మీ ఇంటి సువాసనను పవిత్రంగా చేయాలనుకుంటున్నారా? ఇది సులభం!

సీజన్‌ ఏదైనా సరే మీరు మీ ఇంటిని సువాసన వచ్చేలా చేయాలనుకుంటున్నారా? మీరు ఉపయోగించగల కొన్ని అబ్బురపరిచే చిట్కాలను ఇక్కడ ఇస్తున్నాము.

వ్యాసం నవీకరించబడింది

Want to Make Your Home Smell Divine? It’s Easy!
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

రోజంతా కష్టపడి పనిచేశాక ఆహ్లాదకరమైన సువాసన వచ్చే ఇంటికి తిరిగిరావడానికి మించినది ఏదీ ఉండదు. ఇది తక్షణం మీలో ఉల్లాసం కలిగిస్తుంది మరియు మీరు రిలాక్స్‌ అవ్వడానికి సహాయపడుతుంది. మీ ఇంటిని సువాసనతో ఉంచేందుకు అనేక మార్గాలు ఉండగా, సరళమైన మరియు సరసమైన ధరకు లభించే అత్యుత్తమ వాటిని ఇక్కడ ఇస్తున్నాము.

మీరు బేకింగ్‌ సోడాకు కొద్ది చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ని కూడా మిశ్రమం చేసి ఆహ్లాదకరమైన సువాసన కోసం మీ ఇంటిలోని భిన్న మూలల్లో చిన్నబౌల్స్‌ లో దీనిని పెట్టండి. కుటుంబ సభ్యుల్లో ఎవరికీ ఎలర్జీ లేదనే విషయం చెక్‌ చేసేందుకు మొదటగా చిన్న ప్రదేశంలో ఎల్లప్పుడూ ఆయిల్స్‌ ని మరియు  ఘటికాంశాలను పెట్టాలని గుర్తుంచుకోండి.

స్ప్రే బాటిల్స్‌ ని ఉపయోగించండి

 ఒక బౌల్‌లో, 1 కప్పు నీళ్ళు, 2 పెద్ద చెంచాల  వనిల్లా సారం మరియు 6-7 చుక్కల మీకు ఇష్టమైన ఎసెన్షియల్‌ ఆయిల్‌ని కలపండి. చెంచాతో దీనిని బాగా మిశ్రమం చేసి పిచికారి బాటిల్‌లో పోయండి. అవసరమైన విధంగా పిచికారి చేయండి.

ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ నీటితో మెరుగ్గా మిశ్రమం కావడానికి వనిల్లా సారం వీలు కల్పిస్తుంది. ఇది ఇంట్లో తయారుచేసుకున్న క్రిమిసంహారంగా కూడా పనిచేస్తుంది. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కోసం, మీకు ఆకర్షణీయంగా ఉండేదానిని ఎంచుకోండి మరియు భిన్న సెంటులతో  మొహమాటపడకుండా ప్రయోగం చేయండి. నారింజ లేదా  పంపరపనస లాంటి తాజాదనం ఇచ్చే సిట్రస్‌ సెంట్‌లు, అలాగే మల్లెపువ్వు లేదా రోజాపువ్వు లాంటి మరింత సౌమ్యమైనవి, బాగా పనిచేస్తాయి.

ప్రకటన

Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

రీడ్‌ డిఫ్యూజర్‌లను ఉపయోగించండి

రీడ్‌ డిఫ్యూజర్‌లు అధునాతనంగా కనిపిస్తాయి మరియు తయారుచేయడం సులభం. ఈ సహజ రూమ్‌ ఫ్రెష్‌నర్‌ కోసం, మీకు వేస్‌, బేంబూ స్కీవర్స్‌, బేబీ ఆయిల్‌, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, మరియు అలంకరణ కోసం రిబ్బన్స్‌ లేదా స్టిక్కర్‌లు అవసరమవుతాయి (ఐచ్ఛికం). 3-4 చిన్న చెంచాల ఒకటి లేదా విభిన్న ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ యొక్క సమ్మేళనాన్ని వేస్‌లో పోయండి. 2 పెద్ద చెంచాల బేబీ ఆయిల్‌ కలపండి. తరువాత, బేంబూ స్టిక్స్‌ కలపండి. స్టిక్‌ పైకి ప్రయాణించే మరియు సువాసనను తగ్గించే ద్రావణాన్ని తయారుచేసే చిన్న చానల్స్‌ వీటిల్లో ఉంటాయి. మీరు తప్పకుండా మీ వేస్‌ ఎత్తు కంటే ఎత్తయిన స్టిక్లను ఎంచుకోండి.

సిమ్మర్‌ పాట్స్‌ ఉపయోగించండి

4 కప్పుల నీటిని కుండలో పోసి మరిగించండి. పూల పరిమళం కోసం మీరు చేతినిండుగా లావెండర్‌ రెమ్మలు , సగం దానిమ్మగింజలు, కొద్దిగా ఎండిపోయిన ఆకులు మరియు ఫిగ్‌ కలపవచ్చు. సుగంధద్రవ్యాల సువాసన కోసం, మీరు 2 దాల్చిన చెక్కలు, చేతినిండుగా స్టార్‌ సోంపు మరియు లవంగాలు కలపవచ్చు. తాజా సువాసన కోసం, మీరు కొద్దిగా నిమ్మ బద్దలు మరియు చేతినిండుగా పుదీనా ఆకులు కలపవచ్చు. సంవత్సరంలో సమయాన్ని బట్టి మీరు ఘటికాంశాలను మార్చవచ్చు. వేసవి కాలానికి నిమ్మ, పెప్పర్‌మింట్‌ మరియు రోజ్‌మేరీ గొప్ప ఎంపికలు కాగలవు. నారింజ మరియు దాల్చినచెక్క యొక్క సౌకర్యవంతమైన సెంట్లు శీతాకాలంలో మీ ఇంటిని వెచ్చగా చేస్తాయి.మీరు కలపాలనుకుంటున్న సువాసనను మీరు ఎంచుకుంటే, దానిని నీరు గల పాన్‌లో పెట్టండి. తక్కువ మంటపై దానిని ఉడికించండి. ఇది చల్లబడితే, బౌల్‌లోకి మిశ్రమం మార్చండి. ఈ సువాసన వచ్చే బౌల్‌ని ఏ గదిలోనైనా పెట్టండి. ఇది మీ గదిని ఆహ్లాదకరమైన సువాసనతో ఉంచుతుంది. భిన్న గదులకు మీరు అనేక కుండలు పెట్టవచ్చు మరియు ప్రతి స్థలానికి భిన్న సువాసన చేర్చుతుంది.

ముందుకెళ్ళండి మరియు మీ ఇంటిని కమ్మని సువాసనతో ఉంచండి!

వ్యాసం మొదట ప్రచురించబడింది