
మీ లివింగ్ రూంలో శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉన్న సోఫా మీ అతిధులను ఆహ్వానిస్తుంటే, మరొక వస్తువు ఏదీ కనిపించదు. కానీ మీ ఇంట్లో పిల్లలు ఉంటే, ప్రమాదవశాత్తు మీ సోఫాపై ఏవైనా వలికితే మరకలు పడకుండా ఎంత జాగ్రత్త వహించినా తప్పదు. మీ సోఫా తెల్లది అయితే పరిస్థితి మరింత నాటకీయంగా మారుతుంది. అయితే, షర్బత్తు ఇంకా పళ్ళ రసాలు వంటి కొన్ని మరకలని సులువుగా తొలగించవచ్చు. ఏడాదికి ఒకసారి వృత్తిపరమైన సహాయం తీసుకోవడం మంచిదే. కానీ కొన్ని సార్లు, ఈ సులువైన చిట్కాలని పాటించండి.
1. లెదర్ సోఫా
నూలు బట్టని తీసుకోండి, షర్బత్తు పడ్డ చోట నెమ్మదిగా ఒత్తి సోఫాని శుభ్రం చేయండి. 2 చెంచాల లిక్విడ్ డిటర్జెంటని బౌల్ నీటిలో వేసి బాగా కలపండి. మృదువైన స్పాంజ్‌ని ఈ శుభ్రపరిచే మిశ్రమంలో నానబెట్టి మీ సోఫాపై మరకలున్న చోట తుడవండి.
తర్వాత 2 బౌల్స్ గోరువెచ్చని నీటిని తీసుకుని బకెట్‌లో పోయండి. ఈ నీటితో పొడిగా, శుభ్రంగాఉన్న తువ్వాలుని తడి చేయండి. సోఫాని శుభ్రం చేసే మిశ్రమాన్ని ఈ తువ్వాలు పై వేసి శుభ్రం చేయండి. పొడి తువ్వాలుతో మరకలున్న చోట తుడిచి, నీటి మరకలు లేకుండా నిర్ధారించుకోండి.
2. వస్త్రం అప్‌హోల్‌స్ట్రీతో తయారుచేయబడ్డ సోఫా
ఒకవేళ తెల్లటి ఫాబ్రిక్ సోఫాపై పొరపాటుగా ఏదైనా ఒలికితే, వెంటనే పొడి నూలు బట్ట తీసుకుని మరక ఉన్న చోట ఒత్తి ఉంచాలి. నూలు బట్ట సోఫాపై ఒలికిన షర్బత్తుని చాలా వరకు పీల్చుకుంటుంది. ఒక బౌల్ తీసుకుని కప్పుల గోరువెచ్చని నీటిని తీసుకుని, 1 కప్పు వెనిగర్, 1 కప్పు బేకింగ్ సోడా మరియు 2 చెంచాల రాళ్ళ ఉప్పుని వేయండి. వీటన్నింటినీ బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని పిచికారీ చేసే సీసాలోనికి తీసుకోండి.

ఇప్పుడు మిశ్రమాన్ని మరక ఉన్న చోట పిచికారీ చేసి , నెమ్మదిగా మిశ్రమాన్ని మైక్రోఫైబర్ బట్టతో ఒత్తాలి. మీరు మైక్రో ఫైబర్ క్లాత్‌పై మిశ్రమాన్ని స్ప్రే చేసి పిచికారీ చేసి, బట్టని మరక ఉన్న చోట ఎక్కువ సార్లు ఒత్తాలి. ఇది షర్బత్తు మరకలని మరియు నిమిషాల్లో మీ సోఫా వాసనని తొలగించడానికి సులువైన విధానం. ఒకస ారి షర్బత్తు మరక మాయం కాగానే, మరక ఉన్న చోట పొడి బట్టతో ఒత్తి శుభ్రం చేయండి.
మీ సోఫాని సరికొత్త దానిలా మీరు శుభ్రం చేసారు. ఇకపై సోఫా మీద మీ పిల్లలు దేన్ని ఒలిపినా మీరు కంగారు పడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఏం చేయాలో మీకు తెలుసు కదా.