మీ కొత్త పెద్ద ఈవెంట్‌కి సకాలంలో మీ స్యూట్‌ని తాజా సువాసనతో ఎలా ఉంచాలి!

ప్రతి ఒక్కరూ పెళపెళలాడుతూ ఉండే స్యూట్‌ని కోరుకుంటారు, అది తాజా సువాసనతో ఉండాలని కూడా మీరు కోరుకుంటారు. మీ బట్టలు మంచి సువాసనతో ఉండే అత్యుత్తమ మార్గాలను మేము మీకు చెబుతాము!

వ్యాసం నవీకరించబడింది

How to Keep Your Suit Smelling Fresh in Time for your Next Big Event!
ప్రకటన
Comfort core

మీరు వివాహానికి లేదా సమావేశానికి మీ స్యూట్‌ని ధరిస్తుంటే, అది బాగా ఉండటమే కాకుండా ఆహ్లాదకరమైన సువాసన వచ్చేలా కూడా ఉండాలనుకుంటారు. మీరు ధరించిన తరువాత ఎల్లప్పుడూ మీ స్యూట్‌ని పొడిగా ఉంచాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ ఎయిరింగ్‌ చెమట దుర్వాసనలను పోగొడుతుంది. మీ స్యూట్‌కి గాలి తగిలితే, మీ స్యూట్‌ సువాసన వచ్చేలా చేసేందుకు మీరు ఈ సరళ చిట్కాలను ప్రయత్నించవచ్చు.

మీ పాట్‌పౌర్రీ శాషేని లేదా పొమాండర్‌ని మీ స్యూట్‌ నుంచి 5-6 అంగుళాల దూరంలో వేలాడదీయండి, దీనివల్ల మీరు దీనిని తాకకుండా ఉంటారు.

పాట్‌పౌర్రి సాషేలు

నిల్వ చేసినప్పుడు మీ స్యూట్‌ మంచి సువాసన వచ్చేలా చేసేందుకు గల అత్యుత్తమ మార్గాల్లో పాట్‌పౌర్రి ఒకటి. మీ సొంత పాట్‌పౌర్రీ శాషేలను తయారుచేసేందుకు, కొద్ది లవంగాలు, దాల్చిన చెక్కలు, ఎండిన పూరేకులు, ఫెన్నెల్‌ విత్తనాలు మరియు ఎండిపోయిన సాజీ ఆకులు కలపండి; మీరు వనిల్లా బీన్స్‌ని కూడా కలపవచ్చు ఎందుకంటే సువాసన చేర్చేందుకు ఇవి గొప్ప పౌడర్‌ రహిత- ప్రత్యామ్నాయాలు. ఘటికాంశాలను  బౌల్‌లో కలిపి బాగా మిశ్రమం చేయండి. ఈ మిశ్రమాన్ని మెష్‌ బ్యాగ్‌కి, లేదా హ్యాంగ్‌కి కలపండి లేదా మీ స్యూట్‌ని తాజాగా ఉంచేందుకు పాట్‌పౌర్రి శాషేని మీ వాడ్రోబ్‌లో పెట్టండి. ఇది అనేక నెలలు ఉంటుంది.

పొమాండర్‌

ప్రకటన

Comfort core

పొమాండర్‌లు సువాసనగల, సహజమైన ఫ్రెష్‌నర్స్‌. స్టోర్‌ చేసినప్పుడు మీ స్యూట్‌ని మంచి సువాసనతో ఉంచేందుకు కూడా వీటిని ఉపయోగించవచ్చు. పొమాండర్‌ని తయారుచేయాలంటే, మీకు ఆరంజ్‌ మరియు కొన్ని లవంగాలు అవసరం. పండు అంతటా టూత్‌పిక్‌తో రంధ్రాలు చేయండి. ప్రతి రంధ్రంలో పూర్తి లవంగాన్ని పెట్టండి. పండును పేపర్‌ టవల్‌లో చుట్టండి మరియు ఆరిపోవడానికి దానిని 3-4 వారాల పాటు చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. ఒకసారి ఆరిపోతే, మీరు దానిని మస్లిన్‌ లేదా లినెన్‌ వస్త్రంలో చుట్టవచ్చు మరియు మీ స్యూట్‌తో దీనిని మీ క్లోసెట్‌లో వేలాడదీయవచ్చు.

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌

½ కప్పు నీళ్ళు మరియు మీకు ఇష్టమైన 5-6 చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ గల మిశ్రమం తయారు చేయండి. కొన్ని దూది ఉండలను  తీసుకొని ఈ మిశ్రమంలో నానబెట్టండి. మిశ్రమంలో దూది ఉండలు  నానిపోయాక, వాటిని మెష్‌ బ్యాగ్‌లో పెట్టండి. ఈ బ్యాగ్‌ని మీ స్యూట్‌ గల మీ క్లోసెట్‌లో వేలాడదీయండి మరియు ఈ సారి మీరు బయటకు తీసినప్పుడు మీ దుస్తులు తాజా సువాసన వస్తుంది.

మీ స్యూట్‌ని దూరంగా స్టోర్‌ చేసినప్పుడు అది సువాసనతో ఉండేలా చేసేందుకు ఈ అబ్బురపరిచే మార్గాలను ప్రయత్నించండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది