పర్యావరణానికి స్నేహపూర్వకమైన టాయిలెట్‌ ఫ్రెష్‌నర్‌ని ఇంట్లో తయారుచేయడం ఎప్పుడూ ఇంత సులభంగా లేదు!

ఈ సులభ, డిఐవై టాయిలెట్‌ ఫ్రెష్‌నర్స్‌తో మీ టాయిలెట్‌ని తాజా సువాసన వచ్చేలా ఉంచండి.

వ్యాసం నవీకరించబడింది

Making an Eco-Friendly Toilet Freshener at Home Has Never Been Easier!
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

ఈ ఇబ్బందికరమైన దుర్వాసనలను పోగొట్టేందుకు ఎయిర్‌ ఫ్రెష్‌నర్‌ని కొనవలసిన అవసరం మనందరికీ అనిపిస్తుంది. ఈ ఫ్రెషనర్స్ ని ఇంటి వద్ద తయారుచేయడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు చేయవచ్చు! వీటిని ఇంటి వద్ద తయారుచేయడం హానికారక రసాయనాలను ఉపయోగించడాన్ని నివారిస్తుంది మరియు దీనిని చేయడం చాలా సులభం. మీ టాయిలెట్‌లకు సహజమైన ఎయిర్‌ ఫ్రెష్‌నర్స్‌ అన్నిటినీ సృష్టించేందుకు కొన్ని అద్భుతమైన డిఐవై రెసిపీలు ఇక్కడ ఇస్తున్నాము.

1) లెమన్‌ - రోజ్‌మేరీ బౌల్‌

మార్కెట్‌లో సులభంగా లభించే కొన్ని ఘటికాంశాలు మీ టాయిలెట్‌ ఎప్పడూ దుర్వాసన లేకుండా చూస్తుంది. మీకు కావలసిందల్లా నిమ్మ, వనిల్లా సారం మరియు రోజ్‌మేరీ. సగం గిన్నెను నీటితో నింపండి. 1 ముక్క నిమ్మకాయ, కొన్ని స్ప్రింగుల రోజ్‌మేరీ మరియు ½  పెద్ద చెంచా వనిల్లా సారాన్ని దానికి కలపండి. బౌల్‌ని మీ బాత్‌రూమ్‌లో పెట్టండి. మీ టాయిలెట్‌ని తాజా సువాసనతో ఉంచేందుకు ప్రతి మూడు రోజులకు ప్రక్రియను తిరిగి చేయండి.

2) సెంటెడ్‌ ఉడెన్‌ బ్లాక్స్‌

2 కప్పుల సెంటెడ్‌ ఆయిల్‌ని డబ్బాలో పోసి దానిలో ఉడెన్‌ బ్లాక్‌ పెట్టండి. ఏ రకమైన కలప అయినా నూనెలను పీల్చుకుంటుంది, మార్కెట్‌లో సులభంగా లభించేదానిని మీరు ఎంచుకోవచ్చు. దీనిని రాత్రంతా పేరుకోనివ్వండి. ఉదయానికల్లా బ్లాక్‌ ఆ ఆయిల్‌ని పీల్చుకుంటుంది. ఈ ఉడెన్‌ బ్లాక్‌ని మీ టాయిలెట్‌లో ఉంచండి. సువాసనను తరచుగా మార్చేందుకు విభిన్న సెంటెడ్‌ ఆయిల్స్ ని ప్రయత్నించండి.

ప్రకటన

Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

3) అత్యావశ్యక ఆయిల్స్‌

డబ్బాను ¾ కప్పు నీళ్ళు, 2 పెద్ద చెంచాల  ఓడ్కా మరియు 1 పెద్ద చెంచా రబ్బింగ్‌ ఆల్కహాల్‌ (అసెటోన్‌ లేదా హ్యాండ్‌ శానిటైజర్‌) నింపండి. ఇప్పుడు, 8 చుక్కల పెప్పర్‌మెంట్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ని కలిపి బాగా కలియబెట్టండి. ఈ మిశ్రమాన్ని పిచికారి సీసాలో పోసి అవసరమైనప్పుడల్లా ఉపయోగించండి. ఒకసారి సీసాని ఉపయోగిస్తే భిన్న సువాసన కోసం మీరు వివిధ ఎసెన్షియల్‌ ఆయిల్స్ ని ప్రయత్నించవచ్చు.

మీ టాయిలెట్‌ని క్రమంతప్పకుండా శుభ్రం చేయడం కష్టమైన పని కాదు. దుర్వాసనలను నివారించేందుకు మరియు క్రిములను చంపడానికి ఇది ఉత్తమ మార్గం. శుభ్రం చేసిన తరువాత, డిఐవై ఫ్రెష్‌నర్‌ని తయారుచేసేందుకు ఈ సూచనలను ఉపయోగించడం మీ టాయిలెట్‌ మంచి సువాసనతో ఉంచుతుంది.

వ్యాసం మొదట ప్రచురించబడింది