
సిల్క్ ఒక సున్నితమైన వస్త్రం కాబట్టి సరైన సంరక్షణ అవసరం. మహిళలు తమ సాంప్రదాయ పట్టు చీరలను దాచిపెట్టినట్లే, పురుషులు కూడా తమ విలువైన పట్టు టైను దాచి పెట్టి యువతరానికి అందిస్తారు. మీరు చేయాల్సిందల్లా వాటి సరైన నిర్వహణను నిర్ధారించడానికి కొన్ని సాధారణ చిట్కాలను అనుసరించండి.
మరకలను తొలగించడానికి
ముఖ్యంగా గుర్తుంచుకోవల్సిన విషయం టై పై ఏ మైన మరకలు ఒక శుభ్రమైన వస్త్రంతో తొలగించాలి. ఎట్టిపరిస్థితులలోనైనా, దెబ్బతిన్న ప్రాంతాన్ని రుద్దకండి, ఎందుకంటే మరక వ్యాప్తి చెంది, దానిని తొలగించే ప్రక్రియ మరింత కష్టతరం అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ మరక నూనె లేదా గ్రీజు లాగా ఉంటే దానిపై కొంచెం టాల్కమ్ పౌడర్ వేసి రాత్రంతా అలాగే ఉండనివ్వాలి. ఇప్పుడు, టాల్కమ్ పౌడర్‌ను శుభ్రంగా, పొడి గుడ్డతో మెత్తగా బ్రష్ చేయండి. ఇలా చేస్తే ఫాబ్రిక్ పై ఉన్న మరక తొలగిపోతుంది. కాకపోతే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి.
ఉతకడానికి
మీ సిల్క్ టైలను డ్రై-క్లీనింగ్ కు ఇవ్వడం మంచిది. మీ డ్రైక్లీనర్ కు ఇచ్చేటప్పుడు హాండ్ ప్రెస్ చేయిమని చెప్పాలి, ఇలా చేస్తే టై అంచులు పాడుకాకుండా సంరక్షించడంలో సహాయపడుతుంది. ఒకవేళ మీ టైను చేతితో ఉతుక్కోవాలనుకుంటే, మైల్డ్ డిటర్జెంట్, చల్లటి నీటినే వాడాలి. ఎందుకంటే వేడినీరు బట్టను పాడు చేస్తుంది. మీ సిల్క్ టైను డైరెక్ట్ నేరుగా ఎండలో ఆరబెట్టవద్దు ఎందుకంటే ఇది బట్టను దెబ్బతీస్తుంది మరియు అది వెలిసిపోయేలా చేస్తుంది.

ముడుతలను తొలగించడానికి
మీ సిల్క్ టై నుంచి ముడుతలను వదిలించుకోవడానికి హ్యాండ్ స్టీమర్ ఉపయోగించడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. దీంతో ముడతలు మాయమవుతాయి. ప్రత్యామ్నాయంగా, ముడుతలను ఇస్త్రీ కూడ చేయవచ్చు. ఇలాచేయడానికి, మీ సిల్క్ టై క్రింద మరియు పైన ఒక టవల్ పెట్టాలి. టవల్ మీద కొన్ని చుక్కల నీరు పిచికారీ చేయాలి. ఇస్త్రీ పెట్టెను అతి తక్కువ ఉష్ణోగ్రతకు అమర్చి సిల్క్ టై పై ఉన్న ముడతలను మాయం చేస్తుంది. మీరు టై ను బయటికి తీసే ముందు కొన్ని నిమిషాలు వేచి ఉండండి.
నిల్వ చేయడానికి
మీ సిల్క్ టైను ఎల్లప్పుడూ చల్లని, చీకటి ప్రదేశంలో నిల్వ చేయండి. వీటిని మడత పెట్టకుండా, బాల్ మాదిరిగా రోల్ చేయాలి లేదా వదులుగా టై ర్యాక్‌లో వేలాడదీయాలి.
మా సులభమైన చిట్కాలను అనుసరించండి మరియు మీ ‘ముడి’ సమస్య చరిత్ర అవుతుంది!