మీ కాటన్ దుస్తులను మెషీన్ తో ఆరబెట్టాలా లేదా గాలికి ఆరబెట్టాలా అనే నిర్ణయం ఎలా తీసుకోవాలో ఇక్కడ సూచించబడింది

కొన్ని దుస్తులను మీ వాషింగ్ మెషీన్లో ఆరిపోయేలా చేయవచ్చు, మరికొన్నింటికి ప్రత్యక్ష సూర్యకాంతిలో లేదా నీడలో గాలిలో ఆరబెట్టడం అవసరం. మీరు ఎలా నిర్ణయిస్తారు? ఈ వ్యాసం మీకు కొన్నిపాయింటర్లను ఇస్తుంది.

వ్యాసం నవీకరించబడింది

Here’s How to Decide Between Machine-Drying or Air-Drying Your Cotton Clothes
ప్రకటన
Comfort core

లాండ్రీ తర్వాత మీ బట్టలు ఆరబెట్టడానికి రెండు మార్గాలు ఉన్నాయి:  మెషీన్ డ్రైయింగ్ మరియు గాలికి ఆరబెట్టడం. రెండు పద్ధతులకు వాటి వాటి ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి పద్ధతి మీ దుస్తులకు ఏమి చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, మీరు సరైన స్థలంలో ఉన్నారు. ఈ వ్యాసంలో, ఈ రెండు ఆరబెట్టే  పద్ధతుల యొక్క ప్రయోజనాలను మేము మీకు చెప్తాము.

అవి ఏంటో త్వరగా చూద్దాం.

ఎంబ్రాయిడరీ చేయబడిన  కాటన్ వస్త్రాలు

కాటన్  సున్నితమైన ఫాబ్రిక్, దీనికి అదనపు జాగ్రత్త అవసరం. మీ వాషింగ్ మెషీన్ లో మీ ఎంబ్రాయిడరీ కాటన్ వస్త్రాలను ఆరబెట్టడం మానుకోండి. గాజు వర్క్, స్టోన్ వర్క్ లాంటివి ఉన్న కాటన్ వస్త్రాలను వాషింగ్ మెషీన్ లో ఆరబెట్టకూడదు. వేడి మరియు రాపిడి ఎంబ్రాయిడరీకి ​​నష్టం కలిగిస్తుంది. ఇది మీ వాషింగ్ మెషీన్ ను కూడా దెబ్బతీస్తుంది. ఈ వస్త్రాలను పగటిపూట ఎండలో ఆరబెట్టాలని మేము సూచిస్తున్నాము.

రబ్బర్ ప్రింటెడ్ కాటన్ వస్త్రాలు

ప్రకటన

Comfort core

రబ్బరు ప్రింట్లతో ఉన్నా మీ కాటన్ వస్త్రాలు కూడా మిషనులో ఆరబెట్టకూడదు. మిషనులో ఆరబెట్టడం వలన రబ్బరు ముద్రణ పై పగుళ్లు వస్తాయి మరియు అది దెబ్బతింటుంది. ఈ వస్త్రాలను సహజమైన పగటిపూట ఎండలో ఆరబెట్టాలని మేము సూచిస్తున్నాము. అలాగే, ఆరబెట్టడానికి ముందు వస్త్రాన్ని లోపలికి తిప్పాలని గుర్తుంచుకోండి. ఇది రబ్బరు ముద్రణ మరియు వస్త్ర రంగును కాపాడుతుంది.

కాటన్ సాక్స్

మీ కాటన్ సాక్స్ కూడా సున్నితమైనవి. దీనిలో ఉన్న సాగేతత్వం మీకు సరైన ఫిట్‌ని ఇస్తుంది. సహజ సూర్యకాంతిలో వీటిని ఆరబెట్టాలని మేము సూచిస్తున్నాము. మెషీన్ లో ఆరబెడితే సాగేతత్వం ఎక్కువగా సాగి ఆకారాన్ని దెబ్బతీస్తుంది.

సాగదీయగల కాటన్  వస్త్రాలు

సాగదీయగల కాటన్ వస్త్రాలను కాటన్ మరియు ఎలాస్టేన్ కలయికతో తయారు చేస్తారు. కాటన్ ఒక గాలిని  పీల్చగల వస్త్రం, అయితే ఎలాస్టేన్ మీ బట్టలకు స్థితిస్థాపకత ఇస్తుంది. ఈ వస్త్రాలను ఉతికే సమయంలో మరియు తరువాత పూర్తి జాగ్రత్త వహించాలి. వీటిని పాక్షికంగా ఉన్న నీడలో ఆరబెట్టాలని మేము సూచిస్తున్నాము. మెషీన్ లో ఆరబెట్టడం వల్ల వస్త్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది మరియు సరిపోని విధంగా మారవచ్చు. 

ఇలా చేస్తే చాలు! మీ కాటన్ దుస్తులు లాండ్రీ చేసేటప్పుడు మీరు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే, తేలికపాటి డిటర్జెంట్ ఉపయోగించమని మేము సూచిస్తున్నాము. మీ కాటన్లను చేతితో ఉతకాలి అనుకుంటే మీరు సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ ను ప్రయత్నించవచ్చు.

ఈ చిట్కాలు మీకు ఇష్టమైన కాటన్ వస్త్రాలకు ఎక్కువ కాలం జీవితాన్ని ఇస్తాయి.

వ్యాసం మొదట ప్రచురించబడింది