బాత్రూమ్ ఇబ్బందులు మీకు చికాకులు కలిగిస్తున్నాయా? ఈ సమస్యకు పరిష్కారం ఉంది!

మీ బాత్‌రూమ్‌ సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవాలనుకుంటున్నారా? తక్కువ సమయంలో వాటిని పరిష్కరించేందుకు ఉత్తమ మార్గాలను ఇక్కడ ఇస్తున్నాము!

వ్యాసం నవీకరించబడింది

Bathroom Woes Giving You the Blues? Problem Solved!
ప్రకటన
Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

మీ బాత్‌రూమ్‌లో పూడుకుపోయిన డ్రెయిన్‌లు, లీక్‌ అవుతున్న కొళాయిలు మరియు తుప్పుపట్టిన ఫౌసెట్‌ల గురించి మీరు చింతిస్తున్నారా? ఇలాంటి సమస్యలు ఏ సమయంలోనైనా మీకు కలగవచ్చు. చింతించకండి, మేము మిమ్మల్ని కాపాడగలము. ఈ కింద పేర్కొన్నవి కొన్ని సులభ సూచనలు, ఇవి ఈ సమస్యలు పరిష్కరించగలవు.

1) పూడుకుపోయిన డ్రెయిన్‌లకు

½ గిన్నె వినిగర్‌  మరియు ½ గిన్నె వేడి నీళ్ళ మిశ్రమం తయారుచేయండి. ఈ మిశ్రమాన్ని డ్రెయిన్‌లో పోసి మూత పెట్టండి. 10 నిమిషాల సేపు వేచివుండి, ద్రావకాన్ని పని చేయనివ్వండి. 10 నిమిషాల తరువాత, మరొక గిన్నె మరగకాచిన నీటిని పోసి మ్యాజిక్‌ మాదిరిగా డ్రెయిన్‌ పూడిక తొలగిపోవడం  గమనించండి.

2) తుప్పుపట్టిన ఫౌసెట్‌లకు

నిమ్మకాయను 2 సగాలుగా కోసి, 1 తీసుకొని తుప్పు పట్టిన ఫౌసెట్‌పై తుడవండి. దానిని కొద్ది సేపు అలా ఉంచండి. తరువాత, కొద్దిగా ఉప్పు మరియు నిమ్మ రసం దానిపై చల్లి తుప్పు పట్టిన ప్రాంతానికి సమంగా ఆచ్ఛాదన కల్పించి 2-3 గంటల సేపు వేచివుండండి. తుప్పు వదలగొట్టేందుకు ఇప్పుడు నిమ్మ బద్దను ఫౌసెట్‌పై బాగా రుద్దండి.

ప్రకటన

Domex Fresh Guard Disinfectant Toilet Cleaner

3) లీక్‌ అవుతున్న కొళాయిలకు

తయారీదారుని మాన్యువల్‌ని చదివి కొళాయి జాయింట్‌ విప్పండి. అనంతరం దానిని 1 కప్పు చొప్పున వేడి నీరు మరియు నిమ్మ రసం మిశ్రమంలో ముంచండి. అనంతరం దీనిని పరిశుభ్రమైన వస్త్రంతో తుడిచి కొళాయిని జాగ్రత్తగా తిరిగి బిగించండి. అవసరమైతే నిపుణుడి సహాయం తీసుకోండి.

మీకు అర్థమై ఉంటుంది: మీ బాత్‌రూమ్‌ సమస్యలను పరిష్కరించేందుకు సరళమైన మరియు ప్రభావవంతమైన సూచనలు.

బాత్‌రూమ్‌ డ్రెయిన్‌ పూడుకుపోవడం మీకు నిస్ఫృహ కలిగించడమే కాకుండా, ఇది మీ పైపులకు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు మరియు పెద్ద సమస్యలు కలిగించవచ్చు. ఈ సరళమైన సూచనలు ప్రయత్నించండి మరియు ఆ సమస్యలను పారదోలండి.

వ్యాసం మొదట ప్రచురించబడింది