ఇలాంటి సమయంలో వాళ్ల స్కూల్ బ్యాగ్స్ సుగంధ భరితమైన సువాసనను జోడించాల్సిన అవసరం ఎంతైన ఉంది.
మీ పిల్లల స్కూల్ బ్యాగులో తొంగిచూడడానికి భయమేస్తుంది-లోపల ఏవి కుక్కబడ్డాయో మీకెలాతెలుస్తుంది-గాబరా పడవద్దు. మీ కొరకు సులభమైన, ప్రభావవంతమయిన పద్ధతి మా దగ్గర ఉన్నది.
వాసనలను సమర్ధవంతంగా తొలగించి తాజా పరిమళం వెదజల్లడానికి సరైన రీతిలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
స్టెప్ 1: స్కూల్ బ్యాగ్ లో ఏమీ లేకుండా ఖాళీ చేయాలి
మొదటి చర్య, స్కూల్ బ్యాగ్‌ని ఖాళీ చేయడం. అన్ని పాకెట్లను ఖాళీ చేయాలని గుర్తుంచుకోండి.
ప్రకటన

స్టెప్ 2: బ్యాగ్‌ని శుభ్రపరచే విధానం
శుభ్రం చేయడానికి, ఒక కప్పు గోరు వెచ్చని నీళ్లలో 1 టీ స్పూన్ డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్యాగ్స్ పై ఉన్న మెండి మరకల పై అప్లై చేసి బ్రష్ తో సున్నితంగా రుద్దాలి. కొన్ని నిమిషాలు పాటు రుద్దిన తరువాత తడిగుడ్డతో శుభ్రంగా తుడచుకోవాలి.
స్టెప్ 3 : బ్యాగ్ ను కడగాలి
ఒక వేళ సంరక్షణ లేబులు మిషన్ వాషింగ్ అని సూచిస్తే, మీకు ఇష్టమైన డిటర్జెంట్‌ని ఒక చెంచా కలిపి బ్యాగ్‌ను ఉతకడానికి వేయాలి. (మిషనుతో వచ్చే కొలతలను ఉపయోగించాలి). లేదా చేతితో ఉతకాలి అని సంరక్షణ లేబులు సూచిస్తే, ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లలో 2 చెంచాల మీకిష్టమైన డిటర్జెంట్ లేదా డిష్ వాషింగ్ లిక్విడ్ వేసి ద్రవం సిద్ధం చేసుకోవాలి. ఈ ద్రావకాన్ని మరియు ఒక బ్రష్‌ను ఉపయోగించి బ్యాగ్ పై రుద్దాలి మరియు నీటిలో ఝాడించాలి. బ్యాగ్ లోని కొన్ని భాగాలు సున్నితమైనవయితే, మీరు స్పాంజిని ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చును మరియు మీ సింక్‌లో చేతితో ఉతుక్కోవచ్చును.
స్టెప్ 4: బ్యాగును అర బెట్టాలి
బ్యాగును లోపలి భాగాన్ని బయటికి తీసి సహజమైన సూర్యకాంతిలో ఒక రోజంతా ఆరబెట్టాలి. సూర్యకాంతి వేలాడుతున్న బాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది మరియు బ్యాగ్‌ను డీయోడరైజ్ కూడా చేస్తుంది. మరలా ఉపయోగించడానికి మీ పిల్లలకు బ్యాగును ఇచ్చే ముందు స్కూల్ బ్యాగ్ పూర్తిగా ఆరిపోయిందని నిర్ధారించుకోవాలి.
స్టెప్ 5: తాజా సువాసనను కల్పించండి
స్కూల్ బ్యాగ్‌కు తాజా సువాసనను కల్పించడానికి, ఒక గిన్నెలో నీరు తీసుకోని వాటిలో మీకు ఇష్టమైన సుగంధ తైలంను 3-4 చుక్కలు జోడించి బాగా కలుపుకోవాలి. చిన్న సుద్ద ముక్క తీసుకోని ఆ ద్రావణంలో నానా బెట్టాలి. సుద్ద ముక్క ఆ ద్రావణం పూర్తిగా గ్రహించిన తరువాత వాటిని కర్ఛీఫ్ లో పెట్టి స్కూల్ బ్యాగ్ లో మూలన పెట్టాలి. దీంతో స్కూల్ బ్యాగ్స్ సువాసన భరితంగా మారిపోతుంది. ఇలా ప్రతి వారం సుద్దముక్కను మార్చుకోవచ్చు.
కీ స్టెప్:
పిల్లల స్కూల్ బ్యాగ్ క్రింది భాగం అరిన తరువాత ఒక కప్పు బేకింగ్ సోడా తీసుకొని పోయాలి. రాత్రంతా అలా వదిలేసి, ఆపై పారేయాలి. ఇలా చేయడం వాసనను తటస్థీకరిస్తుంది మరియు బ్యాగ్‌లు సువాసనభరితంగా మారడానికి పైన పేర్కొన్న చర్యలను పాటించేందుకు సమయం లభిస్తుంది.
వ్యాసం మొదట ప్రచురించబడింది