
ప్రశాంతంగా స్నానం చేయడానికి, షవర్ బాత్ చేయడానికి మనకు తప్పనిసరిగా అవసరమైన వస్తువు గీజర్. చలికాలంలో అయితే, దీనితో అవసరం మరీ ఎక్కువగా ఉంటుంది. గీజర్ జీవితకాలం పెరిగేందుకు ఇక్కడ ఇచ్చిన కొన్ని చిట్కాలను అనుసరిస్తే సరిపోతుంది.
హీటింగ్ యూనిట్ విషయంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, దాని పరిష్కారం కోసం అనుభవం గల నిపుణులను పిలవడమే ఉత్తమ మార్గం.
1. ప్లగ్‌ను తనిఖీ చేయండి
విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా గీజర్ షార్ట్ సర్క్యూట్ అయ్ యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధారణ స్విచ్‌లకు బదులుగా, ఎంసీబీని ఉపయోగించడం సరైన పని.
2. వాల్వ్ లను తనిఖీ చేయండి

ఏడాదికి ఒకసారి, వాల్వ్ ల యొక్క ఉష్ణోగ్రత మరియు ప్రెజర్ స్థాయిలను తనిఖీ చేయండి(అవి గీజర్ కింది భాగంలో ఉంటాయి). అవి లీక్ అవుతుంటే వాటిని వెంటనే మార్చండి.
3. డబ్బు ఆదా
హీటర్ యొక్క టెంపరేచర్‌ను తక్కువగా ఉంచండి, అప్పుడు నీరు తొందరగా వేడెక్కుతుంది. అది డబ్బును ఆదా చేయడం మాత్రమే కాదు, ప్రమాదకర గాయాలు కాకుండా కాపాడుతుంది.
4. ఇవి నివారించండి
సుదీర్ఘ కాలం గీజర్‌ను ఆన్ చేసి ఉంచడం అంటే, ఆ ఉపకరణం జీవిత కాలం చేజేతులా తగ్గించేయడమే. మీకు అవసరం అయిన 5 నిమిషాల ముందు మాత్రమే దానిని ఆన్ చేయండి.