సూక్మక్రిములనుండి దుస్తులు ఎలా కాపాడుకోవచ్చు

మన చుట్టూ ఉన్న గాలితో పాటు, మన పరిసరాలు, దుస్తులు, ఇలా ప్రతీ దానిలో, కంటికి కనపడని క్రిములు ఎన్నో ఉంటాయి. మురికి, బ్యాక్టీరియా మరియు ఇతర క్రిముల నుంచి, మన దుస్తులను జాగర్తగా ఎలా ఉంచుకోవచ్చో తెలుసుకోవడానికి, క్రింద చెప్పే విషయాలను చదివి చూడండి.

వ్యాసం నవీకరించబడింది

సూక్మక్రిములనుండి దుస్తులు ఎలా కాపాడుకోవచ్చు
ప్రకటన
Comfort antibac

సాధారణంగా మన అందరం, దుస్తులను మామూలు డిటర్జెంట్ వినియోగించి వాషింగ్ మెషిన్లో లేదా చేతితో శుభ్రం చేయడం ద్వారా, వాటిలోని మురికి, బ్యాక్టీరియా మరియు క్రిములను సమూలంగా తొలగించవచ్చు అని భావిస్తాము. కానీ అది ఎంత మాత్రమూ వాస్తవం కాదు. చాలాసార్లు, ఇందుకు ఎంతో భిన్నంగా ఉండవచ్చు. కొన్నిసార్లు, మనము చెమట పట్టి, మురికిగా ఉన్న దుస్తులను వాషర్లో వేసి ఉతికినప్పుడు, అవి బయటకు తీసిన వెంటనే, శుభ్రంగా ఉన్నట్టు కనిపిస్తాయి కానీ, పైకి కనపడని రకరకాల క్రిములు బ్యాక్టీరియాలతో పాటు, చెమట మరియు మురికి యొక్క ఆనవాళ్ళను మాత్రం ఇంకా కలిగే ఉంటాయి. దీనికి తోడు, దుస్తులను శుభ్రం చేసిన తరువాత, వాటిలోని తేమ వల్ల ఒక్కోసారి దుస్తుల నుంచి  దుర్వాసన కూడా వస్తూ ఉంటుంది. చాలాసార్లు ఆ వాసన ఎంతో ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. కనుక, మనం మన దుస్తుల నుంచి మురికి, బ్యాక్టీరియా, క్రిములు, దుర్వాసనను సమూలంగా నాశనం చేయడానికి, మరికొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ మీ కోసం, మీ చీరలు, టవల్స్ మరియు ఇతర దుస్తులను శానిటైజ్ చేయడంలో మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను సూచించాము. ఇవి పాటించడం ద్వారా, మీరు మీ దుస్తులను ప్రతీ వాష్ తరువాత, పూర్తిగా క్రిములు లేకుండా ఉండేలా, దానితో పాటు శుభ్రంగా, పరిమళభరితంగా ఉండేలా కూడా చేసుకోవచ్చు.

దుస్తులను వేడి నీటిలో ఉతకండి, అంతకంటే ముందు లేబుల్ చెక్ చేయడం మరచిపోకండి సుమా!

మీరు నమ్ముతారో లేదో కానీ, మాకు అయితే ఈ చిట్కా అద్భుతంగా పని చేసింది. వినడానికి తేలికగా అనిపించవచ్చు కానీ, 55 నుంచి 60 డిగ్రీల వేడిలో, దుస్తులను శుభ్రపరచడం అనేది చాలా మంచి అలవాటు. ఎందుకు అనంటారా ? ఎందుకంటే ఇది మీ దుస్తులను బ్యాక్టీరియాకు నిలవు కాకుండా కాపాడుతుంది కనుక. అలా, వేడి నీటిలో ఉతికిన తరువాత, దుస్తులు ఎంతో శుభ్రంగా ఉండడాన్ని మేము గమనించాము కూడా !! అయితే, వేడి నీటిలో శుభ్రం చేసిన తరువాత, కొన్ని దుస్తులు కుంచించుకుపోయే అవకాశం ఉందని కూడా మాకు తెలుసు. అందుచేతనే, దుస్తులను ఎంత వేడితో శుభ్రపరచవచ్చు అని తెలుసుకోవడానికి వాష్ కేర్ లేబల్ ను ఎప్పుడూ చెక్ చేస్తూ ఉంటాము. అయితే, ఈ రోజులలో చాలా వాషింగ్ మెషిన్లు, దుస్తులకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ సంరక్షణను అందించడానికి బిల్ట్ ఇన్ హీటర్లను కూడా కలిగి ఉంటున్నాయి. అవి హీట్, వార్మ్, అలర్జీ ఫ్రీ, ఇలా రకరకాల మోడ్స్ కలిగి ఉంటాయి. మీరు శుభ్రపరచాలి అనుకున్న దుస్తుల తీరుకు తగ్గట్టు ఈ మోడ్స్ ను సెట్ చేసుకోవచ్చు.

మురికి క్రిములను వదిలించుకోవడానికి ఎప్పటికప్పుడు వాషర్ ను శుభ్రం చేయడం మరచిపోవద్దు

మీ వాషింగ్ మెషిన్లో పేరుకుపోయే మురికి, బ్యాక్టీరియా వల్లనే మెషిన్ నుంచి దుర్వాసన వస్తుంది అని మీకు తెలుసా ? కానీ ఇదే నిజం అని మేము అనుభవపూర్వకంగా తెలుసుకున్నాము. అయితే, వాషింగ్ మెషిన్లలో లేటెస్ట్ వర్షన్ కలిగి ఉన్నవారయితే దీని గురించి  పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ మెషిన్లు టబ్ లోపలి గోడల పై మిగిలి ఉన్న మలినాలను ఆటోమేటిక్ గా శుభ్రం చేయడం కొరకు ముందస్తుగానే ప్రోగ్రామ్ చేయబడి ఉన్నాయి కనుక. ఈ ప్రక్రియ ప్రతీ వాష్ సైకిల్ కూ జరుగుతుంది. కానీ, ఒకవేళ మాలాగే మీకు కూడా ప్రీ ప్రోగ్రామ్డ్ వాషింగ్ మెషిన్ కనుక లేకపోతే, అప్పుడు మీరు రెండు మూడు వాష్ల తరువాత, మిగిలి ఉన్న మలినాలను తొలగించడం కొరకు, మెషిన్ క్లీనర్ తో వాషింగ్ మెషిన్ ను రన్ చేయవచ్చు.

ప్రకటన
Comfort antibac

దుస్తులను వాష్ చేసిన తరువాత ఫ్యాబ్రిక్ కండిషనర్ ను వినియోగించండి

కొంతకాలం పాటు కేవలం డిటర్జెంట్ తో మాత్రమే మన దుస్తులను శుభ్రం చేసిన తరువాత, దుస్తులు చక్కగా ఉండటానికి అది మాత్రమే సరిపోదు అని మనం గ్రహించాము కదా !! అందుకోసమే మేము, యాంటీ జెర్మ్ బూస్టర్లు మరియు పరిమళభరిత పదార్ధాలు కలిగి, దుస్తులను క్రిమిరహితంగా ఉంచుతూ వాటికి ఎల్లప్పుడూ పరిమళాన్ని అందించే, కంఫర్ట్ ఆఫ్టర్ వాష్ యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ను వినియోగించడం మొదలు పెట్టాము. ఎందుకంటే, మన సాధారణ డిటర్జెంట్ ఇవేవీ చేయలేదు అన్న విషయం గ్రహించాము కనుక.  ప్యాకింగ్ పైన ఉన్న వివరాలు చదివిన తరువాత, ఇది ఐదు శక్తివంతమైన సహజ సారాలు - లవంగ సారం, దాల్చిన నూనె, పచ్చౌలీ ఆయిల్, సిట్రోనెల్లా ఆయిల్ మరియు గుయాక్ వుడ్ సారం వంటి వాటితో తయారు చేయబడింది అని తెలుసుకున్నాము. అందువల్లే, ఇది మన దుస్తుల పైన ఉన్న క్రిములను 99 శాతం సమూలంగా నాశనం చేయగలుగుతుంది అని కూడా గ్రహించాము.

