భార జలం కారణంగా మీ పంపులకు మరకలు అవుతున్నాయా? అవి తిరిగి మెరిసేలా చేసేందుకు మీ కోసం ఓ తేలికైన చిట్కా!

భార జలం ఆవిరి అయినప్పుడు, సున్నపుపొరను విడుదల చేస్తుంది. దీనితో పంపుల చుట్టూ గట్టిగా ఉండే తెల్లని పదార్థం ఏర్పాటు అవుతుంది.

వ్యాసం నవీకరించబడింది

Are your taps covered in hard water stains? Here’s a simple method to make them shine again!
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

చాలా కఠినంగా ఏర్పడిన పదార్థాలను తొలగించడానికి వెనిగర్ మరియు నిమ్మ రసాల మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఇందులో మరింతగా ఆమ్ల స్వభావాలు ఉంటాయి.

సున్నపుపొర హానికరం కాకపోయినా, అది పంపు నుంచి నీటి ప్రవాహాన్ని తగ్గించివేస్తుంది. ఈ 3 చిట్కాలను ఉపయోగించి పంపుల చుట్టూ ఉండే ఆ పదార్ధాలను తొలగించవచ్చు.

దశ 1:

శుభ్రం చేయడం. నీరు కలపని వెనిగర్‌ను పంపులపై అప్లై చేయండి. సులభంగా చేసేందుకు ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్‌ను ఉపయోగించవచ్చు. ప్రత్యామ్నాయంగా ½ కప్పు నిమ్మ రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇది మంచి పరిమళాన్ని కూడా వెదజల్లుతుంది.

ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

దశ 2:

అలాగే ఉంచండి. ఆయా ద్రవాలు పోసిన తరువాత, పదార్ధాల తీవ్రతను అనుసరించి 15 నుంచి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

దశ 3:

తుడిచేయండి. మరకలు పోయేలా చేయడానికి ఆ ప్రాంతాన్ని గట్టిగా తుడవండి. స్క్రబ్‌ను ఉపయోగించకండి, ఇది మరీ కఠినంగా ఉండడంతో, పంపు ఉపరితలానికి నష్టం కలిగించవచ్చు.

ఇది చాలా తేలిక మాత్రమే కాదు, త్వరగా కూడా పూర్తయిపోతుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది