
విషయాలు మామూలుగా కనిపించడం ప్రారంభించినప్పుటికి పరిశుభ్రమైన ఆచారాలను శ్రద్ధగా పాటించడం చాలా ముఖ్యం. ఇంటి వెలుపల అడుగు పెట్టడం అనివార్యం కావచ్చు, కానీ మీరు మీ ఇంటి లోపలి ప్రదేశాలను కలుషితం చేసే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి, మీ దినచర్యను తిరిగి ట్రాక్ చేసేటప్పుడు సరైన సమతుల్యతలో ఎలా కొనసాగించవచ్చో ఇక్కడ ఉంది.
సబ్బు లేదా శానిటైజర్‌తో మీ చేతులను సరైన పద్ధతిలో తరచుగా కడగడం ద్వారా పరిశుభ్రతను అనుసరించండి. నియమం ప్రకారం, మీరు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మీరు చేయవలసిన మొదటి పని ఇది. వాస్తవానికి, మీరు బయటికి వచ్చినప్పుడు కూడా, మీరు వీలైనంత తరచుగా మీ చేతులను శానిటైజ్ చేసుకోండి లేదా కడుక్కోండి. మీరు ప్రజా రవాణా లేదా ఒక ప్రైవేట్ వాహనాన్ని తీసుకున్న తర్వాత మరియు ఇంట్లోని పనులను పూర్తి చేసిన తర్వాత మీ చేతులను శానిటైజ్ చేయడం చాలా ముఖ్యం. కనీసం 20 సెకన్ల పాటు మీ చేతులను బాగా కడగాలిని గుర్తుంచుకోండి.
ఇంట్లోని మీ పనులను ఇంటి సభ్యుల మధ్య విభజించండి
మీ అంతట మీరే ప్రతిదీ చేయలేరు, ముఖ్యంగా మీ బయటి కార్యకలాపాలు పునఃప్రారంభించబడ్డాయి కనుక. ఇంటి పనులను కుటుంబ సభ్యులందరికీ ముందుగానే విభజించండి. ఒక వ్యక్తి గిన్నెలు చూసుకుంటే, మరొకరు నేల తుడుచుకోగా, మూడవ వారికి బట్టలను ఉతికే పని అప్పచెప్పండి పిల్లలకు కూడా దీంట్లో భాగస్వామ్యం కల్పించండి మరియు వారికి ప్రాథ మిక పరిశుభ్రత నైపుణ్యాలను ఈ విధంగా నేర్పించవచ్చు.
ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, ఆ కుటుంబ సభ్యునికి సంబంధించిన శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకం పనులను నిర్వహించడానికి ఒక వ్యక్తిని మాత్రమే నియమించండి. ఇందులో వారి బట్టలని ఉతకడం, వారి గదిని క్రిమిసంహారకం చేయడం, వారి గిన్నెలను శుభ్రం చేయించడం లాంటివి . ఇలా చేస్తే , మీరు ఇంటి పనిని చేస్తూ ఇతర సభ్యులకు అంటువ్యాధుల వ్యాప్తిని కూడ నిరోధించవచ్చు.

వారాంతాల్లో క్షుణ్ణంగా శుభ్రం చేయండి
వారాంతాల్లో కిచెన్ డ్రాయర్లు, ఫ్రిజ్ అరలు, బాత్రూమ్, బ ెడ్ రూమ్ లాంటి అన్నీ గదులను శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకం చేయడం వంటి భారీ పనులను, క్షుణ్ణంగా శుభ్రపరిచే పనులను చేయండి. పని దినాలలో వీటిని చేస్తే అలసిపోతారు.
