మీ లెదర్ జాకెట్లను ఎక్కువ కాలం కొత్తగా కనిపించేందుకు అవసరమైన చిట్కాలు.

మీ బట్టలని ఎలా జాగ్రత్తగా ఉంచుకోవాలో సరిగ్గా తెలుసుకోవడం ఎంతోఉపయోగకరమైన నిపుణత. మీ ఖరీదైన లెదర్ జాకెట్‌ని భద్రపరచుకోడానికి మీరు కొన్ని సులువైన, ప్రభావవంతమైన చిట్కాలని కనుగొంటారు.

వ్యాసం నవీకరించబడింది

Essential Tips to Keep Your Leather Jackets Looking New for Longer
ప్రకటన
Comfort core

లెదర్ జాకెట్స్ ఖరీదైనవి, కానీ మీ వార్డ్రోబ్‌కు అదనంగా ఉంటాయి. సరిగ్గా జత చేస్తే, లెదర్ జాకెట్స్ తక్షణ ఫ్యాషన్‌కు హిట్‌గా మారతాయి.  మీ లెదర్‌ జాకెట్‌ ఆయుస్సును పెంచడానికి ఈకింది చిట్కాలని చదవండి మరియు అనుసరించండి

1) విశాలమైన హ్యాంగర్స్‌ ని వాడండి

లెదర్‌కు గాలి ఆడాలి.  జాకెట్‌ని మడతపెడితే ముడతలు పడతాయి, వీటిని  సులువుగా తీయలేము.  కనుక, ఎప్పుడూ మీ లెదర్ జాకెట్లకు  వాడ్రోబ్ లో విశాలమైన, చెక్క హ్యాంగర్లని వాడండి.  భుజాలకు సరైన సపోర్ట్ ఉన్నదీ లేనిదీ గమనించండి, అవి జారిపోకూడదు.

2) న్యూస్ పేపర్ ఉండలని ఉపయోగించండి

మీ లెదర్ జాకెట్ లోపల న్యూస్ పేపర్‌ని ఉండలుగాచేసి ఉంచండి.  ఇది ఎక్కువగా ఉన్న తేమని పీల్చుకుంటుంది మరియు ఫంగస్‌ని మరియు బూజుని పెరకుండా నిరోధిస్తుంది.  మీరు న్యూస్ పేపర్ కాగితాలని జాకెట్‌ పైన పెట్టి షీల్డ్ చేయండి.  దాని వల్ల గాలిలో ఉన్న తేమ దానిలోకి చేరదు.

ప్రకటన

Comfort core

3) కంటెయినర్లని వాడండి

లెదర్‌ని వస్త్రాల సంచులలో  లేదా చెక్క టంకు పెట్టెల్లో లేదా సూట్ కేసుల్లో ఉంచాలి.  అయితే, ప్లాస్టిక్ బాక్సుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచరాదు.  లెదర్‌కు గాలి ఆడాలి మరియు ప్లాస్టిక్ డబ్బాలలో గాలి ఉండదు.  అలాగే,మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ లెదర్ దుస్తులుంటే, వాటిని ఒకదానిపై ఒకటిగా పేర్చవద్దు.  న్యూస్ పేపర్ పొరలుగా వేసి వేరు వేరుగా ఉంచాలి, దాని వల్ల వాటి మన్నిక కాలం ఎక్కువగా ఉంటుంది.

4) కండిషనర్ని వాడండి

మీ లెదర్ జాకెట్ మెరుస్తూ మదువైన ఫినిష్ నిలిచి ఉండాలంటే, మంచి నాణ్యత గల లెదర్‌  కండిషనర్‌ని వాడాలి.  మదువైన బట్టపై కండిషనర్ సన్నని పొరగా వేసి, మీ జాకెట్‌పై మృదువుగా  రాయాలి, సహజంగా ఆరనివ్వాలి. ఇది ఎక్కువ కాలం ఆకర్షణీయంగా ఉంచడంలో సహాయపడుతుంది.

5) ఉష్ణోగ్రతను నియంత్రించాలి

ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేదా తేమగా ఉన్న ప్రదేశాలలో లెదర్  ఉంచకూడదు.  వాటిని వాతావరణ తేమ లేదా ఎండ కనీసం ఉండేచోట నిలవ చేయాలి.

6) మీ జాకెట్‌కి గాలి ఆడనివ్వండి

మీ లెదర్ జాకెట్లకు గాలి ఎక్కువగా కావాలి.  కనుక, వాటిని మధ్య మధ్యలో బయటికి తీస్తుండాలి, గాలిలో 5-10 నిమిషాల పాటు ఉంచాలి.  దీనివల్ల వాటికి గాలి తగులుతుంది.

అకట్టుకునేలా తయారవాలనుకుంటున్నారా? మీ లెదర్ జాకెట్‌ని శుభ్రం చేయండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది