మీ చిన్నారుల సున్నితమైన చర్మాన్ని సంరక్షించడం కొరకు వారి దుస్తులను మృదువుగా ఎలా ఉంచాలి

చిన్నారుల చర్మం సాధారణంగా చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే తేలికగా దద్దుర్లు, తామర, ఇతర అలర్జీలకు గురయ్యే ప్రమాదం ఉంది. మొద్దుబారినట్టుగా ఉన్న దుస్తులను ధరించడం వల్ల, ఈ చర్మ సమస్యలు మరింత తీవ్రతరం కావొచ్చు. అందుకే, మీ చిన్నారుల దుస్తులను మృదువుగా ఉంచుతూ, తద్వారా వారి చర్మాన్ని ఎల్లప్పుడూ సంరక్షించుకోవడానికి ఏమి చేయాలో తెలుసుకోవడం కొరకు, ఈ క్రింద వివరిస్తున్న సూచనలను చదవండి.

వ్యాసం నవీకరించబడింది

చిన్నారుల సున్నతమైన చర్మం కోసం దుస్తుల సంరక్షణ
ప్రకటన
Comfort pure

తల్లిదండ్రులుగా, మన చిన్నారుల సున్నితమైన చర్మం అకస్మాత్తుగా దద్దుర్లు లేదా అలర్జీల బారిన పడినప్పుడు, మన ఆందోళనకు హద్దులు ఉండవు. వారు ఎల్లప్పుడూ శుభ్రమయిన, ఉతికిన దుస్తులను ధరిస్తున్నప్పటికీ, చాలా సార్లు వారు సురక్షితంగా ఉండటానికి, అది మాత్రమే సరిపోదు అని మేము గ్రహించాము. కేవలం డిటర్జెంట్ తో మాత్రమే దుస్తులను శుభ్రపరచడం వల్ల, అవి కొద్ది కాలానికి గరుకుగా, నిర్జీవంగా తయారవుతాయి. అటువంటి దుస్తులను చిన్నారులు ధరించినప్పుడు, అవి వారి యొక్క సున్నితమైన చర్మానికి గీరుకుంటూ, గుచ్చుకుంటూ, అనవసరమైన చర్మ సమస్యలను కలిగిస్తాయి. శుభ్రపరచడంతో పాటు, మన చిన్నారుల దుస్తులకు ఇన్ఫెక్షన్లు సోకకుండా,  క్రిములు, బ్యాక్టీరియా బారిన పడకుండా చూసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ఇటువంటి అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకొని, మేము చిన్నారుల దుస్తులను శుభ్రపరచే ముందు, వాటిని వెనిగర్లో నానబెట్టడం వంటి ఇంటి చిట్కాలను ఎన్నో ప్రయత్నించాము. కానీ, దురదృష్టవశాత్తు, ఈ చిట్కాల వల్ల దుస్తుల నుంచి దుర్వాసన రావడం తప్ప, అవి బ్యాక్టీరియా, క్రిములనూ ఎంత మాత్రమూ నిర్మూలించలేకపోయాయి. అయితే ఎట్టకేలకు, ఎన్నో రకాల ప్రయోగాలు చేసిన తరువాత, మీ చిన్నారుల దుస్తులు మృదువుగా, సురక్షితంగా ఉంచడం కొరకు మీరు పాటించగల కొన్ని చిట్కాల జాబితాతో, ఇలా మీ ముందుకు వచ్చేశాము. రండి, అవేమిటో చూద్దాము.

నీకు అవసరం అవుతుంది:

 • లాండ్రీ డిటర్జెంట్
 • కంఫర్ట్ ప్యూర్ ఫ్యాబ్రిక్ కండిషనర్
ప్రకటన
Comfort pure

చిన్నారుల దుస్తులను చేతులతో ఎలా శుభ్రపరచవచ్చు

 1. మీ చేతులను ఇన్ఫెక్షన్లు సోకకుండా శుభ్రపరచుకోండి శానిటైజ్ చేసుకోండి

  మురికి చేతులు బ్యాక్టీరియాను ఇట్టే ఆకర్షిస్తాయి. అందుకే చిన్నారుల దుస్తులను శుభ్రపరచే ముందు, మనం చేతులను శానిటైజ్ చేసుకోవడం, సబ్బు, నీటితో శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం.

 2. గార్మెంట్ లేబుల్ సూచనలను శ్రద్ధగా చదవండి

  చిన్నారుల దుస్తుల లేబుల్స్ పైన ఉన్న సూచనలను చదవడం ద్వారా, ఆ ఫ్యాబ్రిక్ వాష్ కు ప్రతిస్పందించే విధానాన్ని తెలుసుకోవచ్చు అని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము.

 3. నీటి ఉష్ణోగ్రతను సరిగ్గా కొలవండి

  అత్యంత వేడి నీటిలో బట్టలు ఉతకడం వల్ల, అది మీ చిన్నారుల దుస్తుల రూపురేఖలను మార్చేయడంతో పాటు, వాటి పై చీలికలు, చిరుగులు ఏర్పరిచే ప్రమాదం ఉంది. అంతే కాకుండా, ఇది మీ చేతులకు కూడా కాలినట్లు చేయవచ్చును.  అందువల్లనే, మీ చిన్నారుల దుస్తులను శుభ్రం చేసే ముందు, నీటి ఉష్ణోగ్రతను తనిఖీ చేయమని మేము సూచిస్తున్నాము. అది దాదాపూ 30సి నుంచి 40సి డిగ్రీల మధ్యలో ఉండటం శ్రేయస్కరం.

 4. శుభ్రపరచడానికి ముందు మరియు శుభ్రపరచిన తరువాత కూడా దుస్తులను ఒకసారి నానబెట్టండి

  దుస్తులను శుభ్రపరిచే ముందు వాటిలో బ్యాక్టీరియా ఉంటుంది కనుక, శుభ్రపరచడానికి 30 నిముషాల ముందు మీ చిన్నారుల దుస్తులను వేడి నీటిలో నానబెట్టాలని మరియు వాష్ చేసిన తరువాత కూడా మళ్ళీ గోరువెచ్చని నీటిలో నానబెట్టాలని మేము సూచిస్తున్నాము. అలా చేయడం వల్ల, చిన్నారుల దుస్తుల పైన ఉన్న బ్యాక్టీరియాను సమూలంగా తొలగించవచ్చు.

 5. బేబీ ఫ్రెండ్లీ లాండ్రీ డిటర్జెంట్ ను వినియోగించండి

  సాధారణ డిటర్జెంట్లను వినియోగించడం వల్ల, అవి మీ చిన్నారుల చర్మానికి హాని కలిగించడంతో పాటు, అలెర్జీలు, దద్దుర్లు ఏర్పడడానికి కారణం అవుతాయి అని, మా అనుభవంలో మేము తెలుసుకున్నాము. అందువల్లనే, చిన్నారుల దుస్తులను శుభ్రపరచేటప్పుడు, పర్యావరణ స్నేహపూర్వకమైన మరియు హానికరమైన రసాయనాలు లేని డిటర్జెంట్ ను వినియోగించడం ఎంతో అవసరం.

