
మీరు మీ ఇంటిని బాగా శుభ్రంచేసేందుకు మీకు నెలల తరబడి సమయం లభించకపోతే, పెండింగులో ఉన్న హామ్‌క్లీనింగ్ ప్రాజెక్టులను చేపట్టే సమయం ఇదే. మీరు ఇంటిలోనే ఉంటున్నప్పుడు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచి ఆలోచన, ఎందుకంటే మీ ఇంటిని శుభ్రంచేయడం చాలా థెరపియూటిక్‌గా ఉండొచ్చు కాబట్టి.
మీ అద్దం బూదరబూదరగా మారిందా లేదా మీ తెల్లని దిండు గలీబులు పసుపుపచ్చగా మారాయా? రోజువారీ ఆఫీస్ పని మరియు ఇంటి పనులు మీరు వీటిని విస్మరించేలా చేసివుండొచ్చు. అయితే వీటిని శుభ్రం చేయడాన ికి ఇదే సరైన సమయం.
మిక్సర్ మరియు గ్రైండర్
-mixer-and-grinder.jpg)
మీ ఇంట్లోని మిక్సర్ మరియు గ్రైండర్ మురికిగా మారాయా? కంటెయినర్‌లో నీళ్ళు మరియు డిష్‌వాషింగ్ జెల్ కలిపి మీ మిక్సర్‌ని ఆన్ చేయండి. మీరు పదునైన బ్లేడ్‌లను తాకవలసిన పని లేకుండానే మీ మిక్సర్ లోపలి వైపులను ఇది శుభ్రం చేస్తుంది. సబ్బు ద్రావణాన్ని తయారుచేసేందుకు మీరు విమ్ డిష్‌వాషింగ్ లిక్విడ్‌ని ఉపయోగించవచ్చు. ఇది మార్కెట్‌లో సులభంగా లభిస్తుంది.

మైక్రోవేవ్

ఈ రోజుల్లో మీరు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి, మీరు మీ కుటుంబం కోసం బేక్ చేయాలనుకోవచ్చు లేదా ఇంట్లో చేసే పిజ్జాను తయారుచేయడానికి కూడా ప్రయత్నించవచ్చు. కానీ మీరు మీ మైక్రోవేవ్‌ని చివరిసారిగా ఎప్పుడు శుభ్రం చేశారు? దీనిని శుభ్రంచేయడానికి నీళ్ళు మరియు డిష్‌వాషింగ్ లిక్విడ్‌ని ఉపయోగించండి. మీరు దీనిని మళ్ళీ ఉపయోగించే ముందు బాగా ఆరబెట్టండి.
కిచెన్ అటకలు
-kitchen-shelves.jpg)
మనం ప్రతి రోజూ మన వంట పాత్రలు కడుగుతుంటాము, కానీ మన కిచెన్‌లోని అటకలను తుడవడానికి పెద్దగా సమయం లభించదు. ఫలితంగా, బాగా తాకుతుండే వీటి ఉపరితలాలపై నూనె మరియు మడ్డి జమవుతాయి. ఈ ఉపరితలాలన్నిటినీ రెగ్యులర్‌గా వాడే డిటర్జెంట్ మరియు నీటితో శుభ్రం చేయవచ్చు.
శుభ్రం చేసిన తరువాత, మెరుగైన పరిశుభ్రత కోసం మీరు వాటిని క్రిమిసంహారం చేయవచ్చు. తరచుగా తాకుతుండే ఉపరితలాలను క్రిమిసంహారం చేయడానికి సోడియం హైపోక్లోరైట్‌ని 0.5% చొప్పున (5000 పిపిఎంకి సమానం) ఉపయోగించవలసిందిగా ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు సిఫారసు చేస్తున్నాయి. మీ ఇంట్లోని ఉపరితలాలను క్రిమిసంహారం చేసేందుకు, క్రియాశీల పదార్థంగా సోడియం హైపోక్లోరైట్‌ని 0.5% కంటే ఎక్కువ గాఢతలో ఉన్న డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్ లాంటి ఉత్పాదనలను మీరు ఉపయోగించవచ్చు. ప్యాక్‌పై నిర్దేశించినట్లుగా ఉపయోగించండి మరియు అనుకూలతను తెలుసుకునేందుకు మొదటగా ఎల్లప్పుడూ చిన్న మరుగుపరచబడిన చోట పరీక్షించి కడిగేయండి.
మసాలా డబ్బాలు
-spice-containers.jpg)
మీ కిచెన్‌లోని మసాలా డబ్బాలు నూనె బంకగా మరియు జిడ్డుగా మారాయా? వాటిల్లో ఉన్న పదార్థాలన్నిటినీ ఖాళీ చేసి నీరు మరియు డిష్‌వాషింగ్ లిక్విడ్ మిశ్రమంతో డబ్బాలను శుభ్రం చేయండి. మీరు వాటిని మళ్ళీ మసాలాలతో నింపడానికి ముందు తుడిచి ఆరబెట్టండి.
వాటర్ బాటిల్స్
-water-bottles.jpg)
మీ కిచెన్‌లోని మసాలా డబ్బాలు నూనె బంకగా మరియు జిడ్డుగా మారాయా? వాటిల్లో ఉన్న పదార్థాలన్నిటినీ ఖాళీ చేసి నీరు మరియు డిష్‌వాషింగ్ లిక్విడ్ మిశ్రమంతో డబ్బాలను శుభ్రం చేయండి. మీరు వాటిని మళ్ళీ మసాలాలతో నింపడానికి ముందు తుడిచి ఆరబెట్టండి.
ల్యాంప్‌షేడ్స్

