మీ కాటన్ జిమ్ ప్యాంటు ఆకృతిని నిలుపుకోవటానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

కాటన్ జిమ్ ప్యాంటు పట్టణ ప్రధానమైనవి. వాటిని జాగ్రత్తగా చూసుకోవటానికి మరియు వాటి ఆకారాన్ని కోల్పోకుండా నిరోధించడానికి ఇక్కడ కొన్ని మార్గాలు సూచించబడ్డాయి.

వ్యాసం నవీకరించబడింది

How to Take Care For Your Cotton Gym Pants to Retain Their Shape
ప్రకటన
Comfort core

కాటన్ జిమ్ ప్యాంటు గాలి ఆడడానికి వీలు కలిగిస్తుంది మరియు తీసుకువెళ్ళడం సులభం. మీరు వీటిని ఉత్తమమైన స్థితిలో ఉంచాలనుకుంటే, మీకోసం ఇక్కడ గో-టు గైడ్ ఉంది. ఈ చిట్కాలను ప్రయత్నించండి!

1) చల్లటి నీటిని వాడండి

ద్రవ డిటర్జెంట్ ఉపయోగించి మీ ప్యాంటును చల్లటి నీటితో సున్నితంగా ఉతుక్కోవాలి. మీరు వాటిని మెషిన్-వాషింగ్ చేస్తుంటే, మీరు సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ లిక్విడ్‌ను ఉపయోగించి ప్రయత్నించవచ్చు, ఎందుకంటే ఇది నీటిలో పూర్తిగా కరిగిపోతుంది మరియు ఎటువంటి అవశేషాలను వదిలి పెట్టదు.

2) పిండ వద్దు

ఉతికిన తర్వాత మీ కాటన్ జిమ్ ప్యాంటును పిండవద్దు. మందపాటి కాటన్ టవల్ లో మడిచి, అదనపు నీటిని పిండడానికి సున్నితంగా నొక్కండి. ఈ ప్రక్రియను రెండుసార్లు కొనసాగించండి.

ప్రకటన

Comfort core

3) వాటిని చదునైన ప్రాంతంలో ఆరబెట్టండి

మీ కాటన్ జిమ్ ప్యాంటును ఉతికిన తర్వాత చదునైన ఉపరితలంపై ఆరనివ్వండి. వాటిని వేలాడదీయడం మానుకోండి, ఎందుకంటే ఇది వస్త్రాన్ని సాగదీసి ఆకారం కోల్పోయేలా చేస్తుంది. బదులుగా, మీ ప్యాంటును వదులుగా మడిచి నిల్వ చేయండి.

4) దానిని సక్రమంగా ఇస్త్రీ చేయండి

మీ జిమ్ ప్యాంటు కుంగిపోయినట్లు కనిపిస్తే, దాన్ని ఇస్త్రీ చేయడం వల్ల మీ సమస్య పరిష్కారం అవుతుంది. అయితే, దానిని వెనక వైపుకు తిప్పి తక్కువ వేడి సెట్టింగ్‌లో మీ ప్యాంటును ఇస్త్రీ చేయండి. రక్షణ పొరను జోడించడానికి ఇస్త్రీ చేసేటప్పుడు మీరు దాని పైన కాటన్ టవల్ కూడా ఉంచవచ్చు.

మీ వ్యాయామ సంచిలో మీ జిమ్ ప్యాంటును పెట్టవద్దు, కారణం చెమట మరియు తేమ బూజు పెరిగేలా చేయవచ్చును. మీ వ్యాయామం సెషన్ తర్వాత వెంటనే వాటిని ఆరబెట్టండి.

ఇలా చేయండి. మీ కాటన్ జిమ్ ప్యాంటును మంచి స్థితిలో ఉంచండి మరియు వ్యాయామాన్ని ఆస్వాదించండి!

వ్యాసం మొదట ప్రచురించబడింది