
భారతదేశం లాంటి ఉష్ణ మరియు తేమ వాతావరణం ఉన్న దేశంలో, కాటన్ దుస్తులు సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి తేలికగా ఉంటాయి మరియు బాగా గాలి తగులుతుంది. అయితే, క్రమంతప్పకుండా ఉపయోగించడం వల్ల, అవి చూడటానికి మాసిపోయినట్లుగా ఉంటాయి. కానీ చింతించకండి, కొద్దిపాటి సరళమైన సంరక్షణ మరియు కొన్ని స్మార్ట్ సూచనలతో, మీరు సుదీర్ఘ కాలం పాటు వాటి రంగు కాంతిని నిలబెట్టవచ్చు.
ఇక్కడ వాటిని చూద్దాం!
1) వేడి నీటికి నో చెప్పండి
వాటిని వేడి నీటిలో ఉతకకండి ఎందుకంటే ఇవి వాటి ఫ్యాబ్రిక్‌ని పాడుచేయవచ్చు మరియు రంగు వెలసిపోవడానికి దారితీయొచ్చు. అత్యధిక కేసుల్లో, వేడి నీరు ఫ్యాబ్రిక్ కుంగిపోవడానికి కూడా దారితీయొచ్చు. చల్లని నీరు సరైన ఎంపిక అనే విషయం గుర్తుంచుకోండి.
2) వాటిని నానబెట్టండి
మీరు వాటిని చేతులతో ఉతుకుతుంటే, బక్కెట్ నీటికి 2 కప్పుల మైల్డ్ డిటర్జెంట్ కలిపి మీ చేతులతో ఈ ద్రావకాన్ని కలియబెట్టండి. దుస్తులను ఈ ద్రావణంలో 5-10 నిమిషాల సేపు నానబెట్టి, మళ్ళీ కలియబెట్టండి. అధిక నీటిని పోగొట్టేందుకు తప్పకుండా వాటిని మెల్లగా పిండేయండి.

3) రంగును బట్టి వేరుచేయండి
మీ కాటన్ దుస్తులను రంగును బట్టి వేరుచేయండి. మీరు ముదురు కాటన్ దుస్తులను లైట్ రంగు దుస్తులతో కలిపి ఉపయోగిస్తే, రంగు వెలసిన దుస్తులు మీకు పెరిగిపోతాయి.
4) వినీగర్‌ని ఉపయోగించండి
రిన్స్ స ైకిల్లో వాషింగ్ మెషీన్‌లో 1 కప్పు వినిగర్ కలపండి. ఇది దుస్తులు రంగు వెలవడాన్ని నిరోధించి మీ కాటన్ దుస్తుల ప్రకాశాన్ని భద్రపరుస్తుంది. ఇది మీ దుస్తులను మెత్తగా మరియు తాజా సువాసనతో కూడా ఉంచుతుంది.
5) వాటిని ఫ్లాట్ డ్రై చేయండి
నీడలో మీ కాటన్ దుస్తులను ఆరబెట్టండి. మీ కాటన్ దుస్తులకు నేరుగా ఎండ తగలనివ్వకండి. నేరుగా ఎండ రంగు వెలసిపోయేలా మరియు ఫ్యాబ్రిక్ కుంగేలా చేస్తుంది.
మీ కాటన్ దుస్తులను ఫ్యాషనిస్టా మాదిరిగా చేసేందుకు ఈ సూచనలు పాటించండి.