మీ కాటన్ దుస్తులను ఉతకాలనుకున్నప్పుడు మీకు సరైన మార్గం తెలుసా? ఇక్కడ మీ హ్యాండి గైడ్ ఉంది

కొంతమంది గోరువెచ్చని నీటిలో కాటన్ బట్టలను చేతితో ఉతకాలనుకుంటారు, అది మంచి ఆలోచననేనా? క్రింద మేము మీకు వివారిస్తాం.

వ్యాసం నవీకరించబడింది

Do You Know the Right Way to Wash Your Cotton Clothes? Here’s Your Handy Guide
ప్రకటన
Comfort core

మీ కాటన్ బట్టలు ఉతకాలనుకున్నప్పుడు మీరు పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఇవి మీ కాటన్ దుస్తులను తాజాగా ఉంచడానికి మీకు సహాయపడతాయి. మీ కాటన్లను సరైన మార్గంలో ఎలా ఉతకాలి అని మేము మీకు చెప్తాము.

ముడుచుకుపోవడాన్ని నివారించడానికి

ఒక ఆర బకెట్(½) చల్లటి నీటిలో కొంత కల్లు ఉప్పును కలపండి. ఈ ద్రావణంలో మీ కాటన్  వస్త్రాలను ఉతకడానికి ముందు 20-30 నిమిషాలు నానబెట్టండి. ఇది ముడుచుకుపోవడాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

రంగు కారిపోకుండా నివారించడానికి

కాటన్ సున్నితమైన బట్ట. సున్నితమైన చక్రంలో మీ కాటన్  చీరను మెషిన్ ఉతకడంలో ఎటువంటి హాని లేనప్పటికీ, చల్లటి నీటిని ఉపయోగించి చేతితో ఉతుక్కోవడం మంచిది. ఇది రంగును నిలబెట్టడంలో సహాయపడుతుంది మరియు ఉతికే సమయంలో రంగు పోకుండా సహాయపడుతుంది. అలాగే, తేలికపాటి రంగు మరియు ముదురు రంగుల కాటన్లను విడిగా ఉతకాలి.

ప్రకటన

Comfort core

ఫైబర్స్ వదులవడాన్ని  నివారించడానికి

మీ కాటన్లను ఇతర బట్టల నుండి వేరు చేయాలని మేము సూచిస్తున్నాము. మీ కాటన్లను వేర్వేరు ముడి పదార్థాలతో తయారు చేసిన వస్త్రాలతో ఉతకవద్దు. ఇది మీ కాటన్ల ఫైబర్స్ వదులుగా మరియు తెరవకుండా నిరోధిస్తుంది. దీన్ని అనుసరించడం వలన మీ కాటన్ వస్త్రాలు పలుమార్లు ఉతికిన కూడా అందంగా కనిపిస్తాయి.

తేలికపాటి డిటర్జెంట్ వాడండి

కాటన్ కి మృదువైన నిర్వహణ మరియు సంరక్షణ అవసరం. తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించమని మేము సూచిస్తున్నాము. మీరు మీ కాటన్ బట్టలు చేతితో ఉతుకుతునట్లయితే, సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాము. మీరు కూడా మీ కాటన్లను ఉతికేటప్పుడు ఒక బకెట్ మాములు నీటిలో ½ కప్పు తెలుపు వెనిగర్, 2 చెంచాల బేకింగ్ సోడా మరియు 1 చెంచా నిమ్మరసం కలిపిన నీటిలో పిండి ఆరబెట్టవచ్చు. 

ఇలా చేస్తే చాలు! ఉతికిన తరువాత, మీ కాటన్ చీరను పాక్షికంగా నీడ ఉన్న ప్రదేశంలో ఆరబెట్టండి. నేరుగా ఎండలో ఆరబెట్టవద్దు, ఎందుకంటే ఇది ఫాబ్రిక్ కుంచించుకుపోయేలా చేస్తుంది మరియు మసకబారుస్తుంది. మీరు మీ కాటన్లను లైన్-డ్రై చేయవచ్చు.

కాటన్ బట్టలు స్టైలిష్ గా ఉంటాయి మరియు ధరించడం సులువు. మీ కాటన్ల జీవితకాలం పెంచడానికి ఈ ప్రభావవంతమైన చిట్కాలను ప్రయత్నించండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది