మీ సున్నితమైన లోదుస్తులు మంచి పరిమళంతో ఉండేందుకు సులువైన విధానాలు

మీ లోదుస్తులకు ఆహ్లాదకరమైన సువాసనని జోడించే మార్గాల కోసం మీరు చూస్తుంటే, మీకోసం కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఈ శుభ్రపరిచే చిట్కాలతో మీ సున్నితమైన దుస్తులు పరిమళించేలా చేసుకోండి.

వ్యాసం నవీకరించబడింది

Easy Steps to Keep Your Delicate Lingerie Smelling Great
ప్రకటన
Comfort core

తాజా పరిమళంతో రోజంతా ఉండేందుకు ఇది సరైన విధానం.మీరు మంచి సువాసనతో ఉండేందుకు సరళమైన, ప్రబావవంతమైన చిట్కాలకోసం చూస్తుంటే, ఇది సరైన చోటు.  ఈ ఆర్టికల్‌లో, మేము మీ లోదుస్తులు తాజాగా పరిమళించేందుకు కొన్ని అద్భుతమైన చిట్కాలని మీతో పంచుకుంటాం.

1) ఫాబ్రిక్ సాఫ్టనర్

మీరు వాషింగ్ మెషీన్లో మీ లోదుస్తులని వేస్తుంటే, రిన్స్ సైకిల్ లో ఉండగా 1 చెంచా ఫాబ్రిక్ సాఫ్టనర్‌ని వేయండి.  మీరు మీ లోదుస్తులని చేత్తో ఉతుక్కుంటుంటే, 1/2 చెంచా ఫాబ్రిక్ సాఫ్టనర్‌ని బకెట్ నీటిలో వేసి జాడించాలి.  15-20 నిమిషాల పాటు నాననివ్వండి.  తర్వాత తీసి ఆరబెట్టండి.

2) వెనిగర్

వెనిగర్ మీ లోదుస్తులు తాజాగా పరిమళించేందుకు సులువైన విధానం.  1/2 బకెట్టు గోరు వెచ్చని నీటిలో 1 చెంచా వైట్ వెనిగర్‌ని వేయాలి, మీ లోదుస్తులని ఈ బకెట్‌లో30 నిమిషాల పాటు నాననివ్వాలి.  తర్వాత మామూలుగా జాడించాలి.  వెనిగర్ బ్యాక్టీరియా వల్ల కలిగే దుర్వాసనని పోగొట్టి తాజా పరిమళాన్నిస్తుంది.

ప్రకటన

Comfort core

3) ఎస్సెన్షియల్ ఆయిల్స్

1/2 కప్పు నీటిలో మీకిష్టమైన ఎస్సెన్షియల్ ఆయిల్ 5-6 చుక్కలని వేయాలి.  2-3 దూది ఉండలని తీసుకుని ఈ మిశ్రమంలో ముంచాలి. దూది ఉండలు ఈ మిశ్రమంలో నానగానే, వాటిని మెష్ బ్యాగ్‌లో వేయాలి.  మీ లోదుస్తులని ఉండే డ్రాయర్ లేదా కంపార్ట్‌మెంట్‌లో వేలాడదీయాలి.  పూల వాసన కోసం 3 చుక్కల రోజ్ ఎస్సెన్షియల్ ఆయిల్‌ని మరియు 2 చుక్కల జెరనియం ఆయిల్‌ని వేయాలి.  ఉత్సాహపరిచే పరిమళాల కోసం, 3 చుక్కల స్పైసీ బ్లాక్ పెప్పర్ ఎస్సెన్షియల్ ఆయిల్‌ని, 1 చుక్క లెమన్ ఎస్సెన్షియల్ ఆయిల్ మరియు  చుక్కల య్లాంగ్ - య్లాంగ్ ఎస్సెన్షియల్ ఆయిల్‌ని వేయాలి.

4) లావెండర్ వాటర్

లావెండర్ వాటర్ అనేది మీ లోదుస్తులు మంచి పరిమళంతో ఉండేందుకు మరొక విధానం.  ఇది మార్కెట్‌లో సులువుగా దొరుకుతుంది.  మీ లోదుస్తులని వాషింగ్ మెషెన్‌లో ఉతుకుతుంటే 1 చెంచా లావెండర్ నీటిని రిన్స్ సైకిల్‌కు ముందు వేయాలి.

మీ లోదుస్తులని మీరు చేత్తో ఉతుక్కుంటే, 1 చెంచా లావెండర్ వాటర్‌ని బకెట్ నీటిలో వేయాలి. దానిలో మీ దుస్తులని వేసి15 నిమిషాల వరకు నాననివ్వాలి, తర్వాత వాటిని ఆరబెట్టాలి.  ఎక్కువ సేపు పరిమళం నిలిచి ఉండాలంటే, 1 చెంచా వెనిల ఎస్సెన్స్‌ని లావెండర్ నీటిలో వేయాలి.

మీ లోదుస్తులు ఆహ్లాదకరమైన పరిమళంతో ఉంటే మీరు ఉత్సాహంగా, విశ్రాంతిగా ఉంటారు.  మీ లోదుస్తులు ఎప్పటికప్పుడు గొప్పగా పరిమళించడానికి ఈ చిట్కాలని ఉపయోగించండి

వ్యాసం మొదట ప్రచురించబడింది