 6. సుతిమెత్తని ఫ్యాబ్రిక్ కండిషనర్ ను ఉపయోగించండి

  కేవలం సాధారణ డిటర్జెంట్ ను మాత్రమే ఉపయోగించడం వల్ల, రెండు మూడు ఉతుకుల  తరువాత దుస్తులు తమ మృదుత్వాన్ని కోల్పోతున్నాయి అన్న విషయాన్ని మేము గమనించాము. బేబీ ఫ్రెండ్లీ డిటర్జెంట్ కూడా అన్నివేళలా అనుకున్నట్లు పని చేయకపోవచ్చు. అందుకే మేము కంఫర్ట్ ప్యూర్ వంటి ఫ్యాబ్రిక్ కండిషనర్ ను ఎంచుకున్నాము. డిటర్జెంట్ తో శుభ్రపరచిన తరువాత, ఒక బకెట్ శుభ్రమైన నీటిలో మేము ఒక అర కప్పు కంఫర్ట్ ప్యూర్ ను కలిపాము.  ఆ తరువాత, మేము దుస్తులను ఓ అయిదు నిముషాల పాటు కంఫర్ట్ ప్యూర్లో నానబెట్టాము. అప్పుడే మేము ఒక విషయాన్ని గమనించాము. ఇది వరకు ఎప్పుడూ కేవలం డిటర్జెంట్ మాత్రమే వినియోగిస్తే రాని పరిమళం, మృదుత్వం ఇప్పుడు దుస్తుల నుంచి రావడం గమనించాము. 

  అలాగే మేము లేబుల్ ను గమనించి, ఈ ఫ్యాబ్రిక్ కండిషనర్ పై ప్రామాణిక యాంటీ మైక్రోబియల్ పరీక్షలు నిర్వహించి, దీనిని వినియోగించిన తరువాత దుస్తులు బ్యాక్టీరియా మరియు క్రిములు లేకుండా సురక్షితంగా  ఉంటాయని ధృవీకరించారు అని కూడా తెలుసుకున్నాము. తల్లిదండ్రులుగా మనము ఎల్లప్పుడూ, మన చిన్నారులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలి అని కోరుకుంటాము కనుక, ఇందులోని ఈ ప్రత్యేక లక్షణం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. అంతే కాకుండా, కంఫర్ట్ ప్యూర్లో ఎటువంటి హానికరమైన రంగులు లేవని, ఎలాంటి అదనపు లేదా కృత్రిమ కలరెంట్లు కలిగిలేదని కూడా మనకు దాని ప్యాకేజింగ్ చెబుతుంది.

 7. చిన్నారుల దుస్తులను సరిగ్గా ఆరబెట్టండి

  మీ చిన్నారుల దుస్తులను సూర్యకాంతిలో చక్కగా ఆరబెట్టడం ఎంతో అవసరం. ఎందుకంటే, చిన్నారుల దుస్తులు తడి ముద్దలుగా ఉంటే కనుక, వాటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని మేము గమనించాము. అందుకే, మంచి ఫ్యాబ్రిక్ కండిషనర్ వినియోగంతో పాటు, సూర్యరశ్మి కూడా తోడయితే, అప్పుడు అది మీ చిన్నారుల దుస్తులను అంటిపెట్టుకుని ఉన్న  అన్ని రకాల బ్యక్టీరియాలు మరియు క్రిములను సమూలంగా నాశనం చేస్తుంది అనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.

చిన్నారుల దుస్తులను మెషిన్లో ఎలా ఉతకవచ్చును

 1. మీ దుస్తులను శుభ్రపరచే కన్నా ముందు మీ చిన్నారుల దుస్తులను శుభ్రపరచండి

  వాషింగ్ మెషిన్లు కూడా కొన్నిసార్లు బ్యాక్టీరియాకు నిలవు కావొచ్చు. అందుకే, మీ దుస్తులకు ఉన్న బ్యాక్టీరియా మీ చిన్నారుల దుస్తులకు అంటకుండా ఉండటానికి, ముందుగా చిన్నారుల దుస్తులనే శుభ్రపరచడం శ్రేయస్కరం అని మేము గమనించాము.

 2. బేబీ ఫ్రెండ్లీ డిటర్జెంట్ ను వినియోగించండి

  సూచనలను పాటించండి మరియు దుస్తుల లోడ్ ఆధారంగా సరైన పరిమాణంలో బేబీ డిటర్జెంట్ ను ఉపయోగించండి. ఎప్పుడూ కూడా డిటర్జెంట్ ను ఎక్కువ మోతాదులో ఉపయోగించకండి. ఎందుకంటే, అది మీ చిన్నారుల దుస్తుల పైన ప్రమాదకరమైన అవశేషాలను వదిలి వేస్తుంది. దాని వల్ల వారికి చర్మ సమస్యలు, అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది.