ఎక్కువగా తాకే ఉపరితలాలను తరచుగా క్రిమిసంహారకం చేయండి
శుభ్రపరచడం సరిపోదు. స్విచ్‌లు, తలుపులు మరియు కిటికీ గొళ్ళాలు, ఫోన్లు, టేబుల్స్, తాళం చేతులు , రిమోట్ కంట్రోల్స్, ఫ్లష్ హ్యాండిల్స్, కుళాయిలు మొదలైన ఉపరితలాలు ఇంట్లో ప్రతిఒక్కరూ తరచుగా తాకుతారు. మీరు ఈ అధిక స్పర్శ ఉపరితలాలను తగినంతగా మరియు తరచుగా శుభ్రం చేసి, క్రిమిసంహారకం అయ్యేలా చూడాలి. సూక్ష్మక్రిములను చంపే డోమెక్స్ మల్టీ-పర్పస్ క్రిమిసంహారించే స్ప్రే లాంటివి వాడండి. చిన్న మరుగైన ప్రదేశంలో ఎల్లప్పుడూ పరీక్షించండి మరియు మొదట అనుకూలతను తనిఖీ చేసి శుభ్రం చేసుకోండి. ఉత్పత్తిపై సూచనలను చదవడం మర్చిపోవద్దు మరియు మృదువైన మరియు సుక్ష్మ రంధ్రముగల ఉపరితలాల కోసం ఇది సిఫార్సు చేయబడిందో లేదో తనిఖీ చేయండి.
ఒకే రకం పనులను సంయోగం చేయండి
శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకం లాంటి పనులను మరియు ఇతర కార్యకలాపాలను సంయోగం చేస్తే సమయం అదా అవుతుంది. కరోనావైరస్ కు ముందు, మీరు మీ కిరాణా షాపింగ్, మెడిసిన్ షాపింగ్, పిల్లల వస్తువుల కోసం షాపింగ్ మరియు ఇతర అవసరమైన వాటిని ఒక వారం వ్యవధిలో విభజించి ఉండవచ్చు. కానీ కరోనావైరస్ వ్యాప్తి తరువాత బయటకి వెళ్లి ఇంటికి వచ్చిన ప్రతిసారి శానిటైజింగ్ మరియు క్రిమిసంహారకం అవసరం. ఇలాంటి దినచర్యను వారానికి చాలాసార్లు పునరావృతం చేస్తే సమయం వృధా అవుతుంది. మీ మొత్తం వారపు అవసరాలను ప్లాన్ చేయడం మరియు ఒకే ట్రిప్‌లో అన్ని షాపింగ్‌లు పూర్తి చేయడం మంచిది. ఈ విధంగా, మీ పోస్ట్-షాపింగ్ శుభ్రపరచడం వారానికి ఒకసారే వస్తుంది.
లాండ్రీ మరియు వంట సంబంధిత పనులను కూడ గుంపుగా ఏర్పడి చేయవచ్చు.
ఆన్‌లైన్ ఆర్డర్‌ల ప్రణాళిక మరియు షెడ్యూల్ డెలివరీ
రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం లేదా మార్కెట్‌ను సందర్శించడం నివారించడానికి, మీరు ఆన్‌లైన్ డెలివరీని ఎంచుకోవాలి, అందుబాటులో ఉంటే నో-కాంటాక్ట్ డెలివరీ వ్యవస్థను ఎంచుకోండి. అలాగే, సాధ్యమైనప్పుడల్లా, వారంలో పలు మార్లు డెలివరీలను స్వీకరించడానికి బదులుగా, ఒకే రోజు డెలివరీలను షెడ్యూల్ చేయండి. ఈ విధంగా మీరు ప్రతి ప్యాకేజీని డెలివరీ చేసినప్పుడు మరియు శానిటైజింగ్ సమయాన్ని వృథా చేయరు. వాటిని శానిటైజ్ చేయడానికి క్రిమిసంహారకం వైప్స్ లేదా సబ్బు మరియు నీరు ఉపయోగించి ఒకేసారి కూర్చోని ఉన్న చోట చేయవచ్చు, ప్యాకేజింగ్ మెటీరియల్ ఆధారంగా.
మీ ఇల్లు మరియు కార్యాలయ స్థలాన్ని శుభ్రపరచడం మరియు క్రిమిసంహారకం చేయడం ఇప్పుడు గతంలో కంటే చాలా ముఖ్యమైనది. నివారణ కంటే నిరోధన ఉత్తమమని గుర్తుంచుకోవడం మంచిది.
మూలం: