8-పరిశుభ్రత-చిట్కాలు-లాక్‌డౌన్ తర్వాత మీరు తిరిగి పనికి వచ్చినప్పుడు

లాక్ డౌన్ సడలించిన పిమ్మట మరియు మీరు మీ కార్యాలయానికి తిరిగి వెళ్లేటప్పుడు, సూక్ష్మక్రిములు, మరియు ఇన్ఫెక్షన్ల నుండి రక్షణగా ఉండటానికి ఈ చిట్కాలను గుర్తుంచుకోండి.

వ్యాసం నవీకరించబడింది

8 Hygiene Tips to Keep in Mind When You Return to Work Post-lockdown
ప్రకటన
Nature Protect Floor Cleaner - leaderboard

లాక్ డౌన్ తరువాత, మీరు కార్యాలయం నుండి తిరిగి పనిచేయడం ప్రారంభించినప్పుడు, మీరు మీ సమీపంలో ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా  పని చేస్తారు. సురక్షితమైన పని అనుభవం కోసం ఈ పరిశుభ్రత చిట్కాలు మరియు విషయాలను అనుసరించండి.

మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లుగా   భావిస్తే పనికి వెళ్ళవద్దు. మీ సహోద్యోగులను కూడా అదే విధంగా చేయమని అడగండి.

మీ కార్యక్షేత్రంను(వర్క్‌ స్టేషన్‌)  క్రిమిసంహారకం చేయండి

ప్రతి రోజు ఉద్యోగులు పని సల్థంకు వచ్చే ముందు మీ యజమాని కార్యాలయాన్ని శానిటైజింగ్ మరియు క్రిమిసంహారకం చేయించవచ్చు అయితే, ప్రతి ఉద్యోగి అదనపు భద్రత కోసం వారి కార్యక్షేత్రంను క్రిమిసంహారకం చేసే బాధ్యతను తీసుకోవాలి. సూక్ష్మక్రిములను చంపే డోమెక్స్ మల్టీ-పర్పస్ క్రిమిసంహారకం స్ప్రే వంటి తగిన క్రిమిసంహారకం స్ప్రేని వాడండి. చిన్న మరుగైన ప్రదేశంలో ఎల్లప్పుడూ పరీక్షించండి మరియు మొదట అనుకూలతను తనిఖీ చేసి శుభ్రం చేసుకోండి. ఉత్పత్తిపై సూచనలను చదవడం మర్చిపోవద్దు మరియు మృదువైన మరియు సూక్ష్మ రంధ్రములు గల ఉపరితలాల కోసం ఇది సిఫార్సు చేయబడిందో లేదో తనిఖీ చేయండి.

పెన్సిల్ హోల్డర్లు, కీబోర్డులు, డెస్క్‌లు, కుర్చీలు మరియు టేబుల్స్ వంటి ఉపరితలాలను శుభ్రపరచడానికి, ముందు ప్యాక్ వెనుక భాగాన్ని తనిఖీ చేయండి.

ప్రకటన
Nature Protect Floor Cleaner - mpu

సానిటైజర్‌ను మీ దగ్గర ఉంచుకోండి

మీ టేబుల్‌పై సానిటైజర్ బాటిల్ ఉంచండి మరియు మీ బ్యాగ్‌లో ఒకదాన్ని తీసుకెళ్లండి. మీ సహోద్యోగులు మీ  కార్యక్షేత్రానికి వచ్చిన ప్రతిసారీ దాన్ని ఉపయోగించమని అడగండి. మీరు కూడా, కార్యాలయానికి చేరుకున్న తరువాత, పని మధ్య మరియు కార్యాలయం నుండి బయలుదేరే ముందు తప్పక ఉపయోగించాలి.

మాస్క్ ధరించండి

కార్యాలయానికి వెళ్లే ముందు మాస్క్ ధరించండి మరియు మీ బ్యాగ్‌లో జాగ్రత్తగా ప్యాక్ చేసిన అదనపు మాస్క్ ను ఎల్లప్పుడూ తీసుకెళ్లండి. రక్షిత ముసుగు ధరించకుండా సహోద్యోగులతో మాట్లాడకండి.