 3. మీ మెషిన్లో ఫ్యాబ్రిక్ కండిషనర్ ఎలా వినియోగించాలో తెలుసుకోండి

  ఒకవేళ మీరు సెమీ ఆటోమేటిక్ మెషిన్ ను వినియోగిస్తున్నట్లు అయితే, అప్పుడు వాష్ యొక్క చివరి రౌండ్లో కేవలం ఒక కప్ కంఫర్ట్ ప్యూర్ తీసుకొని, మీ వాష్ టబ్లో వేయండి. అదే రెండు మూడు అరలు ఉండే టాప్ లోడ్ మెషిన్ అయితే కనుక, వాష్ సైకిల్ మొదలు పెట్టే ముందే, దానికి సంబంధించిన కంపార్ట్మెంట్లో ఒక కప్ కంఫర్ట్ ప్యూర్ వేయండి. ఒకవేళ అదనపు కంపార్ట్మెంట్లు లేకపోతే కనుక, చివరి రిన్స్ సైకిల్ ముందు, వాష్ టబ్లో ఒక కప్ కంఫర్ట్ ప్యూర్ వేయండి. అదే ఫ్రంట్ లోడ్ మెషిన్ అయితే, ఒక కప్ కంఫర్ట్ ప్యూర్ ను సాఫ్ట్నర్/డిస్పెన్సర్/ఎడిటివ్/కండిషనర్ కంపార్ట్మెంట్లో, వాష్ సైకిల్ మొదలుపెట్టే ముందే కలపండి. 

  మెషిన్లో అనేక సార్లు శుభ్రపరచిన దుస్తుల పైన కూడా, ఒక్కసారి ఈ ప్రొడక్ట్ ఉపయోగిస్తే చాలు, దుస్తులు ఎంతో మృదువుగా మారిపోసాగాయి. దానితో పాటు, మేము చిన్నారుల యొక్క అన్ని రకాల దుస్తుల పైనా కూడా ఈ కంఫర్ట్ ప్యూర్ ను చక్కగా ఉపయోగించగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము.

 4. మిగిలిపోయిన బ్యాక్టీరియాను సమూలంగా తొలగించడానికి దుస్తులను ఎండలో ఆరబెట్టండి

  ఒకసారి దుస్తులను శుభ్రపరచిన తరువాత, దుస్తులపై మిగిలి ఉన్న బ్యాక్టీరియాను, క్రిములను సమూలంగా తొలగించే సూర్యరశ్మిలో వాటిని ఆరబెట్టడం ఎంతో అవసరం. సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాలు, దుస్తులను ఇన్ఫెక్షన్ బారిన పడకుండా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా ఈ చిట్కా, చిన్నారులకు ఉపయోగించే తెల్లని షీట్లు, టవల్స్, క్లాత్ డైపర్ల విషయంలో చక్కగా పని చేస్తుంది అని మేము గమనించాము. ముదురు రంగు దుస్తులను ఎక్కువసేపు ఎండలో ఆరబెడితే, వాటి రంగు వెలిసిపోయే అవకాశం ఉంది కనుక, వాటిని నీడలో ఆరబెట్టడమే మంచిది.

  ఒకవేళ చాలా ఎక్కువ బట్టలు ఉన్నట్టయితే, తొందరంగా ఆరాలి అని అనుకుంటే, అప్పుడు వాషింగ్ మెషిన్లో, వాటిని ఒక టవల్ లో చుట్టి 15 నుంచి 20 నిముషాల పాటు ఉంచండి. ఆ పొడి టవల్, ఇతర దుస్తుల నుంచి తేమను పీల్చడానికి ఎంతో సహాయపడుతుంది.

రహస్య చిట్కా: కావాలి అంటే, మీరు భారతదేశంలోని నాణ్యమైన బ్రాండ్లను ఇక్కడ ఉచితంగా ప్రయత్నించవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది