మీ చీరపై కూర మరకలు పడ్డాయా? చింతించకండి, మేము మీకు అండగా నిలుస్తాము.

మీకు ఇష్టమైన చీరపై కూర మరకలు పడటం పీడకలగా అనిపించవచ్చు, ప్రత్యేకించి ఇది సున్నితమైన సిల్క్‌ లేదా స్టైలిష్‌ చిఫాన్‌ అయితే. వాటిని తొలగించడానికి సులభ పద్ధతిని ఇక్కడ ఇస్తున్నాము.

వ్యాసం నవీకరించబడింది

Got Curry Stains on Your Saree? Don’t Worry, We’ve Got Your Back
ప్రకటన
Comfort core

గ్రేవీ చుక్క కూడా మీ అందమైన చీరను నాశనం చేయగలదు. చింతించకండి, మీరు దానిని విసిరివేయాలని అర్థం కాదు. ఆ కూర మరకలను వదింలించుకోవడానికి సులభమైన పద్దతిలో మీకు మేము సహాయపడతాము

మీ చీర నుంచి కూర మరకలను పోగొట్టేందుకు ఈ సరళమైన చేతులతో ఉతికే పద్ధతిని ఉపయోగించండి.

మరకలపై విస్తారంగా రుద్దకండి ఎందుకంటే ఇది మీ చీర ప్రకాశాన్ని మరియు వన్నెను ప్రభావితం చేయవచ్చు.

స్టెప్‌ 1:

1 చిన్న చెంచా బేకింగ్‌ సోడా లేదా 2 చిన్నచెంచాల మొక్కజొన్న పిండిని మరకపై సమంగా చల్లి 10 నుంచి 15 నిమిషాల సేపు ఆగండి.

ప్రకటన

Comfort core

స్టెప్‌ 2:

తరువాత, దుస్తుల కోసం 1 చిన్న చెంచా డిటర్జెంట్‌ని 1 కప్పు నీటిలో మిశ్రమం చేయండి, దీనిలో పరిశుభ్రమైన వస్త్రం దీనిలో ముంచి వలయాకారంలో సొల్యూషన్‌ని మరకపై చల్లండి. కూర మరక మీ చీర నుంచి కనుమరుగవుతుంది.

ఒకవేళ మరక ఇంకా ఉంటే, ప్రయత్నించవలసిన మరొక ప్రక్రియను ఇక్కడ ఇస్తున్నాము.

స్టెప్‌ 1:

1 చిన్న చెంచా డిష్‌ వాషింగ్‌ జెల్‌ని మరియు 1 చిన్న చెంచా వినిగర్‌ని 2 కప్పుల గోరువెచ్చని నీటికి కలిపి మిశ్రమం తయారుచేయండి. మీరు దీనిని తప్పకుండా బాగా కలియబెట్టాలి

స్టెప్‌ 2:

పరిశుభ్రమైన వస్త్రం ఉపయోగించి, ద్రవాన్ని ఫ్యాబ్రిక్‌ సంగ్రహించుకునేంత వరకు ఈ ద్రావణాన్ని మరకపై చల్లండి.

స్టెప్‌ 3:

మరొక పరిశుభ్రమైన వస్త్రం తీసుకోండి, దీనిని చల్లని నీటిలో ముంచండి మరియు పరిశుభ్రమైన ద్రావణాన్ని తొలిగించేందుకు ప్రభావిత ప్యాచ్‌ని తుడవండి.

ఈ పాటికి, మరకలు పోయివుంటాయి. ఒకసారి ఇలా జరిగితే, మామూలు మాదిరిగా మీ చీరను ఉతకండి, చల్లని నీటిని మాత్రమే ఉపయోగించాలని గుర్తుంచుకోండి, ఎందుకంటే మీ చీర రంగును చెక్కుచెదరకుండా ఉంచడానికి ఇది సహాయపడుతుంది.

మరకలను ప్రభావవంతంగా తొలగించేందుకు మరియు మీ చీరను మళ్ళీ సరికొత్త దాని లాగా ఉంచేందుకు  ఈ చర్యలు సహాయపడతాయి.

వ్యాసం మొదట ప్రచురించబడింది