ఇంట్లో ల్యాంప్‌లు ఉండటం మీకు ఇష్టమే అయినప్పటికీ, ల్యాంప్‌షేడ్స్‌ని శుభ్రం చేయడం మీకు కష్టంగా అనిపించవచ్చు. మీ ఇంటికి ఉజ్వలమైన రూపం ఇచ్చేందుకు మీరు ఈ పని ఇప్పుడు ఎందుకు చేయకూడదు? మీరు పాత వస్త్రంతో మీ మెటల్ ల్యాంప్‌షేడ్స్‌ని తుడవవచ్చు, ఒకవేళ అవి వస్త్రంతో తయారుచేసినవి అయితే చేతులతో కడగవచ్చు.
విండో కర్టెన్‌లు
-window-curtains.jpg)
మీ విండో కర్టెన్‌లు తీసి మీ వాషింగ్ మెషీన్‌లో వేయండి. వాటికి హుక్స్ ఏమీ తగిలించిలేవని నిర్థారించుకోండి. కర్టెన్‌లను నీడలో ఆరబెట్టండి, ఎందుకంటే నేరుగా ఎండ తగిలితే రంగు వెలసి పోతుంది.
తెల్లని పిల్లోకేసులు
-white-pillowcases.jpg)
తెల్లని పిల్లోకేసులు మీ మంచంపై నిండైన తెల్లటి మేఘాలు మాదిరిగా కనిపిస్తాయి. అయితే, కాలం గడిచే కొద్దీ, అవి పసుపుపచ్చ రంగులోకి మారుతుంటాయి. మరకలు తొలగించేందుకు మీరు వాటిని ఇప్పుడు ఉతకవచ్చు. షీట్‌లు మరియు దుస్తులు మళ్ళీ తెల్లగా కనిపించేలా చేసేందుకు రిన్ అలా లాంటి బ్లీచ్-ఆధారిత (సోడియం హైపోక్లోరైట్) ఉత్పాదనను మీరు ఉపయోగించవచ్చు. రిన్ అలా అనేది సోడియం హైపోక్లోరైట్ బ్లీచ్ మరియు తెల్లని దుస్తులపై మాత్రమే ఉపయోగించేందుకు సిఫారసు చేయబడుతోంది. దీనిని రంగు దుస్తులపై ఉపయోగించకండి.
అద్దాలు

మీ ఇంట్లోని అద్దాలు బూదరగా మారాయా? మీ వాడ్రోబ్ మరియు డ్రెస్సింగ్ అద్దాలపై దుమ్ము జమవుతుంది మరియు రేణువులు తయారవుతాయి మరియు మురికిగా మారతాయి. అద్దాలను పాత దినపత్రికతో లేదా లింట్-లేని వస్త్రంతో తుడవండి, అవి మళ్ళీ తళతళ మెరుస్తాయి!
షవర్ కర్టెన్‌లు
-shower-curtains.jpg)
షవర్ కర్టెన్‌లు మీ మిగతా బాత్‌రూమ్‌ని పొడిగా ఉంచుతాయి, కానీ ఫోమ్ మరియు నురుగు జమవుతుంటాయి. వాటిని డిటర్జెంట్ మరియు నీటితో కడిగితే కొత్త వాటిలాగా మెరుస్తాయి!
మీరు ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి మీ ఇంటిని శుభ్రంచేయడం మంచి ఆలోచన. మీ ఇంటిని దుమ్ము మరియు క్రిమిరహితంగా ఉంచేందుకు మా క్లీనింగ్ సూచనలు పాటించండి. తద్వారా మీరు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తారు.