బ్లాక్ ప్రింటెడ్ కాటన్ షర్టుల రంగు కారకుండా ఎలా నిరోధించాలి

కాటన్ చొక్కాలు పట్టించుకోకపోతే మరియు సరైన మార్గంలో ఉతకపోతే త్వరగా వెలిసిపోతాయి. దాన్ని నివారించడానికి మీరు ఏమి చేయవచ్చు.

వ్యాసం నవీకరించబడింది

How to Prevent the Colour of Your Block Printed Cotton Shirts from Bleeding
ప్రకటన
Comfort core

కాటన్  వస్త్రాలు ఎక్కువ శాతం వార్డ్ రోబ్ స్పేస్ ను  మంచి ఉద్దేశ్యంతో ఆక్రమిస్తాయి. కాటన్  మృదువైనది, తేలికైనది మరియు గాలి ఆడడానికి వీలుగా ఉంటుంది, అందుకే వీటిని చాలా మంది భారతీయ డిజైనర్లు వాడుతుంటారు. మీరు మీ కాటన్  చొక్కాల పట్ల సరైన శ్రద్ధ తీసుకుంటే, అవి చాలా సంవత్సరాలు ఉంటాయి. అయితే, మీ కాటన్ షర్టులు వెలిసిపోయే అవకాశాలు ఉన్నాయి. చింతించకండి, మీరు ఈ సాధారణ లాండ్రీ చిట్కాలు మరియు ఉపాయాలను ఉపయోగించడం ద్వారా వాటి మన్నిక కాలాన్ని పెంచుకోవచ్చు మరియు రంగు పోకుండా లేదా రంగు వెలిసిపోకుండా కాపాడుకోవచ్చు.

ప్రారంభిద్దాం.

1) ఉప్పు నీటిలో నానబెట్టండి

మీ బ్లాక్ ప్రింటెడ్ కాటన్ షర్ట్ ఉతకాలనుకున్నప్పుడు, ముందు దానిని నానబెట్టడం మంచిది. ఒక ½ బకెట్ చల్లటి నీటిలో, 2 చిన్న చెంచాల కల్లు ఉప్పును జోడించి మీ చొక్కాను అందులో వదలండి. ఉతకడానికి ముందు ఒక గంట నానబెట్టండి. ఇది మీ చొక్కా రంగును ఉండిపోయేలా చేస్తుంది మరియు రంగు కారకుండా కాపాడుతుంది.

2) సున్నితంగా ఉతకాలి

ప్రకటన

Comfort core

సున్నితమైన వాషింగ్ పద్ధతులను ఎంచుకోవాలని మేము సూచిస్తున్నాము. మీరు మీ కాటన్  చొక్కాను చేతితో ఉతకవచ్చు లేదా జెంటిల్ సైకిల్ లో మెషిన్-వాష్ చేయవచ్చు.

3) చల్లటి నీళ్ళను  వాడండి

మీ కాటన్  చొక్కాలను ఎల్లప్పుడూ చల్లటి నీటితో ఉతకాలని మేము సూచిస్తున్నాము. ఇది మీ కాటన్ బట్టల ఆకారం మరియు ఆకృతిని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. వేడి నీటిని ఉపయోగించడం వల్ల వస్త్రం దెబ్బతింటుంది మరియు ఆకారం కోల్పోతుంది.

4) మైల్డ్ డిటర్జెంట్ వాడండి

కాటన్ సున్నితమైన వస్త్రం మరియు తేలికపాటి డిటర్జెంట్ తో ఉతకాలి. ఒక బకెట్ నీటిలో 1 చిన్న చెంచా తేలికపాటి డిటర్జెంట్ ను జోడించాలి. ఇప్పుడు, నీటిలో డిటర్జెంట్‌ను సరిగ్గా కలపడానికి మీ చేతులను మెల్లగా తిప్పండి. డిటర్జెంట్ ద్రావణంలో మీ కాటన్ షర్టులను 5-10 నిమిషాలు నానబెట్టండి. మెల్లగా పిండండి. తరువాత మీరు సాధారణ పద్ధతిలో మీ బట్టలును శుభ్రం చేసుకోండి మరియు పిండండి. మీరు మంచి తేలికపాటి డిటర్జెంట్ కోసం చూస్తున్నట్లయితే, మీరు సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ఉపయోగించి ప్రయత్నించవచ్చు.

5) బ్రషింగ్‌కు నో చెప్పండి

వాష్ సమయంలో మీ కాటన్ షర్టులను బ్రష్ చేయడం మానుకోండి, ఇది వస్త్రాన్ని పాడు చేస్తుంది. బదులుగా, మరకలు ఏమైన ఉంటే వాటిపై మీ వేళ్లను ఉపయోగించి రుద్దండి.

6) నీడలో ఆరేయాలి

నీడ ఉన్న ప్రదేశంలో మీ కాటన్ బట్టలను పరచి ఆరేయండి. మీ కాటన్ బట్టలు సూర్యరశ్మికి ప్రత్యక్షంగా బహిర్గతం చేయవద్దు, ఎందుకంటే ఇది రంగులు మసకబారి మరియు వస్త్రం కుంచించుకుపోయే అవకాశం ఉంది.

ఈ చిట్కాలు మీ కాటన్ బట్టలు క్షీణించకుండా ఉంచుతాయి.

వ్యాసం మొదట ప్రచురించబడింది