ఈ ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ కండిషనర్ వినియోగించిన తరువాత, దుస్తులు చూడటానికి మృదువుగా, మెత్తగా ఉన్నట్టు కూడా మేము గమనించాము. మీరు డిటర్జెంట్ తో దుస్తులను శుభ్రపరచిన తరువాత, ఓ బకెట్ నీళ్ళల్లో, ఒక సగం కప్పు  కండిషనర్ వేసి, అందులో మీ దుస్తులను ఒక అయిదు నిముషాల పాటు నానబెట్టండి. దానిని వినియోగించే ముందు, ఒకసారి ప్యాకింగ్ మీద ఉన్న సూచనలను శ్రద్ధగా చదవండి.

తేమను తొలగించడానికి సరైన పద్ధతిలో మీ దుస్తులను ఆరబెట్టండి

తడి దుస్తులు సరిగ్గా ఆరకపోతే, వాటిలో క్రిములు చేరే ప్రమాదం ఉంది కనుక, దుస్తులు సరిగ్గా ఆరడం ఎంతో ముఖ్యం. దాని కొరకే,  వాషింగ్ మెషిన్లలో దుస్తుల నుంచి తేమను తొలగించడానికి,  డ్రైయర్లు డిజైన్ చేయబడ్డాయని మనకి తెలుసు. అలాగే, దుస్తులు చక్కగా ఆరాలి అంటే, డ్రై రన్ సైకిల్ చాలా కీలకం అని కూడా తెలుస్తోంది. సాధారణంగా ఒక్కో ఫ్యాబ్రిక్ ను ఒక్కో విధంగా డ్రై చేస్తాము కదా !! అయితే మీరు గమనించినట్లయితే, క్రొత్తగా వస్తున్న మెషిన్లు, ఏ ఫ్యాబ్రిక్ కు తగ్గట్టుగా ఆ ఫ్యాబ్రిక్ ను డ్రై చేయడం కొరకు, అనేక డ్రైయింగ్ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. దీనితో పాటు, మీరు మన పురాతన పద్ధతుల ప్రకారం, మీ దుస్తులను శుభ్రం చేసిన తరువాత, ఎటువంటి క్రిములు, బ్యాక్టీరియా దరి చేరకుండా ఉండటానికి వాటిని ఎండలో కూడా ఆరబెట్టవచ్చు. ఒకవేళ వాష్ కేర్ లేబుల్ కనుక, దుస్తులకు కుంచించుకుపోయే స్వభావం ఉన్నదని పేర్కొన్నట్లయితే, అప్పుడు వాటిని సూర్యరశ్మి అందే విధంగా ఎండలో ఆరబెట్టడమే మేలయిన  పద్ధతి.

అలర్జీలు మరియు బ్యాక్టీరియా తొలగించడం కొరకు మీ దుస్తులను స్టీమ్ చేయండి

స్టీమ్ ను ఉపయోగించి దుస్తులను శుభ్రం చేయడం ద్వారా, బ్యాక్టీరియా మరియు క్రిములను ఎక్కువ శాతం తొలగించవచ్చని మేము మా అనుభవం ద్వారా తెలుసుకున్నాము. ఇది నాణ్యమైన సానిటైజర్ గా పని చేయడంతో పాటు, మీ దుస్తులకు చక్కటి మెరుపును కూడా అందిస్తుంది. అలర్జీలు మరియు బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు, అన్ని వేళలా దుస్తులను పరిశుభ్రంగా ఉంచడానికి  ప్రయత్నించే కొన్ని ఉత్తమ మెళకువలలో స్టీమింగ్ కూడా ఒకటిగా పరిగణించబడుతుంది.

ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి, మీ దుస్తులను బ్యాక్టీరియా, క్రిములు, మురికి వంటివేవి దరి చేరకుండా, అవి ఎల్లప్పుడూ క్రొత్తగా, పరిమళభరితంగా ఉండేలా చూసుకోండి.

రహస్య చిట్కా: మీరు భారతదేశపు అత్యుత్తమ బ్రాండ్లను కూడా ఇక్కడ ఉచితంగా ప్రయత్నించవచ్చు.

వ్యాసం మొదట ప్రచురించబడింది