సామాజిక దూరాన్ని పాటించండి

మీ ల్యాప్‌టాప్ లేదా వర్క్‌ స్పేస్ చుట్టూ రద్దీగా ఉండే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయండి. చర్చల కోసం పెద్ద గదులను బుక్ చేసుకోవడం మరియు సహోద్యోగులు ఒకరి నుండి మరొకరు  కనీసం 6 అడుగుల దూరంలో కూర్చోవడం మంచిది.

సిడిసి ప్రకారం, మీకు మరియు ఇతరులకు మధ్య కనీసం 6 అడుగుల స్థలాన్ని కొనసాగించగలిగితే  కార్యకలాపాలు సురక్షితం, ఎందుకంటే COVID-19 ఒకరి నుండి మరొకరు 6 అడుగుల లోపు ఉన్న వ్యక్తుల మధ్య సులభంగా వ్యాపిస్తుంది.

సమావేశ గదిలో ఉన్న టేబుల్ మరియు కుర్చీలను ఉపయోగించే ముందు వాటిని క్రిమిసంహారకం చేయడం గుర్తుంచుకోండి. ప్రతి సెషన్ తర్వాత సమావేశం లేదా సమావేశ గది ​​పూర్తిగా క్రిమిసంహారకమైందని నిర్ధారించుకోండి.

చేతి తొడుగులు ధరించండి

చేతి తొడుగులు ధరించడం అలసటను కలిగించవచ్చును , కాని ఆఫీసు విశ్రాంతి గదిని సందర్శించేటప్పుడు లేదా కార్యాలయం మరియు ఇంటి మధ్య ప్రయాణించేటప్పుడు వాటిని ఉపయోగించడం మంచిది. పునర్వినియోగపరచలేని చేతి తొడుగులు దగ్గర ఉంచుకోండి మరియు ఉపయోగించిన తర్వాత వాటిని జాగ్రత్తగా పారవేయండి. బాత్రూమ్ తలపు గొళ్ళాలు మరియు వాష్‌బేసిన్ కుళాయిలు వంటి  అందరు ఉపయోగించే ఉపరితలాలకు మీ చేతులను బహిర్గతం చేయడాన్ని మీరు వీలైనంత వరకు పరిమితం చేయండి.

ఎక్కువగా తాకే  ఉపరితలాలకు దూరంగా ఉండండి

మెట్లు రెయిలింగ్‌, ఎలివేటర్ బటన్లు, కాఫీ యంత్రాలు మరియు వాటర్ డిస్పెన్సర్‌లు కార్యాలయంలో ఇవి అధికంగా తాకే  ఉపరితలాలు. వాటిని తరచుగా తాకకుండా ఉండడం చాలా ముఖ్యం మరియు మీరు వాటిని తాకినట్లయితే సబ్బు మరియు నీటితో మీ చేతులను పూర్తిగా కడగాలి. మీ స్వంత వాటర్ బాటిల్ మరియు లంచ్ బాక్సులను తీసుకెళ్ళి, వీలైతే మీ డెస్క్ వద్ద తినడం మంచిది. మీరు ఆఫీసు క్యాంటీన్‌ను సందర్శిస్తే సామాజిక దూరాన్ని కొనసాగించండి. రద్దీగా ఉండే లిఫ్ట్‌లను వాడకుండా ఉండడం  మరియు వీలైతే మెట్లు తీసుకోవడం మంచిది.

సహోద్యోగులకు అవగాహన కల్పించండి

మీ సహోద్యోగులకు స్టేపులర్లు, పెన్నులు వంటి తరుచుగా వాడే ఆఫీస్ పరికరాలను నిరంతరం క్రిమిసంహారకం మరియు శానిటైజ్ చేయడం చాలా అవసరం అని వివరించండి. వాళ్లతో పరస్పరం సంభాషించడానికి  చక్కటి, స్పష్టమైన మరియు సరళమైన పదాలను ఉపయోగించండి. శుభ్రమైన మరియు సురక్షితమైన కార్యస్థలాన్ని నిర్వహించడానికి మీకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం.

మీ ఫోన్‌ను శుభ్రపరచండి

మీ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను క్రమం తప్పకుండా శుభ్రపరచడం మర్చిపోవద్దు.

మూలం :

https://www.cdc.gov/coronavirus/2019-ncov/daily-life-coping/activities.html

https://www.cdc.gov/coronavirus/2019-ncov/community/cleaning-disinfecting-decision-tool.html

వ్యాసం మొదట ప్రచురించబడింది